MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha Political Entry: రాజకీయాలను తలపించేలా త్రిష కోయంబత్తూర్ రోడ్ షో , మరో జయలలిత అవుతుందా?

Trisha Political Entry: రాజకీయాలను తలపించేలా త్రిష కోయంబత్తూర్ రోడ్ షో , మరో జయలలిత అవుతుందా?

Trisha Political Entry : కోయంబత్తూర్‌లో హీరోయిన్ త్రిషకు వచ్చిన భారీ రెస్పాన్స్ ఇప్పుడు అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందనేది చూస్తే.

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 27 2026, 09:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ?
Image Credit : X

పాలిటిక్స్‌లోకి త్రిష ఎంట్రీ?

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ఆమె సినిమాల వల్ల కాదు.. కోయంబత్తూర్‌లో ఆమెకు దక్కిన భారీ స్వాగతం అందరి దృష్టినీ లాగేసింది. ఒక మొబైల్ షోరూమ్ ఓపెనింగ్ కోసం కోయంబత్తూర్ వచ్చిన త్రిషను చూసేందుకు వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. ఈ జనాన్ని చూశాక, త్రిష పాలిటిక్స్‌లోకి వస్తుందా అనే చర్చ తమిళనాడులో మళ్లీ మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
త్రిషను చూసేందుకు ఎగబడ్డ జనం!
Image Credit : Instagram

త్రిషను చూసేందుకు ఎగబడ్డ జనం!

కోయంబత్తూర్‌లో జరిగిన మొబైల్ షోరూమ్ ఓపెనింగ్‌కు త్రిష రాగానే అభిమానులు ఉత్సాహం కట్టలు తెంచుకుంది. తమ ఫేవరెట్ హీరోయిన్‌ను నేరుగా చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఓపెన్ టాప్ వెహికల్‌లో నిలబడి త్రిష అభిమానులకు చెయ్యి ఊపుతూ తన ఆనందాన్ని పంచుకుంది. ఆమె రాక, జనాల అరుపులతో ఆ ఈవెంట్ దద్దరిల్లిపోయింది.

త్రిషకు జనాల్లో ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి ఈ క్రౌడే పెద్ద సాక్ష్యం అని అభిమానులు అంటున్నారు. అయితే, ఇది కేవలం ఒక బిజినెస్ ఈవెంట్ మాత్రమే. దీన్ని పొలిటికల్ రోడ్ షో కాదు. కానీ ఆమె కారులో ఓపెన్‌ టాప్‌లో అభిమానులకు అభివాదం చెబుతూ వచ్చిన తీరు పొలిటికల్‌ రోడ్‌ షోని తలపించింది.

35
మళ్లీ మొదలైన పొలిటికల్ రూమర్స్!
Image Credit : Asianet News

మళ్లీ మొదలైన పొలిటికల్ రూమర్స్!

హీరోయిన్ త్రిష పాలిటిక్స్‌లోకి వస్తుందా అనే ప్రశ్న కొత్తదేమీ కాదు. తమిళనాడులో హీరో విజయ్ పెట్టిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ టైమ్‌లో త్రిష పేరు కూడా తరచూ వినిపిస్తోంది. విజయ్ అభిమానులు, కొందరు టీవీకే సపోర్టర్స్ త్రిష పాలిటిక్స్‌లోకి రావాలని కోరుకుంటున్నట్లు టాక్.

కోయంబత్తూర్‌లో ఆమెకు దక్కిన భారీ రెస్పాన్స్ తర్వాత ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్న త్రిష, పాలిటిక్స్‌లోకి వస్తే ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

45
పొలిటికల్ ఎంట్రీపై త్రిష రియాక్షన్ ఇదే
Image Credit : Trisha Krishnan Instagram

పొలిటికల్ ఎంట్రీపై త్రిష రియాక్షన్ ఇదే

ఈవెంట్ అయిపోయాక, రిపోర్టర్లు త్రిషను పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగారు. ఈ ప్రశ్నకు ఆమె డైరెక్ట్‌గా ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా, జస్ట్ నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఇచ్చిన ఈ రియాక్షన్ ఇప్పుడు మరింత క్యూరియాసిటీని పెంచింది. తాను రాజకీయాల్లోకి రాబోతుందనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

55
సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్‌కు?
Image Credit : pinterest

సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ స్క్రీన్‌కు?

తమిళనాడులో సినిమాకు, రాజకీయాలకు చాలా కాలంగా దగ్గరి సంబంధం ఉంది. ఎంతోమంది నటులు పాలిటిక్స్‌లోకి వచ్చి తమ మార్క్ చూపించారు. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో, త్రిష పొలిటికల్ ఫ్యూచర్ గురించి అభిమానుల్లో ఆసక్తి రావడం కామనే.

అయినా, ఇప్పటికైతే త్రిష పాలిటిక్స్‌లోకి వస్తుందనడానికి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. అందుకే, కోయంబత్తూర్‌లో వచ్చిన జనాన్ని ఆమె పాపులారిటీకి గుర్తుగా చూడాలి తప్ప, ఆమె పాలిటిక్స్‌లోకి రావడం పక్కా అని డిసైడ్ అవ్వలేం.

మొత్తానికి, కోయంబత్తూర్‌లో త్రిషకు దక్కిన గ్రాండ్ వెల్‌కమ్ అటు సినిమా, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద డిబేట్‌కు దారితీసింది. త్రిష తన నెక్స్ట్ స్టెప్‌పై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందా అని అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. త్రిష నెక్స్ట్ జయలలిత అవుతుందనే టాక్ కూడా మొదలైంది. ఆమె సినిమాల్లోనే కంటిన్యూ అవుతుందా లేక పాలిటిక్స్‌లోకి అడుగుపెడుతుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ramayana Movie Songs: రామాయణం పాటలపై వివాదం... ఏఆర్ రెహమాన్ కూల్ రిప్లై!
Recommended image2
Ram Pothineni Heroines: రామ్ పోతినేనితో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు.. లిస్ట్ లో మొత్తం ఆరుగురు
Recommended image3
NTR: నువ్వు అడుగుపెట్టావు, ఎన్టీఆర్‌కి యాక్సిడెంట్ అయ్యింది.. దెబ్బకి శ్రీనివాస్‌ రెడ్డి బాడీ షేకింగ్‌
Related Stories
Recommended image1
Jailer 2 Break 2.0 Records: 2.0 రికార్డులు బ్రేక్‌.. కోలీవుడ్‌ ఇండస్ట్రీ హిట్‌ జైలర్‌ 2
Recommended image2
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved