MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • సైమాలో పుష్ప రాజ్ రూల్.. ఇప్పటి వరకు పుష్ప 2 కు ఎన్ని అవార్డులు వచ్చాయంటే?

సైమాలో పుష్ప రాజ్ రూల్.. ఇప్పటి వరకు పుష్ప 2 కు ఎన్ని అవార్డులు వచ్చాయంటే?

Pushpa 2 awards list: సైమా అవార్డ్స్ 2025 లో పుష్ప 2 సినిమా సత్తా చాటింది. ఈ అవార్డు వేడుకల్లో ఏకంగా 5 అవార్డులను అందుకుని దుమ్మురేపింది. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా ఎన్ని అవార్డులను గెలుచుకుందంటే?

3 Min read
Author : Rajesh K
Published : Sep 06 2025, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పుష్పగాడి రూలింగ్
Image Credit : instagram

పుష్పగాడి రూలింగ్

Pushpa 2 awards list: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన్ మూవీ పుష్ప 2 (Pushpa 2: The Rule). మాస్ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ముఖ్యంగా ఇండియన్ సినిమా రికార్డులన్నిటినీ తిరగ రాసింది. సంచలన విజయాన్ని నమోదు చేసింది. తాజాగా సైమా అవార్డ్స్ 2025 లో కూడా సత్తా చాటింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 అవార్డులను అందుకుని దుమ్మురేపింది. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమా ఎన్ని అవార్డులను గెలుచుకుందంటే? 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సైమాలో పుష్ప 2 కి అవార్డుల పంట
Image Credit : Asianet News

సైమాలో పుష్ప 2 కి అవార్డుల పంట

‘పుష్ప 2: ది రూల్’ సినిమా మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేస్తూ రికార్డుల దారిలో దూసుకెళ్తోంది. ఈ సినిమా ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే అత్యంత ఘన విజయాన్ని అందుకున్నారు. తాజాగా జరిగిన ప్రతిష్టాత్మక SIIMA Awards 2025లో పుష్ప 2 దుమ్మురేపింది. ఈ అవార్డుల్లో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా, పుష్ప 2 సినిమా మొత్తం 5 విభాగాల్లో అవార్డులు సొంతం చేసుకుని మరోసారి తన సత్తా చాటుకుంది.

ఈ సినిమా నుంచి ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ ఎంపిక కాగా, ఉత్తమ నటిగా రష్మిక మందన్నా అవార్డు అందుకుంది. అలాగే ఉత్తమ దర్శకుడి అవార్డు డైరెక్టర్ సుకుమార్ కు దక్కింది. ఉత్తమ కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌లో సుకుమార్ తన సత్తా కనబరిచారు. అలాగే.. ఇక ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దేవి శ్రీ ప్రసాద్ దక్కించుకోగా.. ఈ సినిమాలో 'పీలింగ్స్' పాట పాడిన శంకర్ బాబు కందుకూరికి ఉత్తమ గాయకుడు అవార్డు లభించింది.

36
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో పుష్ప 2 హవా
Image Credit : Asianet News

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ లో పుష్ప 2 హవా

తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024 (Gaddar Telangana Awards )లో పుష్ప 2: ది రూల్ దుమ్మురేపింది. ఈ వేడుకలో సినిమా ఉత్తమ చిత్రం (Best Film) అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటుడి (Best Actor) అవార్డు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దక్కింది. ముఖ్యంగా ఈ అవార్డును స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా అల్లు అర్జున్ అందుకోవడం ప్రత్యేకతగా నిలిచింది. దీనిపై బన్నీ భావోద్వేగానికి గురై “ఈ అవార్డు నాకు కేవలం గౌరవమే కాదు, బాధ్యతను కూడా గుర్తుచేస్తోంది” అని అన్నారు.

46
GAMA Awards 2025లో హవా
Image Credit : Asianet News

GAMA Awards 2025లో హవా

గామా అవార్డ్స్‌ 2025 (Gama 2025)లో కూడా పుష్ప రాజ్ రూలింగ్ కొనసాగింది. పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ సాధించిన పుష్ప-2కు (Pushpa 2 Best movie) అవార్డుల పంట పండింది. ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌ అవార్డును కైవసం చేసుకున్నారు. అలాగే.. ఈ వేడుకలో సినిమా ఉత్తమ చిత్రం (Best Film) అవార్డును గెలుచుకోగా, ఉత్తమ సంగీత దర్శకుడు (Best Music Director) అవార్డు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ దక్కించుకున్నారు.

56
బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 కలెక్షన్ల సునామీ
Image Credit : our own

బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 కలెక్షన్ల సునామీ

ుష్ప 2: ది రూల్ ఇండియన్ సినిమా చరిత్రలో సంచలన రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹1,785.84 కోట్లు గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2, కేజీఎఫ్ 2 కలెక్షన్లను అధిగమించింది. వరల్డ్‌వైడ్ గ్రాస్ – ₹1,785.84 కోట్లు అందుకుంది. ఇందులో ఇండియా వైడ్ గా గ్రాస్ రూ. 1,493.84 కోట్లు కలెక్ట్ చేసింది. 

ఇందులో పుష్ప 2 హిందీ వెర్షన్ ఒక్కటే ₹836.09 కోట్లు కోట్లు గ్రాస్ సాధించింది. ఇది ఇప్పటివరకు ఏ హిందీ వెర్షన్ సాధించని రికార్డు. అలాగే BookMyShowలో 19.5 మిలియన్ టికెట్లు అమ్ముడై బాహుబలి 2 రికార్డును కూడా అధిగమించింది.

ఇక ఓవర్సీస్ గ్రాస్ రూ. 292 కోట్లు కొల్లాగొట్టింది. మొత్తం గా పుష్ప 2 ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ఇండియన్ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిందనే చెప్పాలి.

66
అల్లు అర్జున్ రేర్ ఫీట్
Image Credit : our own

అల్లు అర్జున్ రేర్ ఫీట్

జాతీయ అవార్డుతో పాటు.. ఇప్పుడు SIIMA, Gaddar Telangana Awards, GAMA Awards వరకూ వరుసగా బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకోవడం అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. అభిమానులు ఆయనను “Icon Star నుంచి National Star”గా సంబోధిస్తున్నారు. మొత్తానికి పుష్ప 2: ది రూల్ సినిమా కేవలం బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు.. అవార్డుల బ్లాక్‌బస్టర్ కూడా అవుతోంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
అల్లు అర్జున్
తెలుగు సినిమా
రష్మిక మందన్న
ఆసియా కప్ 2025
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ambika Vs Radha: రాధ కంప్లైంట్‌పై అంబిక కౌంటర్.. మోసపోయింది నేనే అంటూ చెల్లికి అక్క ట్విస్ట్
Recommended image2
Michael Jackson: రజనీకాంత్ కోసం మైఖేల్ జాక్సన్ పాడాల్సింది.. 16 ఏళ్ల తర్వాత తమన్ చెప్పిన సీక్రెట్!
Recommended image3
P N Ramachandra Rao: సీనియర్ దర్శకుడికి అరుదైన పురస్కారం.. గవర్నర్‌ చేతుల మీదుగా ప్రదానం
Related Stories
Recommended image1
Pushpa 2 : ‘ఇది పుష్పగాడి రూలు’.. పూర్తి డైలాగ్ లీక్ చేసిన అల్లు అర్జున్..
Recommended image2
అల్లు అర్జున్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఏంటో తెలుసా? రాత్రికి రాత్రే కుట్ర జరిగిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved