MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఇది కఠిన పరిస్థితి, న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, విడుదలయ్యాక అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్!

ఇది కఠిన పరిస్థితి, న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది, విడుదలయ్యాక అల్లు అర్జున్ ఫస్ట్ రియాక్షన్!

అల్లు అర్జున్ నేడు జైలు నుండి విడుదలయ్యారు. తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Dec 14 2024, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ పేరు ఏ 11గా చేర్చారు. డిసెంబర్ 12న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఆయనకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డిని రంగంలోకి దించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. జైలుకు వెళ్లే పరిస్థితి నుండి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు. అయితే ఒకరోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ గూడ జైలులో గడపాల్సి వచ్చింది. హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే.. కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలుకి తరలించారు. కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ.. జైలు అధికారులకు అందాల్సి ఉంది. ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ని జైలులో ఉంచారు. 

 

35

పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం విడుదల చేశారు. అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైలులో ఉంచారు. ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది. జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. భార్య స్నేహారెడ్డితో పాటు పిల్లలు అక్కడే ఉన్నారట. ముందుగా వారిని కలిశాడని సమాచారం. అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి వచ్చాడు. అక్కడ చాలా సమయం గడిపారు. 

45
allu arjun

allu arjun


దిల్ రాజుతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ని కలిశారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుండి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు. అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు. రేవతి మృతి దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకూడదు. నేను బాగానే ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది నాకు, నా కుటుంబ సబ్యులకు కఠిన సమయం. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. కేసు కోర్టులో ఉంది. కాబట్టి నేనేమీ మాట్లాడలేను. నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు, అన్నారు. 


 

55

కొద్ది సమయం మాత్రమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధారణ ఖైదీలా నేలపై పడుకున్నారట. వీఐపీ ఖైదీలకు లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుండి ఇస్తారట. దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Recommended image2
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image3
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved