‘పుష్ప’ కరోనా కలవరం: ఐసోలేషన్ లో బన్ని సైతం?, ఆ పొరపాటు చేయబట్టే
టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతిచ్చినా చాలా సినిమాలు మొన్న మొన్నటి దాకా ప్రారంభం కాలేదు. కరోనా కాస్త కంట్రోలుకు రావటంతో ఇప్పుడిప్పుడే ధైర్యం చేస్తున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భారీ బడ్జెట్ సినిమాల షూటింగ్ లు పట్టాలు ఎక్కుతున్నాయి. ఆచార్య,పుష్ప వంటి భారీ సినిమాల షూటింగ్ లు మొదలు కావటంతో మిగతావాళ్లు ధైర్యం చేయటానికి డెసిషన్స్ తీసుకుంటున్నారు. టీవీ సీరియళ్లు, చిన్న హీరోల సినిమాలు తక్కువ క్రూతో చేస్తున్నారు కాబట్టి వాటికి పెద్దగా సమస్యలు ఎదురుకావటం లేదు. అయితే ఇప్పుడు పుష్ప సినిమా టీమ్ లో కరోనా ప్రబలిందని, అందుకే షూట్ ఆగిందని వార్తలు మొదలయ్యాయి. ఎన్నో జాగ్రత్తలతో మొదలైన షూటింగ్ లో కరోనా పడగవిప్పటం ఏమిటి...అందుకు కారణం ఏమిటి...అసలేం జరిగింది అనే విషయాలు చూద్దాం.
కరోనా లాక్ డౌన్ తో పెద్ద పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. దాంతో కరోనా వేవ్ కాస్త తగ్గగానే పుష్ప టీమ్ ...,షూటింక్ సన్నాహాలు మొదలెట్టింది. షూటింగ్‌లో భాగంగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొనలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొనాల్సి ఉంది. దాంతో బన్నిని ఒప్పించారు.
నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ వ్యయంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కరోనా లాక్ డౌన్ తో ఇప్పటికే షూట్ లేటైంది. ఆరు నెలలు షూట్ గ్యాప్ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే షూటింగ్ ప్లాన్ చేసారు మొదలుపెట్టారు సుకుమార్.
ఎక్కడ షూట్ చేయాలి, సెట్ వేసి షూట్ చేస్తే బెస్ట్ వంటి అనేక తర్జనభర్జనలు తర్వాత మారేడుమిల్లి అడవుల్లో షూట్ రీస్టార్ట్ చేశారు. బన్నీ టీమ్ ఉత్సాహంగా షూటింగ్ పాల్దొంటున్నారు. అయితే ఈ షూటింగ్ లో కరోనా కలకలం మొదలైంది. చిత్ర టీమ్ లో 10 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
దాంతో షూటింగ్ ఆపి, మిగతా టీమ్ అంతా కూడా టెస్ట్ లు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది. దాదాపు అందరూ ఐసోలేషన్ లోకి వెళ్లారని సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ సైతం ఐసోలేషన్ లో ఉన్నారని వినికిడి.
అల్లు అర్జున్ తిరిగి వెనక్కి హైదరాబాద్ వచ్చేసారని వినికిడి. అయితే ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూట్ మొదలెట్టినా, ఎందుకు కరోనా అంతలా స్ప్రెడ్ అయ్యిందనే విషయమై రకరకాల టాక్ లు మీడియాలో వినపడుతున్నాయి. టాలీవుడ్ సైతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
కరోనా అంతలా కంగారుపెట్టడానికి కారణం..సెట్లో 150 మంది కంటే ఎక్కువ సభ్యులు ఉండకూడదని చెబుతున్నా… అంతకు మూడు రెట్ల సిబ్బందితో షూటింగ్ చేయటమే అని తెలుస్తోంది. దాదాపు ప్రతిరోజూ 200 నుండి 300 వరకు క్రూ మెంబర్స్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అందుకే వైరస్ స్ర్పెడ్ అయిందని చెప్తున్నారు.
టీమ్ లో కొందరికి జలుబులు వచ్చినా అది ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్దితులని బట్టే అనుకున్నారట. కాని జ్వరం,ఒళ్లు నొప్పులు రావటంతో ఎలర్టైన టీమ్..వెంటనే అనుమానం ఉన్నవారిని కరోనా టెస్ట్ లకు పంపారట. దాంతో కరోనా నిర్దారణ అయ్యిందని సమాచారం. దాంతో సుకుమార్ వెంటనే షూటింగ్ ని నిలిపేసినట్టు సమాచారం.
ఈ నేపధ్యంలో `పుష్ఫ` షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది? అనే విషయంలో క్లారిటీ లేదు. పదిహేను రోజులు ఆగితే కానీ స్టేటస్ చెప్పలేమని అంటున్నారట. మెయిన్ టెక్నీషియన్స్ లో ఎవరికైనా కరోనా సోకినట్టైతే… ఇప్పట్లో `పుష్ప` షూటింగ్ లేనట్టే.
ఈ నేపధ్యంలో ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఆచార్య, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్ లాంటి పెద్ద సినిమాలు టీమ్ ఉలిక్కిపడ్డారట. ఆ టీమ్ లో కరోనా భయాలున్నా, అనేక జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేస్తున్నారు. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు కరోనా వచ్చే ఛాన్స్ వుందని `పుష్ప` ఎపిసోడ్ డేంజర్ సిగ్నల్ ఇచ్చినట్లైంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకుడు. ఈ సినిమా లో అల్లు అర్జున్ మొదటి సారి మాస్ లుక్ తో కూడిన పాత్రను చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఇప్పటికే అల్లు అర్జున్ కి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ మూవీలో అల్లు అర్జున్ ఇంట్రో సీన్ చాలా స్పెషల్ గా ఉండనుందట.ఈ యాక్షన్ ఘట్టాల కోసం ప్రత్యేకమైన కసరత్తులు జరుగుతున్నాయి. రూ.6 కోట్ల వ్యయంతో వాటిని తెరకెక్కించనున్నారు.అది పులితో ఫైట్ సీన్ ఉంది అని.. చాలా నాచురల్ గా ఉంటుందని, అది తప్పకుండా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేస్తుందని వినపడుతోంది.
మరోవైపు పల్లెటూరి అమ్మాయిగా రష్మికా సందడి చేయనుంది. ఇక ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. దానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం సమకూరుస్తున్నారని.. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వచ్చిన స్పెషల్ సాంగ్స్ ఎలా అలరించాయో ఇది కూడా అలానే ఆకట్టుకుంటుందని మొదటి నుంచి చెప్పుకొచ్చారు.
కాగా ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ‘లోఫర్’ హీరోయిన్ దిశా పటానీ ఆడిపాడనున్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. దిశా ఇప్పటికే బాలీవుడ్‌లో పలు స్పెషల్ సాంగ్స్ లో నటించారు.
‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత ఆ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ చిత్రం కోసం బన్నీ కసరత్తులు గట్టిగానే చేసారు. రోజూ అల్లు అర్జున్ - సుకుమార్ విస్తృతంగా చర్చించుకుంటూ సినిమా కోసం సన్నద్ధమయ్యారు. ఇందులో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడబోతున్నారు. మొన్నటిదాకా సినిమాలో తాను పలికే సంభాషణలపైనే దృష్టి పెట్టిన అల్లు అర్జున్, ఇప్పుడు అంతకుమించి అన్నట్టుగా పూర్తి స్థాయిలో యాస సొగసుని తెలుసుకునే ప్రయత్నం చేసారు.
చిత్తూరు ప్రాంతంలో సాగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారని తెలిసింది. బన్నీ ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారట. రష్మిక హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, జగపతిబాబు, అనసూయ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.