- Home
- Entertainment
- నటి రాశిని వల్గర్ గా చూపించిన దర్శకుడికి పార్టీ ఇచ్చిన స్టార్ హీరో, అసలేం జరిగింది.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్
నటి రాశిని వల్గర్ గా చూపించిన దర్శకుడికి పార్టీ ఇచ్చిన స్టార్ హీరో, అసలేం జరిగింది.. మూవీ బ్లాక్ బస్టర్ హిట్
హీరోయిన్ రాశి, శ్రీకాంత్ లతో సినిమా చేసి వివాదంలో చిక్కుకున్న ఓ దర్శకుడికి చిరంజీవి పార్టీ ఇచ్చారు. ఆ సినిమా ఏంటి ? ఆ వివాదం ఏంటి ? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

రాశి కెరీర్ లోనే బ్యాడ్ మూవీ
హీరోయిన్ రాశి తన అభిమానులకు నచ్చని విధంగా బోల్డ్ గా నటించింది ఒకే ఒక్క సినిమాలో. ఆ మూవీ మరేదో కాదు మహేష్ బాబు, తేజ కాంబోలో వచ్చిన నిజం. తన కెరీర్ లో నటించిన ఏకైక బ్యాడ్ క్యారెక్టర్ అదే అని రాశి పలు సందర్భాల్లో తెలిపారు. డైరెక్టర్ తేజ తన పాత్ర గురించి ఒకలా చెప్పి, మరోలా తీసి మోసం చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. నిజం మూవీ డిజాస్టర్ అయింది. అయితే రాశి నటించిన మరో సినిమా వల్ల కూడా పెద్ద వివాదం అయింది. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
రాశి, శ్రీకాంత్ సూపర్ హిట్ కాంబినేషన్
హీరోయిన్ రాశి, శ్రీకాంత్ లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో 1999లో 'ప్రేయసి రావే' అనే చిత్రం వచ్చింది. శ్రీకాంత్ కెరీర్ లోనే ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. వైవిధ్యమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామానాయుడు నిర్మించారు. శ్రీకాంత్, రాశి ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. హీరోయిన్, హీరో ప్రేమించుకుంటారు. కొన్ని కారణాల వల్ల రాశి మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఆమె భర్త కోసం హీరో చివర్లో త్యాగం చేసి ప్రాణాలు కోల్పోయే హార్డ్ హిట్టింగ్ కథ ఇది.
వివాదాల్లో చిక్కుకున్న ప్రేయసి రావే
ఇంతటి ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కిన ప్రేయసి రావే చిత్రం కూడా అప్పట్లో వివాదాల్లో చిక్కుకుంది. ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ చంద్ర మహేష్ తెరకెక్కించారు. టైటిల్ నుంచే కాంట్రవర్సీ మొదలైంది. ప్రేయసి రావే ఏంటి ? ఆడవాళ్ళని రావే పోవే అని పిలుస్తారా అంటూ మహిళా సంఘాలు అప్పట్లో పెద్ద గొడవ చేశారు.
వల్గర్ గా చూపించలేదు
ఈ మూవీలో రాశి, శ్రీకాంత్ మధ్య బస్టాప్ లో నడుము సన్నివేశం ఉంటుంది. నడుము కనిపించకుండా చీర కట్టుకోమని శ్రీకాంత్ రాశికి చెబుతాడు. నడి రోడ్డులో అలాంటి సీన్ పెట్టడం పెట్టడం ఏంటి ? హీరోయిన్ ని వల్గర్ అలా చూపిస్తారా అంటూ దీనిపై కూడా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీని గురించి డైరెక్టర్ చంద్ర మహేష్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ఆ సీన్ లో రాశిని మేము వల్గర్ గా చూపించలేదు. నడుము చూపించడం అనేది సినిమాలో చిన్న గ్లామర్ ఎలిమెంట్ అంతే. అక్కడ ఉండే డైలాగులు కూడా మహిళలు చక్కగా చీర కట్టుకుంటే బావుంటుంది అని చెప్పే సదుద్దేశమే. అందులో ఎలాంటి వల్గారిటీ లేదు అని చంద్ర మహేష్ అన్నారు.
ప్రేయసి రావే చిత్రానికి చిరంజీవి ఫిదా
ఈ మూవీ రిలీజ్ అయ్యాక మెగాస్టార్ చిరంజీవి.. దర్శకుడు చంద్ర మహేష్ ని రాత్రంతా కారులో తిప్పి పార్టీ ఇచ్చారట. ఈ మూవీలో నాగబాబు కూడా ఓ పాత్రలో నటించారు. ఆయన చిరంజీవితో ప్రేయసి రావే మూవీ అద్భుతంగా ఉంది అన్నయ్యా, కొత్త డైరెక్టర్ తీశాడు. శ్రీకాంత్ కి మంచి హిట్ పడింది అని చెప్పారట. శ్రీకాంత్ అంటే చిరంజీవి గారికి ఎంతో ఇష్టం. అప్పటికి శ్రీకాంత్ వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో చిరంజీవి ఎంతో సంతోషించారు. వెంటనే నేను ఈ సినిమా చూడాలి అని అన్నారు. ఆ టైంలో రామానాయుడు గారు ఢిల్లీలో ఉన్నారు. నేనే డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి చిరంజీవి గారికి స్పెషల్ షో ఏర్పాటు చేసినట్లు చంద్ర మహేష్ తెలిపారు. చిరంజీవి గారు సినిమా చూసిన తర్వాత.. నా చేయి పట్టుకుని ఏం సినిమా తీశావయ్యా.. కథ హంట్ చేస్తోంది. శ్రీకాంత్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్ లో శివాజీ రాజా అద్భుతంగా నటించాడు అని ప్రశంసలు కురిపించారు.
అర్ధరాత్రి శ్రీకాంత్ కి చిరంజీవి పార్టీ
సినిమా పూర్తయ్యాక నా చేయి పట్టుకుని చిరంజీవి గారు తన కారులో ఎక్కించుకున్నారు. అప్పటికే అర్థరాత్రి అవుతోంది. ఆ టైంలో శ్రీకాంత్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి మూవీ షూటింగ్ లో ఉన్నాడు. తన కారులో శ్రీకాంత్ వద్దకి చిరంజీవి గారు నన్ను స్వయంగా తీసుకుని వెళ్లారు. అక్కడి నుంచి ప్రేయసి రావే సినిమా టీమ్ మొత్తాన్ని తన ఇంటికి తీసుకువెళ్లి డిన్నర్ పార్టీ ఇచ్చారు. చిన్న సినిమాలకు చిరంజీవి గారు ఇచ్చే మద్దతు అది అని చంద్ర మహేష్ అన్నారు.