- Home
- Entertainment
- తన ఇండస్ట్రీ హిట్ రికార్డ్ బ్రేక్ చేసిన మహేష్ కి చిరంజీవి ఏం చెప్పారో తెలుసా.. ఇలా చేస్తారని ఊహించడం కష్టం
తన ఇండస్ట్రీ హిట్ రికార్డ్ బ్రేక్ చేసిన మహేష్ కి చిరంజీవి ఏం చెప్పారో తెలుసా.. ఇలా చేస్తారని ఊహించడం కష్టం
తాను నటించిన ఓ సూపర్ హిట్ చిత్రం రిలీజ్ అయ్యాక చిరంజీవి చేసిన పనికి మహేష్ బాబు ఆశ్చర్యపోయారట. ఇంతకీ చిరంజీవి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు పోకిరి
సూపర్ స్టార్ మహేష్ బాబు నటనని చాలా మంది సెలబ్రిటీలు అభినందిస్తుంటారు. బడా స్టార్లు సైతం మహేష్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. పోకిరి రిలీజ్ అయిన తర్వాత రజనీకాంత్, చిరంజీవి లాంటి సెలెబ్రిటీలు అభినందించినట్లు మహేష్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
KNOW
నటించి చూపించిన చిరంజీవి
చిరంజీవి గారి కాంప్లిమెంట్స్ ఎప్పుడూ చాలా జెన్యూన్ గా ఉంటాయి. పోకిరి మూవీ రిలీజ్ రికార్డులు సృష్టించిన తర్వాత మహేష్ బాబుని చిరంజీవి పూరి జగన్నాధ్ ఆఫీస్ లో కలిశారట. పోకిరి చిత్రం అంతకు ముందు ఉన్న ఇండస్ట్రీ హిట్ ఇంద్ర రికార్డుని బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పోకిరి చిత్రాన్ని చిరంజీవి గారు అభినందిస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగులు మొత్తం యాక్ట్ చేసి చూపించేస్తున్నారు.
మొదట అభినందించేది చిరంజీవి గారే
నేను నటించిన ఏ చిత్రం బావున్నా నన్ను మొదట అభినందించే వ్యక్తి చిరంజీవి గారు అని మహేష్ తెలిపారు. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.
ఇంద్ర మూవీ రికార్డులు
2002 విడుదలైన ఇంద్ర చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంద్ర చిత్రం వరల్డ్ వైడ్ గా అప్పట్లోనే దాదాపు 30 కోట్ల షేర్ రాబట్టింది. దీనితో తిరుగులేని ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. ఇంద్ర మూవీ 32 కేంద్రాల్లో 175 రోజులు ప్రదర్శించబడింది.
పోకిరి సంచలనం
నాలుగేళ్ళ తర్వాత పోకిరి చిత్రం ఇంద్ర రికార్డుని బ్రేక్ చేసింది. పోకిరి మూవీ ఏకంగా వరల్డ్ వైడ్ గా 42 కోట్ల షేర్ రాబట్టింది. టాలీవుడ్ లో 40 కోట్ల మార్క్ టచ్ చేసిన తొలి చిత్రం పోకిరి. మహేష్ బాబు క్రేజ్ ని పోకిరి చిత్రం నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.