- Home
- Entertainment
- తనూజకి బిగ్ బాస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారా ? తుప్పాస్ లాజిక్ తో గొడవ.. కళ్యాణ్ నిజంగానే ఫెయిల్ అయ్యాడా ?
తనూజకి బిగ్ బాస్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారా ? తుప్పాస్ లాజిక్ తో గొడవ.. కళ్యాణ్ నిజంగానే ఫెయిల్ అయ్యాడా ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనూజ విషయంలో వివాదం మొదలైంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకి ఫేవరిటిజం చేస్తున్నారు అనే విమర్శలు మొదలయ్యాయి. కళ్యాణ్ తో తనూజ గొడవ పెట్టుకున్న తర్వాత ఆమెపై విమర్శలు మరింతగా పెరిగాయి.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పరిణామాలు హీటెక్కుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ ప్రస్తుతం బీబీ రాజ్యంగా మారింది. ఈ రాజ్యానికి కళ్యాణ్ రాజు. దివ్య,రీతూ చౌదరి మహారాణులుగా ఉన్నారు. తనూజ, పవన్, సంజన, నిఖిల్ లని రాజు కమాండర్లుగా ఎంపిక చేశారు. ఈ క్రమంలో సంజన, సుమన్ శెట్టి మధ్య బాక్స్ లని అమర్చే టాస్క్ వివాదానికి కారణం అయింది.
తనూజ, కళ్యాణ్ మధ్య గొడవ
వీరిద్దరి టాస్క్ కాస్త తనూజ, కళ్యాణ్ ల మధ్య గొడవగా మారిపోయింది. ప్రతి అంశంలో తనూజ హైలైట్ అవుతుండడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు. తనూజకి బిగ్ బాస్ నిర్వాహకులు ఫేవరిటిజం చేస్తున్నారు అనే విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. ఎలిమినేట్ అయిన శ్రీజ శ్రీజ వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. శ్రీజ తన వీడియోలో.. తనూజని బిగ్ బాస్ టీమ్ తరచుగా సీక్రెట్ రూమ్ కి పిలిచి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారని.. దాని ప్రకారం ఆమె స్ట్రాటజీ మార్చుకుంటోంది అని ఆరోపించింది.
సంజన, సుమన్ శెట్టి మధ్య పోటీ
నవంబర్ 11న మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో తనూజ, కళ్యాణ్ మధ్య వివాదం చెలరేగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో సంజన, సుమన్ శెట్టి పోటీ పడ్డారు. బాక్స్ లని ఒకదానిపై ఒకటి అమర్చాలి. సంజన సుమన్ శెట్టి కంటే హైట్ ఉంది కనుక ఆమెకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకసారి టాస్క్ మొదలయ్యాక ఎవరు హైట్ ఉన్నారు ? ఎవరు తక్కువ హైట్ ఉన్నారు అనేది లెక్కలోకి రాదు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసి గెలవాల్సిందే.
పోరాడిన సుమన్ శెట్టి
తనకి అందినంత వరకు సుమన్ బాక్స్ లని అమర్చారు. టాస్క్ అయిపోయే లోపు ఇద్దరూ బాక్స్ లని అమర్చారు. ఇద్దరూ సమానంగా ఉన్నప్పుడు ఎవరి అమరిక బావుందో అని చెక్ చేసి సంచాలకుడిగా కళ్యాణ్ నిర్ణయం తీసుకోవాలి. సంజన అమర్చిన విధానం బావుంది. దీనితో ఆమె విజయం సాధించినట్లు కళ్యాణ్ ప్రకటించారు. కానీ తనూజ, దివ్య.. కళ్యాణ్ తో గొడవ పడ్డారు. సుమన్ శెట్టి హైట్ తక్కువగా ఉన్నప్పటికీ సంజనతో సమానంగా బాక్స్ లు పెట్టారు. అలాంటప్పుడు అతడే విజేత అనే లాజిక్ చెప్పింది తనూజ.
ఆమె చెప్పింది తుప్పాస్ లాజిక్
తనూజ కామెంట్స్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబర్ ఆదిరెడ్డి విరుచుకుపడ్డారు. అసలు ఈ టాస్క్ లో వ్యక్తుల హైట్ గురించి తనూజ ఎందుకు ప్రస్తావించింది ? హైట్ తక్కువగా ఉన్న సుమన్ శెట్టికి అడ్వాంటేజ్ ఇవ్వమని బిగ్ బాస్ చెప్పారా ? ఆమె చెప్పింది తుప్పాస్ లాజిక్ అంటూ ఆదిరెడ్డి అభివర్ణించారు. ఇద్దరి బాక్స్ లు సమానంగా ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరు బాగా అమర్చారో చూసి సంచాలక్ నిర్ణయం తీసుకోవాలి. కళ్యాణ్ చేసింది ఈ టాస్క్ లో కరెక్ట్ అని ఆదిరెడ్డి అన్నారు.