- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం పూరీ జగన్నాథ్ ఆడిన ఆ అబద్ధం.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ను చేసింది
పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం పూరీ జగన్నాథ్ ఆడిన ఆ అబద్ధం.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్ ను చేసింది
సినిమా కోసం ఎన్నో కష్టాలుపడిన వారిలో...పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో ఆయన చెప్పిన అబంద్ధం పూరీ కెరీర్ ను నిలబెట్టిందట. ఆ అబద్ధం వల్లే.. పవర్ స్టార్ తో సినిమా చేసేఛాన్స్ కూడా వచ్చిందట. ఇంతకీ పూరీ ఆడియన అబద్ధం ఏంటీ...?

టాలీవుడ్ మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒక్కరు పూరి జగన్నాథ్..మూసలో వెళ్తున్న తెలుగు సినిమా హీరోయిజంకి సరికొత్త నిర్వచనం తెలిపి ఇండస్ట్రీ లోనే ఒక్క బిగ్గెస్ట్ బ్రాండ్ గా అవతారం ఎత్తిన పూరి జగన్నాథ్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ వేరు.. ఆయన ఇమేజ్ సెపరేటు.
వరుసగా ఎన్ని ఫ్లాప్స్ పడినా కూడా పూరి జగన్నాథ్ సినిమాఅంటే ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. అంతే కాదు ఏ సినిమా అయినా.. పూరీని నమ్ముకుని థియేటర్స్ కి క్యూ కడుతారు జనాలు. అయితే వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న పూరి జగన్నాథ్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా మళ్ళీ లైఫ్ ఇచ్చింది. డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.. అగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కానుంది. ఈసినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు పూరీ.
పూరి జగన్నాథ్ కెరీర్ స్టార్ట్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యణ్ బద్రి సినిమాతో...ఈ సినిమా టైమ్ లో మర్చిపోలేని సంఘటనలు జరిగాయి. అంయితే బద్రి సినిమా సెట్ అవ్వడానికి కారణమే.. పూరీ అంతకు ముందే రాసుకున్న ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమానే. పూరీ పవన్ టీమ్ తో ఆడిన చిన్న అబధం వల్లే.. బద్రి చేసే ఛాన్స్ వచ్చిందట. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథను అడ్డం పెట్టుకుని బద్రి సినిమా చేశాడట పూరి. అదెలాగా...?
ఈ సినిమానే పూరి జగన్నాథ్ గారికి తొలి సినిమా..కానీ ఈ తొలి సినిమా ఛాన్స్ దక్కడానికి కారణం పూరీ చెప్పిన అబధ్ధమేనట.అప్పట్లో పవన్ కళ్యాణ్ ని కలిసి ఒక్క దర్శకుడు స్టోరీ చెప్పాలి అంటే ముందుగా అతని మేనేజర్ కి స్టోరీ వినిపించాలి..అతని అప్పోయింట్మెంట్ తీసుకొని అతనికి కథ వినిపించిన తర్వాత.. నచ్చితేనే పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు పర్మీషన్ ఇచ్చేవాడట.
బద్రి స్టోరీ చెప్తే ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అనే భయం తో పవన్ కళ్యాణ్ మేనేజర్ కి ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ ని వినిపించాడట పూరి జగన్నాథ్. ఆయనకి బాగా నచ్చడం తో పవన్ కళ్యాణ్ ను కలిసే ఇప్పించి ఆ స్టోరీ ని పవన్ కళ్యాణ్ కి వినిపించే అవకాశం కల్పించాడు. కానీ పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత ఇటు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ ని కాకుండా బద్రి కథని చెప్పాడట పూరి.
పవన్ కళ్యాణ్ కి ఆ స్టోరీ బాగా నచ్చడం తో ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడట. అలా పూరి జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం స్టోరీ ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసి.. తొలి సినిమా తోనే భారీ హిట్ ని అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ గా ఈ స్టేజ్ లో ఉన్నాడు పూరి.