‘పుష్ప -2’ఫస్ట్ డే కలెక్షన్స్, ఏ ఏరియాలో? ఎన్ని కోట్లు?
'పుష్ప: ది రూల్' ఇండియా వైడ్ రూ.175 కోట్లు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా నిలిచింది. బుక్ మై షోలో ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యాయి.
Allu Arjun, #Pushpa2, Sukumar
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప: ది రూల్’ (Pushpa 2) భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రీ సేల్ బుకింగ్స్‌లోనే హవా చూపిన ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లోనూ సత్తా చాటినట్లు ట్రేడ్ లో వినపడుతోంది. డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి చేసిన ‘పుష్ప 2’ కలెక్షన్ల పరంగా అన్ని చోట్లా ముఖ్యంగా ఓవర్సీస్‌లోనూ టాప్‌లో కొనసాగుతోంది.
ఫస్ట్ డే ఈ చిత్రం ఇండియా వైడ్‌గా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల షేర్ ఎక్కువ ఉన్నట్లు వినికిడి. అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు దాదాపు 4.2 మిలియన్ల డాలర్లు (రూ.35 కోట్లు పైన) వసూలు చేసినట్లు ప్రొడక్షన్ హౌస్ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ విడుదల చేసింది. అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రం ‘పుష్ప 2’ అని పేర్కొంది.
ఇదిలా ఉంటే ప్రీ సేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో ‘పుష్ప 2’ మామూలుగా లేవు. తాజాగా ఈ చిత్రం అక్కడ మరోసారి హవా చూపిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఒక్క గంటలోనే లక్ష టికెట్స్ అమ్ముడయ్యు రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా గంటలో 97,700 టికెట్స్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ఆ మార్క్‌ను పుష్ప 2 దాటేసింది.
ఇక పుష్ప 2 దాదాపు 12,000 స్క్రీన్లతో నేడు డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 4న ప్రీమియర్ షోస్ కోసం రూ. 7 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. దాంతో అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్ కలెక్షన్స్ మొత్తం కలుపుకుని రూ. 77 కోట్ల ప్రీ-సేల్స్ సాధించినట్టు సినీ వర్గాలు తెలిపాయి.
ఇందులో ఒక్క హిందీ వెర్షన్ లోనే 27.12 కోట్లు, తెలుగు 2డి వెర్షన్ 38.37 కోట్లు వసూలు చేసింది. ప్రముఖ ట్రేడ్ రిపోర్ట్ వెబ్ సైట్ Sacnilk ప్రకారం.. గురువారం ప్రీమియర్స్ తోనే(Dec 4) డే 1 దాదాపు రూ.16.03 కోట్ల ఇండియా నికర సంపాదించినట్టు తెలిపింది.
భారీ స్థాయిలో రిలీజైన పుష్ప 2 మూవీకి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వస్తున్నాయి. అలాగే తమిళనాడులో రూ. 9 కోట్లు,కర్ణాటకలో రూ.15 కోట్లు, కేరళలో రూ.8 కోట్ల మేరకు సాధించేలా ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో రూ.62 నుండి 72 కోట్లు వరకు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
‘పుష్ప ది రూల్’కి అన్ని చోట్ల నుంచీ ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక హీరోయిన్ గా మూడేళ్ల క్రితం విడుదలైన ‘పుష్ప ది రైజ్’కు సీక్వెల్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమైంది. భారీ అంచనాల మధ్య గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చింది. బుధవారం సాయంత్రం పలు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు