- Home
- Entertainment
- రాశి ఖన్నా గ్లామరస్ పిక్స్ వైరల్, ఇంటెన్స్ లుక్స్ తో క్రేజీ ఫోజులు.. ఆమె ఆశలన్నీ డిప్యూటీ సీఎం పైనే
రాశి ఖన్నా గ్లామరస్ పిక్స్ వైరల్, ఇంటెన్స్ లుక్స్ తో క్రేజీ ఫోజులు.. ఆమె ఆశలన్నీ డిప్యూటీ సీఎం పైనే
నటి రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ అభిమానుల మధ్య తెగ వైరల్ అవుతున్నాయి. రాశి ఖన్నా ప్రస్తుతం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది.

క్రేజీ హీరోయిన్ గా రాశి ఖన్నా
రాశీ ఖన్నా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కథానాయికగా రాణిస్తోంది.
తెలుగు సినిమాలు
తెలుగులో రాశి ఖన్నా ప్రతి రోజూ పండగే, సుప్రీం, బెంగాల్ టైగర్, తొలి ప్రేమ, జై లవకుశ లాంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది.
తమిళ సినిమాలు
తమిళంలో అడంగ మరు, అయోగ్య, సంఘ తమిళన్, అరణ్మనై 3, అరణ్మనై 4, తిరుచిత్రాంబలం, తుగ్లక్ దర్బార్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తెలుసు కదా
రాశి ఖన్నా చివరగా తెలుసు కదా అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది.
గ్లామరస్ ఫోజులు
షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా, రాశీ ఖన్నా అప్పుడప్పుడు గ్లామరస్ డ్రెస్‌లలో పోజులిస్తూ ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంది.
ఇన్‌స్టాలో పోస్ట్
అందులో భాగంగా రాశీ ఖన్నా నలుపు రంగు గ్లామర్ డ్రెస్‌లో దిగిన హాట్ ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
ఉస్తాద్ భగత్ సింగ్
రాశి ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో నటిస్తోంది. ఇటీవల రాశి ఖన్నాకి వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. దీనితో ఆమె ఆశలన్నీ ప్రస్తుతం ఉస్తాద్ పైనే ఉన్నాయి.

