- Home
- Entertainment
- సీరియల్ గా కూడా పనికిరాదు అన్నారు, హీరోలంతా రిజెక్ట్ చేశారు, హిట్టు కొట్టి చూపించిన పూరి జగన్నాథ్
సీరియల్ గా కూడా పనికిరాదు అన్నారు, హీరోలంతా రిజెక్ట్ చేశారు, హిట్టు కొట్టి చూపించిన పూరి జగన్నాథ్
ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు గా వెలుగు వెలుగుతున్నవారు ఒకప్పుడు సినిమా కోసం ఎన్నో కష్టాలుపడ్డవారే. అటువంటివారిలో పూరీ జగన్నాథ్ కూడా ఒకరు. అసలు సీరియల్ గా కూడా రిజెక్ట్ అయిన కథతో ఆయన సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు... స్టార్ డైరెక్టర్ అయ్యాడు.

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒక్కరు పూరి జగన్నాథ్..మూసలో వెళ్తున్న తెలుగు సినిమా హీరోయిజంకి సరికొత్త నిర్వచనం తెలిపి ఇండస్ట్రీ లోనే ఒక్క బిగ్గెస్ట్ బ్రాండ్ గా అవతారం ఎత్తిన పూరి జగన్నాథ్ కి మార్కెట్ లో ఉన్న క్రేజ్ వేరు.. ఆయన ఇమేజ్ సెపరేటు.
వరుసగా ఎన్ని ఫ్లాప్స్ పడినా కూడా పూరి జగన్నాథ్ సినిమాఅంటే ఆడియన్స్ లో ఓ క్యూరియాసిటీ ఉంటుంది. అంతే కాదు ఏ సినిమా అయినా.. పూరీని నమ్ముకుని థియేటర్స్ కి క్యూ కడుతారు జనాలు. అయితే వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న పూరి జగన్నాథ్ కి ఇస్మార్ట్ శంకర్ సినిమా మళ్ళీ లైఫ్ ఇచ్చింది. డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పింది.
పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా రేంజ్ లో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.. అగస్ట్ 25న ప్రపంచవ్యాప్తంగా అన్ని బాషలలో విడుదల కానుంది. ఈసినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నాడు పూరీ.
పూరి జగన్నాథ్ కెరీర్ లో మర్చిపోలేని సినిమా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. పూరీ కెరీర్ ను నిలబెట్టిన సినిమా అది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ సినిమా గా తెరకెక్కేముందు మరో ఆసక్తికరమైన సంఘటన కూడా చోటు చేసుకుందట. అసలు సీరియల్ గా రావల్సిన ఈసినిమా సినిమాగామంచి సక్సెస్ సాధించిందట.
పూరి జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ పని చేస్తున్న రోజుల్లోనే ఆయన ఈ స్టోరీ ని రెడీ చేసుకున్నాడు. అప్పట్లో ఈ స్టోరీని ఒక్క సీరియల్ గా తీసే ఆలోచన మాత్రమే పూరి జగన్నాథ్ లో ఉందట. అయితే ఆ టైమ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ దగ్గర పూరీ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారట. అది కూడా దూరదర్శన్ లో.
దీని కోసం ఆయన అప్పట్లో దూరదర్శన్ ఛానల్ చుట్టూ ప్రదిక్షణలు కూడా చేసాడు..కానీ దూరదర్శన్ ఛానల్ ఈ కథను సీనియల్ గా అంగీకరించలేదు..తర్వాత ఈ సినిమాని సీరియల్ వెర్షన్ లో కాకుండా సినిమా వెర్షన్ కి మార్చాడు పూరి జగన్నాథ్. సినిమా వెర్షన్ కి మార్చిన తర్వాత ఈ స్టోరీ ని ఫస్ట్ హీరో సుమంత్ కి వినిపించాడు..కానీ ఆయనకీ ఎందుకో ఈ కథ నచ్చక రిజెక్ట్ చేసాడు..
ఆ తర్వాత హీరో తరుణ్ తో చేద్దాం అనుకున్నాడు కానీ కుదర్లేదు..చివరికి అప్పుడప్పుడే హీరోగా మెల్లిగా నిలదొక్కుతున్న రవితేజ ని పెట్టి తీసాడు పూరి. ఇక ఆ తర్వాత ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి మన అందరికి తెలిసిందే..కంటెంట్ పరంగా మ్యూజిక్ పరంగా ఈ సినిమా అప్పట్లో ఒక్క సెన్సేషన్ అనే చెప్పొచ్చు..
ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు..సినిమా సినిమాకి ఎదుగుతూ టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ కమర్షియల్ మాస్ డైరెక్టర్ గా ఒక్క ప్రత్యేకమైన స్థానం ని ఏర్పరచుకున్నాడు పూరి జగన్నాథ్.