Pushpa-2: విషాద ఘటన, సంధ్య థియేటర్ ఓనర్ సహా ముగ్గురి అరెస్ట్
ధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ లను పోలీసులు అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది.

Pushpa 2, premiere tragedy, Sandhya 70mm, allu arjun
'పుష్ప2' ప్రీమియర్ షో నేపథ్యంలో అపశ్రుతి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్‌టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌లో ఈ సినిమాను చూడటానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో ఎగబడ్డారు. బన్నీని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీఛార్జి చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందంది.
pushpa 2
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ ఓనర్, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ లను పోలీసులు అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు. కాగా, ఈ ఘటనలో హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. మృతి చెందిన మహిళ కుటుంబానికి అల్లు అర్జున్ ఇటీవలే రూ.25 లక్షల సాయం ప్రకటించారు. ఆమె కుటుంబానికి తాను అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.
ఇదిలాఉంటే.. మృతురాలు రేవతి భర్త ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు హీరో అల్లు అర్జున్ థియేటర్ కి రావడం వల్లే తన భార్య చనిపోయిందన్నారు. అలాగే తన కొడుకు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని పేర్కొన్నారు. ఒకవేళ బన్నీ రాకపోయి ఉంటే అంత క్రౌడ్ ఉండేది కాదన్నారు.
తన కుమారుడు నెల రోజుల ముందు నుంచి పుష్ప-2 సినిమాకు వెళదామని బలవంతం చేయడంతోనే తాను ఆ రోజు ప్రీమియర్ షోకి తీసుకెళ్లానన్నారు. శ్రీతేజ్‌కి అల్లు అర్జున్ అంటే వీరాభిమానం అన్నారు. ఆయన పాటలు, డైలాగులు చెబుతూ ఎల్లప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండేవాడని తెలిపారు. ఆ రోజు థియేటర్ లో ఎంజాయ్ చేద్దాం డాడీ అని పేపర్లు కూడా ముందే కట్ చేసి పెట్టుకున్నాడని, ఇంతలోనే ఇలా ఘోరం జరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై ఎన్ హెచ్ఆర్సీ(జాతీయ మానవ హక్కుల సంఘం)కి ఫిర్యాదు అందింది. పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ప్రీమియర్ షో వేశారని... ఈ సినిమా హీరో అల్లు అర్జున్ పైనా, అధికారులపైనా చర్యలు తీసుకోవాలంటూ రవికుమార్ అనే న్యాయవాది ఎన్ హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఫిర్యాదును ఎన్ హెచ్ఆర్సీ విచారణకు స్వీకరించింది.
సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమైందని, తొక్కిసలాట జరగకుండా కట్టడి చేయలేకపోయిందని న్యాయవాది రవికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించిందని, తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని వివరించారు. మహిళ కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని రవికుమార్ ఎన్ హెచ్ఆర్సీని కోరారు.
Pushpa 2, Sukumar, allu arjun
ఈ ఘటనపై పుష్ప-2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఇది ఎంతో విషాదకర ఘటన అని, దీని పట్ల తాము చాలా బాధపడుతున్నామని వెల్లడించింది. చికిత్స పొందుతున్న బాలుడు క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది.
ఈ విషాద ఘటనపై అల్లు అర్జున్ టీమ్ తాజాగా స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకర ఘటన అని పేర్కొంది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. "నిన్న రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం" అని తెలిపింది.
Allu Arjun, #Pushpa2, sukumar
సంఘటన వివరాల్లోకి వెళితే... కుటుంబంతో కలిసి రేవతి దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌కు వచ్చింది. మరికాసేపట్లో సినిమా చూస్తామనగా ఇలా అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. తొక్కిసలాటలో మరికొందరు స్పల్పంగా గాయపడ్డారు.
ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పటికి సంధ్య థియేటర్‌కు హీరో అల్లు అర్జున్ రావడంతో సుమారు 200 మంది పోలీసులను మోహరించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ అభిమానుల కోలాహలం నెలకొనటంతో గుంపుని అదుపు చేయటం సాధ్యం కాలేదని చెప్తున్నారు.