MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుట్టినరోజున పేరు మార్చుకున్న పూరి జగన్నాథ్ కొడుకు, కారణం చెప్పకుండా ట్విస్ట్.. సోషల్ మీడియాలో ఊహాగానాలు

పుట్టినరోజున పేరు మార్చుకున్న పూరి జగన్నాథ్ కొడుకు, కారణం చెప్పకుండా ట్విస్ట్.. సోషల్ మీడియాలో ఊహాగానాలు

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 25 2024, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ యంగ్ హీరో తన పేరు మార్చుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
 

25

ఇకపై తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా పెట్టుకుంటున్నట్లు ఆయన పోస్ట్ చేశారు. కంటెంట్ ఉన్న మంచి కథలతో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నారు ఆకాష్ జగన్నాథ్. త్వరలోనే ఆ సినిమాల వివరాలను ఆయన వెల్లడించనున్నారు. ఈ మధ్య ఆర్ సీ ట్రెండ్ సెట్టర్స్ అనే క్లోత్ బ్రాండింగ్ కు అంబాసిడర్ గా వ్యవహరించారు ఆకాష్ జగన్నాథ్.

35

నేడు ఆకాష్ జగన్నాధ్ తన 27వ జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  పుట్టిన రోజు నాడు ఆకాష్ పూరి సడెన్ గా తన పేరుని ఎందుకు మార్చుకున్నారు అనే సందేహాలు నెటిజన్లకు కలుగుతున్నాయి. ఆకాష్ జగన్నాథ్ అని మార్చుకోవడానికి కారణం ఏంటి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

45

అయితే ఆకాష్ ఎలాంటి కారణం చెప్పలేదు. అయితే సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆకాష్ న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకున్నారా అనే చర్చ జరుగుతోంది. 

55

ఎందుకంటే ఆకాష్ కి హీరోగా అసలు కలసి రావడం లేదు. హీరోగా పూరి జగన్నాధ్ కొడుక్కి ఒక్క హిట్ కూడా లేదు. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం కలసి వచ్చేలా పేరు మార్చుకుని ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో సాయిధరమ్ తేజ్ కూడా పేరు మార్చుకున్నారు. మరి ఇకపై పూరి కొడుకు ఆకాష్ జగన్నాథ్ కెరీర్ లో గేర్ మారుస్తాడేమో చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిన్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Recommended image2
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Recommended image3
Ramayana: 4000 కోట్ల 'రామాయణ'లో రాముడిగా రణ్‌బీర్.. కూతురు రాహా అడిగిన ప్రశ్నలకు ఫిదా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved