'పుష్ప' రెండవ రోజు బుక్కింగ్స్: హిందీలో స్ట్రాంగ్ , తెలుగు డ్రాప్?
పుష్ప 2 రెండో రోజు కలెక్షన్లలో తెలుగు రాష్ట్రాల్లో తగ్గుదల, నార్త్ లో మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. టికెట్ రేట్లు, మెగాభిమానులు అప్రకటిత బ్యాన్, వీకెండ్ కారణంగా కలెక్షన్లలో మార్పులు.
Allu Arjun, #Pushpa2, sukumar
పుష్ప 2: ది రూల్ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ తర్వాత రెండో రోజు కొంతమేరకు కలెక్షన్లలో తగ్గుదల కనిపిస్తోంది. అయితే నార్త్ లో మాత్రం స్ట్రాంగ్ గా ఉంది. తెలుగు వెర్షన్ బుకింగ్స్ లో మార్పు కనపడుతోంది. మొదటి రోజు భాక్సాఫీస్ దగ్గర తన ర్యాంపేజ్ చూపించటంలో ఆశ్చర్యం లేదు కానీ రెండో రోజు డ్రాప్ అనేది ఆశ్చర్యంగా ఉందంటోంది ట్రేడ్. నార్త్ లో 2వ రోజు 60% అడ్వాన్స్ బుక్కింగ్ లు కనపడుతోంది దాంతో అక్కడ రెండో రోజు ఖచ్చితంగా 50 కోట్లు నికర ఆదాయం కనిపిస్తుందని అంచనా వేస్తున్నారు.
Pushpa 2, allu arjun, sukumar, OTT Release
అదే సౌత్ కు వచ్చేసరికి పుష్ప 2 కు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ లు కేవలం మొదటి రోజు అడ్వాన్స్ లలో మూడవ వంతు మాత్రమే ఉన్నాయి. అందుకు కారణం టిక్కెట్ రేట్లు, మెగాభిమానులు అప్రకటిత బ్యాన్ కారణం అంటున్నారు.
అయితే ఈ రెండు కాకుండా రేపు అంటే శని,ఆదివారాలు వీకెండ్ అవటంతో అప్పటికి చాలా మంది ప్లాన్ చేసుకోవటం కూడా ఈ రోజు తగ్గటానికి కారణం అంటున్నారు. ఈ రోజు సాయింత్రం షోల నుంచి పెద్ద జంప్ అయ్యే అవకాసం ఉందంటున్నారు.
Pushpa 2, Telangana High Court, allu arjun, ticket rates
కర్ణాటక, తమిళనాడు, కేరళలో కూడా పుష్ప 2 కు మొదటి రోజు ఉన్నంత స్ట్రాంగ్ గా రెండో రోజు కనపడటం లేదంటున్నారు. దాంతో అందరి దృష్టీ ఈ రోజు సాయింత్రం షోల నుంచి పెద్ద జంప్ అవుతుందనే ఆశతో ఉన్నారు. ఇక హిందీ లో అయితే ఎనభై నుంచి వంద శాతం ఈవినింగ్ షోలలో కనపడుతుంది అంటోంది ట్రేడ్ .
దాంతో అందరి దృష్టీ ఈ రోజు ఈవినింగ్ షోల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది,. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ దుమ్ము రేపనున్నాయా వంటి విషయాలుపై ఉంది.
pushpa 2 advance booking starts allu arjun fahadh faasil sukumar
ఇక అల్లు అర్జున్ కు సినిమాలకు ఆంద్రాలో మంచి మార్కెట్ ఉంది. అయితే పుష్ప 2: ది రూల్ ఇటీవల ఆంధ్ర ప్రదేశ్‌లో బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ కు లోనైంది,. ఈ విషయం అభిమానులు , ట్రేడ్ ఎనాలసిస్ట్ ల మధ్య చర్చలకు కారణమైంది.
ఈ సినిమా ఉత్సాహం ఉభయ గోదావరి జిల్లాలో కనిపించలేదు. అక్కడ బీ, సి సెంటర్లలో చాలా చోట్ల ప్రిమియర్స్ జరగలేదు. టికెట్స్ రేట్స్ కారణంగా షోలు క్యాన్సిల్ అయ్యాయని అని సర్ది చెప్పుకున్నప్పటికీ, తాము విధించిన అప్రకటిత బ్యాన్ దీనికి అసలు కారణమని కొందరి మెగా ఫ్యాన్స్ చెప్తున్నారు.
కలెక్షన్స్ డ్రాప్‌కి ముఖ్య కారణాలలో టికెట్ ధరల పెరుగుదల చెప్తున్నారు. ప్రభుత్వం ఫర్మిషన్ ఇవ్వటంతో స్పెషల్ , ప్రీమియర్ షోలు కోసం టికెట్ల ధరలు ₹800 వరకు పెరిగాయి.
సాధారణ షోలకు ₹324 నుంచి ₹413 వరకు నిర్దేశించారు. ఇది ఓ వర్గం ప్రేక్షకులకు ఖర్చు పరంగా ఇబ్బందిగా మారింది. దాంతో చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని రేట్లు తగ్గాక చూడచ్చులే, లేదా ఓటిటిలో చూద్దాము అని ఆగారు. అలాగే ఓ వర్గం నుంచి వ్యతిరేకత... సోషల్ మీడియాలో బాయ్ కాట్ పిలుపులు కొంతవరకూ ఈ పరిస్దితికి కారణం అంటున్నారు.
read more: ‘పుష్ప -2’ఫస్ట్ డే కలెక్షన్స్, ఏ ఏరియాలో? ఎన్ని కోట్లు?