మహేష్, ఎన్టీఆర్ పై పూరి జగన్నాధ్ సెటైర్లు..మరీ అంత బ్యాడ్ నేమ్ ఉందా ?
ఇండస్ట్రీలో పవన్,మహేష్, ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలకి ఎలాంటి బ్యాడ్ నేమ్ ఉందో అనే విషయాన్ని పూరి జగన్నాధ్ సెటైర్లు వేస్తూ తెలిపారు.

పూరి జగన్నాధ్ మూవీస్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ దాదాపుగా అగ్ర హీరోలందరితో సినిమాలు చేశారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి హీరోలతో పూరి జగన్నాధ్ సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించారు. పూరి జగన్నాధ్ చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు పూరి జగన్నాధ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతారు. పూరి జగన్నాధ్ కెరీర్ లో బద్రి, ఇడియట్, పోకిరి, దేశముదురు, చిరుత, టెంపర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి.
KNOW
స్టార్ హీరోలపై పూరి జగన్నాధ్ కామెంట్స్
పూరి జగన్నాధ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ టాలీవుడ్ టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్ పై సెటైర్లు వేశారు. ఫన్నీగా పూరి జగన్నాధ్ ఆ కామెంట్స్ చేసినప్పటికీ అవి వైరల్ అయ్యాయి. ఈ హీరోలపై ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాడ్ నేమ్ ఉంది అనే విషయాన్ని పూరి జగన్నాధ్ బయటపెట్టారు.
పవన్ కళ్యాణ్ అలా చెబితే చాలు
ఇండస్ట్రీలో కొందరు హీరోలకు కొన్ని కబుర్లు చెబితే కథ కూడా వినకుండా డేట్లు ఇచ్చేస్తారట. ఈ మూవీలో మొత్తం గన్స్ ఉంటాయి, విలన్ పెద్ద గన్ డీలర్, ఇష్టం వచ్చినట్లు కాల్చేసుకోవచ్చు అని చెబితే వెంటనే పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చేస్తారు. అవుట్ డోర్ షూటింగ్ ఏమి ఉండదు.. మొత్తం ఇండోర్ లోనే, భారీ సెట్లలో షూటింగ్ అంటే ప్రభాస్ డేట్లు ఇచ్చేస్తారట.
ఎన్టీఆర్, మహేష్ పై సెటైర్లు
ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ గ్యారెంటీ అని ఎన్టీఆర్ కి చెబితే, కుమ్మేద్దాం భయ్యా అని వెంటనే డేట్లు ఇచ్చేస్తారట. ఇవాళ షూటింగ్ మొదలు పెడుతున్నాం.. 30 రోజుల్లో పూర్తయిపోయింది అని చెబితే రవితేజ డేట్లు ఇస్తారు. రేపు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు అని చెబితే మహేష్ బాబు డేట్లు ఇస్తారు అంటూ పూరి జగన్నాధ్ సెటైర్లు వేశారు.
పగలబడి నవ్విన మహేష్
ఈ హీరోలపై ఇండస్ట్రీలో ఇలాంటి బ్యాడ్ నేమ్ ఉందని పూరి జగన్నాధ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కి గన్స్ అంటే ఫ్యాషన్ ఉంది. అదే విధంగా మహేష్ బాబు నటించే చిత్రాలు ఎక్కువగా డిలే అవుతుంటాయి. ఈ అంశాలని బేస్ చేసుకునే పూరి సెటైర్లు వేశారు. పూరి సెటైర్లు వేస్తుండడంతో అక్కడే ఉన్న మహేష్ బాబు పగలబడి నవ్వారు. మహేష్, పూరి కాంబినేషన్ పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన బిజినెస్ మ్యాన్ కూడా మంచి విజయం సాధించింది.