MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘పుష్ప2’ OTT స్ట్రాటజీ: ఏ ఓటిటిలో , ఎప్పుడు స్ట్రీమింగ్?

‘పుష్ప2’ OTT స్ట్రాటజీ: ఏ ఓటిటిలో , ఎప్పుడు స్ట్రీమింగ్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఓటిటి రైట్స్ కోసం పోటీపడిన నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని సమాచారం.

2 Min read
Author : Surya Prakash
Published : Dec 02 2024, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Pushpa 2, allu arjun, sukumar, OTT Release

Pushpa 2, allu arjun, sukumar, OTT Release

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’విశేషాలే గత వారం రోజులుగా వినిపిస్తున్నాయి. మరో పది రోజులు దాకా ఇదే పరిస్దితి కొనసాగేలా ఉంది. ప్రముఖ దర్శకుడు  సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా డిసెంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఆరు భాషల్లో దాదాపు 12,000 స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ సినిమాని అభిమానులు మొదటి రెండు రోజుల్లోనే చూసేందుకు ప్లాన్ చేసుకుంటన్నారు. ఈ మేరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లు అదిరిపోతున్నాయి. మరో ప్రక్క అంతంత రేట్లు పెట్టి టిక్కెట్ కొనలేని సామాన్యుడు ఓటిటి రిలీజ్ ఎప్పుడు  అంటూ ఆరా తీస్తున్నాడు. 

25
allu arjun movie Pushpa 2 The Rule

allu arjun movie Pushpa 2 The Rule


అయితే ఇప్పటిదాకా ఈ చిత్రం ఓటిటి విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ బయిటకు రాలేదు. అయితే నేషన్ వైడ్ గా  పుష్ప 2కి బాగా బజ్ క్రియేట్ కావటంతో   రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ గట్టిగానే పోటీపడ్డాయనేది నిజం. అయితే అందుతున్న సమాచారం మేరకు అమెజాన్‌తో చివరి వరకూ పోటీపడిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుందని అంటున్నారు. అమెజాన్ కోట్ చేసిన ధరకి మూడు రెట్లు అధికంగా నెట్‌ఫ్లిక్స్ కోట్ చేసి తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. 

35
allu arjun movie Pushpa 2 The Rule peelings song

allu arjun movie Pushpa 2 The Rule peelings song


 భారతీయ సినిమా చరిత్రలోనే ఇప్పటివరకు ఏ మూవీకి లేనంతగా ఏకంగా రూ.270 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ పుష్ప 2 డిజిటల్ రైట్స్ దక్కించుకుందట. ఇప్పుడీ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఓటీటీ రైట్స్ రూ.175 కోట్లే పెద్ద  రికార్డ్. ఇప్పుడు ఈ వార్త నిజమైతే అది  బద్ధలైనట్లే. పుష్ప 1 సినిమాని అప్పట్లో అమెజాన్ రూ.30 కోట్లకి దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నో రెట్లు పుష్ప2 కు పలికింది.
 

45

 పుష్ప 2 ఓటిటి రిలీజ్ విషయానికి వస్తే.. భారీ రేటుకు కొనుక్కున్నప్పుడు ఓటిటి సంస్దలు కొన్ని రూల్స్ పెడతాయి. పుష్ప 2 మూవీ 5 వారాల్లోనే ఓటీటీలోకి వస్తుందని చెప్పుకుంటున్నారు. రిలీజ్ తర్వాత 5 వారాలు  అంటే… జనవరి 10న, సంక్రాంతి సందర్భంగా నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వస్తుందని తెలుస్తుంది. భారీ డీల్‌ కాబట్టి ఇలా జరిగేందుకు అవకాసం ఉందంటున్నారు.  
 

55
pushpa 2

pushpa 2

అయితే అలాంటిదేమీ లేదని, పుష్ప 2  జనవరి 25 కు  కచ్చితంగా స్ట్రీమ్ కానుందని బాలీవుడ్ మీడియా అంటోంది. జనవరి 23కి పుష్ప 2 రిలీజ్ అయి 50 రోజులు అవుతుంది. 50 డేస్ ఈవెంట్ చేసిన తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తారని చెప్పుకుంటున్నారు.

ఏదైమైనా పుష్ప2 వంటి సినిమాలు థియేటర్ లో చూస్తేనే కిక్ ఉంటుంది. ధరలు అందుబాటులో లేకపోతే ఓ వారం తర్వాత ధరలు తగ్గాక అయినా థియేటర్ లో చూస్తేనే బెస్ట్. అంతేకానీ ఓటిటి కోసం ఎదురుచూద్దామనో, పైరసీలో చూసేద్దామనుకుంటే మంచి సినిమాటెక్ ఎక్సపీరియన్స్ మిస్ అవుతారు.

read more: ఫ్యాన్స్ ని అలా పిలుస్తున్నాడంటూ అల్లు అర్జున్ పై పోలీస్ కంప్లైంట్

also read: పుష్ప 2: ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ ఫిగర్స్ షాకింగ్ ! !

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
VIROSH Wedding: కాబోయే కోడలికి విజయ్ తల్లి స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చిందో తెలుసా?
Recommended image2
Nayanthara: షూటింగ్ స్పాట్‌లో నయనతార డిమాండ్స్ ఏంటో తెలుసా ? స్టార్ హీరోయిన్ క్యారవాన్ లో హీరోలను మించి సౌకర్యాలు ?
Recommended image3
Vijay Rashmika: విజ‌య్‌, ర‌ష్మిక‌ల వివాహంపై స్పందించిన ప్ర‌ధాని మోదీ.. ఏమ‌న్నారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved