- Home
- Entertainment
- కెరీర్ పాడవుతుందని టాలీవుడ్ సీనియర్ హీరోకి షాకిచ్చిన రాశి ఖన్నా.. బిగ్ ఆఫర్ వదిలేసుకుందా ?
కెరీర్ పాడవుతుందని టాలీవుడ్ సీనియర్ హీరోకి షాకిచ్చిన రాశి ఖన్నా.. బిగ్ ఆఫర్ వదిలేసుకుందా ?
Raashi Khanna: హీరోయిన్ రాశి ఖన్నా తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో సినిమాని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు గల కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకోండి. ముందుగా ఈ చిత్రంలో నటించేందుకు రాశి ఖన్నా ఆసక్తి చూపింది.

రాశి ఖన్నా సినిమాలు
అందం, అభినయం ఉన్నప్పటికీ సక్సెస్ ఫుల్ చిత్రాలు అందుకోవడంలో హీరోయిన్ రాశి ఖన్నా కాస్త వెనుకబడింది. ఆమె గ్లామర్, క్యూట్ లుక్స్ కారణంగా ఇప్పటికీ ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి కానీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్ గా రాశి ఖన్నా.. సిద్దు జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా ? అనే చిత్రంలో నటించింది. ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో..
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో కూడా రాశి ఖన్నా కీలక పాత్రలో నటిస్తోంది. రాశి ఖన్నాకి తెలుగులో చివరగా హిట్ దక్కింది 2019లోనే. ప్రతి రోజూ పండగే చిత్రం ఆమె చివరి హిట్. ఆ తర్వాత నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ, తెలుసు కదా లాంటి చిత్రాలు నిరాశ పరిచాయి.
క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్
ఇటీవల రాశి ఖన్నాకి తెలుగు సీనియర్ హీరో నటించబోయే క్రేజీ ప్రాజెక్టు లో అవకాశం వచ్చింది. ఈ మూవీలో మరో హీరోయిన్ కూడా ఉంది. రాశి ఖన్నా సెకండ్ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. ముందుగా రాశి ఖన్నా ఈ చిత్రం పట్ల ఆసక్తి చూపింది. సైన్ చేయడానికి కూడా రెడీ అయిందట.
కెరీర్ పాడవుతుందని షాకింగ్ డెసిషన్
కానీ ఈ చిత్రంలో ఆమెకి, హీరోకి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నాయట. సీనియర్ హీరోతో లవ్ సీన్స్ లో నటిస్తే తన కెరీర్ పాడవుతుందని రాశి ఖన్నా భావిస్తోంది. ఆ తర్వాత యంగ్ హీరోల సినిమాల్లో తనకి అవకాశాలు రావడం కష్టం అయిపోతుందని రాశి ఖన్నా భయపడిందట.
ఆఫర్ రిజెక్ట్ చేసిన రాశి ఖన్నా
దీనితో క్రేజీ ఆఫర్ ని రాశి ఖన్నా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకోవడంతో దర్శకుడు మరో హీరోయిన్ ని ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. మొత్తంగా వరుస ఫ్లాపుల నేపథ్యంలో రాశి ఖన్నా తన కెరీర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటోంది.