పరువాలకు బ్లౌజ్ ముడేసి, రెడ్ డ్రెస్‌లో గుంటూరు మిర్చినీ మించి ఘాటురేపుతున్న రాయ్ లక్ష్మి.. ఎంత హాట్‌గా ఉందో
అదృష్టం కోసం లక్ష్మీ రాయ్ కాస్తా.. రాయ్ లక్ష్మి అయ్యింది. అయినా ఈ బ్యూటీ హీరోయిన్‌గా సక్సెస్ కాలేదు. కానీ గ్లామర్ బ్యూటీగా పాపులర్ అయ్యింది. తెలుగులో కంటే సౌత్‌లోనే ఎక్కువగా రాణించింది. ఐటెమ్ పాటలకు కేరాఫ్‌గా నిలిచింది.
రాయ్ లక్ష్మి.. పొడువైన అందాల భామ. భారీ అందాలకు కేరాఫ్. ఆపిల్ బ్యూటీ లాంటి అందం ఆమె సొంతం. తెలుగులో స్పెషల్ సాంగ్‌లతోనే పాపులర్ అయ్యిందీ బ్యూటీ. ఇప్పటికీ ఐటెమ్ సాంగ్‌లకే టాలీవుడ్‌లో మెరుస్తుంది. స్టార్ హీరోలతో లెగ్ షేక్ చేస్తూ థియేటర్లలో రచ్చ చేస్తుంది.
ప్రస్తుతం నటిగా కాస్త గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తున్న రాయ్ లక్ష్మి.. సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. దుమారం రేపుతుంది. గ్లామర్‌కి ఎప్పుడో గేట్లు ఎత్తేసి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. నెటిజన్లని తనకు అభిమానులుగా మార్చుకుని అందాలతో హంట్ చేస్తుంది. నిత్యం వారిని హాట్ హాట్ అందాలు వడ్డిస్తూ ఎంగేజ్ చేస్తుంది.
ఇటీవల బీచ్‌లో బికినీలో అందాలను ఆరబోసింది. బ్లాక్ బికినీలో ఆల్మోస్ట్ అందాలన్ని ప్రదర్శించింది. ఇప్పుడు రెడ్ డ్రెస్‌లో మెరిసింది. తన డ్రెస్‌ని బాడీకి చుట్టుకుని కిర్రాక్ పోజులిచ్చింది. బ్లౌజ్‌ని పరువాలకు ముడేసి స్టయిలీష్ లుక్‌లో టెంప్ట్ చేస్తుందీ అందాల భామ. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాయ్ లక్ష్మి వెకేషన్‌లో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె సూపర్ హాట్‌గా ఉండటమే కాదు, అందం కూడా పెరిగింది. బ్యూటీఫుల్‌గా మారిపోయింది. కత్తిలాంటి పోజులతో కుర్రాళ్లకి అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది. నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. కూల్‌గా ఉన్న ఇంటర్నెట్‌లో మంటలు పెడుతుంది.
ఈ సందర్భంగా ఓ క్రేజీ పోస్ట్ పెట్టింది రాయ్ లక్ష్మి. `మీ అపరిపూర్ణతలు మిమ్మల్ని ప్రత్యేకం చేస్తాయి` అని పేర్కొంది. పర్ ఫెక్ట్ గా ఉంటే అందరిలో ఒకరిగా మారిపోతారని, అన్ కంప్లీట్‌గా ఉండటం వల్లే స్పెషల్‌గా మారుతామని తెలిపింది. చాలా లాజికల్‌గా రాయ్ లక్ష్మి ఈ పోస్ట్ పెట్డడం విశేషం.
కర్నాటకకి చెందిన రాయ్ లక్ష్మి. 2005లో `కాంచనమాల కేబుల్ టీవీ` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రెండు షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. ఎంట్రి బాగుంది. ఆ తర్వాత `నీకు నాకు` అనే చిన్న చిత్రంలో మెరిసింది. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ బ్యూటీకి ఆఫర్లు రాలేదు.
అప్పటికే తమిళంలో, కన్నడలో గుర్తింపు తెచ్చుకుంది రాయ్ లక్ష్మి. అక్కడ ఆఫర్లు రావడంతో తెలుగుని ఈ బ్యూటీ కూడా లైట్ తీసుకుంది. అయితే హీరోయిన్లలో రాయ్ లక్ష్మి ప్రత్యేకం. ఆమెరెగ్యూలర్ హీరోయిన్‌గా సెట్ కాదు. అందుకే ప్రత్యేక పాత్రలు ఆమెని వరించాయి. అవే ఆమెని ప్రత్యేకంగా నిలిపాయి.
దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత బాలకృష్ణ నటించిన `అధినాయకుడు` చిత్రంలో మెరిసింది రాయ్ లక్ష్మి. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. కానీ సినిమా ఆడలేదు. దీంతో ఈ బ్యూటీకి కాలం కలిసి రాలేదు. ఇక లాభం లేదని ఐటెం గర్ల్ గా మారిపోయింది. రవితేజ `బలుపు` చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది. `లక్కీ లక్కీ రాయ్` అంటూ ఊపేసింది.
దీంతో ఈ బ్యూటీని స్పెషల్ సాంగ్‌ల్లోనే బాగా చూసుకున్నారు. పవన్ కళ్యాణ్ `సర్దార్ గబ్బర్ సింగ్`లోనూ తోబా తోబా పాటకి తీసుకున్నారు. ఇందులోనూ రచ్చ రచ్చ చేసిందీ సెక్సీ హీరోయిన్. ఆ తర్వాత చిరంజీవితో `ఖైదీ నెంబర్ 150`లో `రత్తాలు` పాటకి ఎంపిక చేశారు. ఈ పాట ఓ రేంజ్‌లో ఊపేసింది. సినిమాలో హైలైట్‌గా నిలిచింది. ఈ దెబ్బతో రాయ్ లక్ష్మి మరింత పాపులర్ అయ్యింది.
కానీ విచిత్రం ఈ బ్యూటీకి మళ్లీ తెలుగులో ఆఫర్లు రాకపోవడం గమనార్హం. తమిళం, కన్నడ, మలయాళంలో అడపాదడపా ఆఫర్లని దక్కించుకుంటుంది. ప్రస్తుతం మలయాళంలో సినిమా చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందరికి టచ్‌లోనే ఉంటుంది. గ్లామర్ ఫోటోలతో భాషలకు అతీతంగా అందరు నెటిజన్లని అలరిస్తుంది. వారిని తన ఫాలోవర్స్ గా మార్చుకుంటుందీ సెక్సీ బ్యూటీ.