- Home
- Entertainment
- సమంత ఐటెమ్ సాంగ్ వల్లే `పుష్ప` పెద్ద హిట్.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్..రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు
సమంత ఐటెమ్ సాంగ్ వల్లే `పుష్ప` పెద్ద హిట్.. సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్..రాజమౌళిపై ఆసక్తికర వ్యాఖ్యలు
`పుష్ప` సినిమాలో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే, ఆ పాట వల్లే `పుష్ప` సెన్సేషనల్ హిట్ అయ్యిందని అంటున్నారు సీనియర్ నటుడు భానుచందర్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను తెలిపారు.

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన `పుష్ప` చిత్రంలో `ఊ అంటావా మామ.. ఊఊ అంటావా` అనే పాట సంచలన క్రియేట్ చేసింది. సినిమాపై హైప్‌కి తీసుకొచ్చింది. సమంత ఐటెమ్ సాంగ్ చేయడంతో మరింత కలిసొచ్చింది. ఈ చిత్రం మూడు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై సీనియర్ నటుడు భానుచందర్ స్పందించారు. ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ సినిమా బాలీవుడ్ ని దాటుకుని పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందిస్తూ, ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు బాలీవుడ్‌లోనే కాదు, ఇండియా వైడ్‌గా ఆడుతున్నాయి. సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన `పుష్ప` చిత్రం హిందీలో బాగా ఆడింది. ముఖ్యంగా అందులో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ హైలైట్ అని తెలిపారు.
సమంత చేసిన `ఊ అంటావా మావ.. ఊఊ అంటావా` పాట తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో సూపర్ హిట్ అయ్యింది. ఆ పాటతోనే అన్ని భాషల్లో హైప్ వచ్చిందని, ఆ పాటతోనే సినిమా పెద్ద హిట్ అయ్యిందని చెప్పి షాకిచ్చారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఇలా ఇతరభాషల్లోని హీరోయిన్లతో ఐటెమ్ సాంగ్‌లు చేయడం, హిట్ కొట్టడం ట్రెండ్ అయ్యిందని చెప్పారు.
సమంత చేసిన మొదటి ఐటెమ్ సాంగ్ ఇది. ఈ పాట కోసం ఆమె ఏకంగా కోటిన్నర పారితోషికం తీసుకున్నట్టు టాక్. నిజానికి ఈ పాట సినిమాపై హైప్‌ని అమాంతం పెంచేసింది. మరోవైపు సుకుమారు దర్శకత్వం, స్టోరీ, అల్లు అర్జున్ అద్భుతమైన నటన, ఆయన మ్యానరిజం, రష్మిక డీ గ్లామర్ అందాలు సినిమాకి కలిసొచ్చాయి. బ్లాక్ బస్టర్‌ని చేశాయి. ఈ సినిమాకి పార్ట్ 2 `పుష్ప 2` రాబోతుంది.
ఇంకా భాను చందర్ చెబుతూ, `సింహాద్రి` సినిమా డబ్బింగ్‌లో చూసినప్పుడే ఆ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని, రాజమౌళి సంచలన దర్శకుడు అవుతాడని అదే రోజు చెప్పానని తెలిపారు. ఇప్పుడు రాజమౌళి సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయారని తెలిపారు. అలాగే చిరంజీవితో మొదట్నుంచి మంచి ఫ్రెండ్‌షిప్ ఉందని, ఇద్దరూ రూమ్మేట్స్ అని, ఎప్పుడు కలిసినా `ఏరా..ఏరా `అని పిలుచుకుంటామని తెలిపారు.
హీరో అవ్వడానికి, సినిమాల్లో రాణించడానికి రజనీకాంత్ స్ఫూర్తి అని తెలిపారు భానుచందర్. బస్ కండక్టర్ హీరో అయి సూపర్ స్టార్ అయ్యారని, ఆయన్ని చూసి తాము ఎందుకు సినిమాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.దీంతోపాటు ఆరోగ్యంపై ఆయన మంచి సందేశం ఇచ్చారు. ఎంతపెద్ద సెలబ్రెటీలు అయినా, వారి ఎంతటి పేరు ప్రతిష్టలు ఉన్నా అవి మనల్ని కాపాడలేవని, న్నారు. ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవడం ముఖ్యమని ఆయన సూచించారు.