- Home
- Entertainment
- Raashi Khanna: ఐస్ రెయిన్‌లో రాశీఖన్నా చిలిపి పోజులు.. లైఫ్ సీక్రెట్స్, తెరవెనుక విషయాలు చెబుతుందట!
Raashi Khanna: ఐస్ రెయిన్‌లో రాశీఖన్నా చిలిపి పోజులు.. లైఫ్ సీక్రెట్స్, తెరవెనుక విషయాలు చెబుతుందట!
రాశీఖన్నా టాలీవుడ్‌లో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ చేసుకున్న అందాల భామ. యంగ్ హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్న రాశీఖన్నా ఇప్పుడు మాస్కోలో ఎంజాయ్ చేస్తుంది. దీంతోపాటు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించింది.

రాశీఖన్నా(Raashi Khanna) అంటే భారీ అందాలకు కేరాఫ్. సెక్సీ అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ కెరీర్ బిగినింగ్‌లో చాలా కంట్రోల్‌గానే ఉన్నా.. ఆ తర్వాత క్రమంగా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తోంది. తానే స్కిన్ షో విషయంలో తగ్గేదెలే అని నిరూపించుకుంటుంది. ఇతర స్టార్ హీరోయిన్ల మాదిరిగా తాను తక్కువ కాదని చాటుకుంటోంది. ఈ క్రమంలో పలు బోల్డ్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో డిఫరెంట్ స్టోరీస్‌తో కూడిన సినిమాలు చేస్తుంది.
Raashi Khanna తాజాగా `థ్యాంక్యూ` చిత్ర షూటింగ్ కోసం రష్యా వెళ్లింది. నాగచైతన్య, రాశీఖన్నాతోపాటు చిత్ర యూనిట్ మాస్కోలో పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అక్కడి షూటింగ్ చాలా సరదాగా, జాలీగా సాగుతుందని చెబుతుంది రాశీఖన్నా. ఈ మేరకు ఆమె ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చింది. ఆ వీడియోని అభిమానులతో పంచుకుంది. రష్యా చాలా అందంగా ఉందని, అక్కడి ఫుడ్ చాలా బాగుందని, అక్కడి మనుషులు ఎంతో బాగా చూసుకుంటారని, చాలా రెస్పెక్ట్ ఇస్తారని చెప్పింది రాశీఖన్నా.
ఈ సందర్భంగా అక్కడ ఐస్‌రెయిన్ కురుస్తుండగా దిగిన ఫోటోలను పంచుకుంది. వింటర్ కోట్ ధరించి వణికే చలిలో క్యూట్ పోజులిచ్చింది రాశీఖన్నా. కొంటెగా చూస్తూ కవ్వింపులకు దిగింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు మాస్కోలో ఓ టేబుల్‌పై రాశీఖన్నా, నాగచైతన్య కూర్చొన్న ఫోటో సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది.
మాస్కోలో `థ్యాంక్యూ` చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసుకుని చెన్నైకి వెళ్లిపోవాలని, అక్కడ `సర్దార్` చిత్ర షూటింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది రాశీ. కరోనా కాస్త తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మళ్లీ షూటింగ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపింది.
ఈ సందర్భంగా మరో కొత్త విషయాన్ని పంచుకుంది రాశీ. తాను ఇటీవల కొత్తగా యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. మూడు రోజుల క్రితమే తాను తన `Raashii Khanna` పేరుతో ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇందులో తన జీవితానికి సంబంధించి తెరవెనుక విషయాలను వెల్లడిస్తానని తెలిపింది. తన రియల్ లైఫ్ ఎలాఉంటుంది. తాను వర్కౌట్స్ ఎలా చేస్తుంది. ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి? తాను ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను. డైట్ ఎలా చేస్తాను. ఖాళీ సమయంలో ఏం చేస్తాను, తన ఇష్టాఇష్టాలు, ఫన్నీ విషయాలు, తన జీవితంలోని సీక్రెట్స్ ఇలా అన్ని విషయాలను వరుసగా ఇందులో పంచుకుంటానని తెలిపింది.
తన జీవితంలో ఎంతో ఎమోషన్ ఉందని చెప్పింది రాశీఖన్నా. స్ట్రగుల్స్ కూడా ఇందులో చెబుతానని వెల్లడించింది. ఒక దాని తర్వాత ఒకటి వీడియోల రూపంలో అభిమానులతో పంచుకుంటానని తెలిపింది. అయితే జనవరి 30న ఈ యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించగా, మూడు రోజుల్లోనే 20 వేల మంది సబ్‌స్క్రైబర్స్ చేరిపోయారు.
కెరీర్ పరంగా రెండేళ్ల క్రితం `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రంతో మెరిసింది రాశీఖన్నా. రెండేళ్లు అవుతుంది ఈ బ్యూటీ టాలీవుడ్ ఆడియెన్స్ ని అలరించింది.ప్రస్తుతం నాగచైతన్యతో `థ్యాంక్యూ` చిత్రంతోపాటు గోపీచంద్‌తో `పక్కా కమర్షియల్` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో `సర్దార్`, `తిరుచిత్రంబలమ్`, `మేథావి`, హిందీలో `యోధ` చిత్రాలు చేస్తుంది. అలాగే హిందీలో రెండు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే గోపీచంద్‌తో కలిసి నటిస్తున్న `పక్కా కమర్షియల్` చిత్రం మే 20న విడుదల కానుంది. ఇందులోని టైటిల్ సాంగ్‌ని బుధవారం సాయంత్రం విడుదల చేయగా, దీనికి మంచి ఆదరణ దక్కుతుంది.