పూరి జగన్నాథ్ తో స్టార్ హీరో స్నేహానికి బీటలు ?.. ఆమె రాయబారానికి వెళ్లినా బెడిసికొట్టిందా..
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. రాంచరణ్ లాంచ్ చేసినా, రవితేజ, మహేష్ లాంటి హీరోలకు బిగ్ హిట్స్ ఇచ్చి వారి కెరీర్ రూపురేఖలు మార్చేసినా పూరి జగన్నాథ్ కే చెల్లింది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలందరితో సినిమాలు చేశారు. రాంచరణ్ లాంచ్ చేసినా, రవితేజ, మహేష్ లాంటి హీరోలకు బిగ్ హిట్స్ ఇచ్చి వారి కెరీర్ రూపురేఖలు మార్చేసినా పూరి జగన్నాథ్ కే చెల్లింది. ఇటీవల పూరి జగన్నాథ్ అంతగా ఫామ్ లో లేరు అనేది వాస్తవమే.
త్వరలో పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ కి డబుల్ ఇస్మార్ట్ చిత్రం హిట్ కావడం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే ఆగష్టు 15 రిలీజ్ డేట్ ఇద్దరు మిత్రుల మధ్య చిచ్చు పెట్టేలా మారింది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రాణ స్నేహితుల మధ్య బంధం బీటలు వాలెలా చేసిందట. ఆ ఇద్దరు స్నేహితులు ఎవరో కాదు పూరి జగన్నాధ్, రవితేజ. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఇలా ఉండడానికి కారణం పూరి జగన్నాథ్ అని చెప్పొచ్చు.
ఇడియట్ చిత్రంలో రవితేజ కెరీర్ ని మార్చేసిన ఘనత పూరి జగన్నాథ్ కి దక్కుతుంది. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అమ్మానాన్న ఓ తమిళమ్మాయి లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని పూరి.. రవితేజకి ఇచ్చారు. ఇప్పుడు తన డబుల్ ఇస్మార్ట్ చిత్రం రిలీజ్ అవుతున్న తేదీనే .. రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
దీనితో పూరి జగన్నాధ్ రవితేజపై ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఛార్మి రవితేజ దగ్గరికి మిస్టర్ బచ్చన్ చిత్ర యూనిట్ దగ్గరికి రాయబారానికి వెళ్లిందట. రిలీజ్ డేట్ మార్చుకోమని అడిగిందట. కానీ రవితేజ.. ఛార్మి ప్రతిపాదనని తిరస్కరించినట్లు తెలుస్తోంది.
దీనితో పూరి జగన్నాధ్ రవితేజపై మనస్తాపానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ప్రచారం పై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ వార్తలు మాత్రం జోరుగా వస్తున్నాయి. అటు మిస్టర్ బచ్చన్, ఇటు డబుల్ ఇస్మార్ట్ రెండు చిత్రాలపై మంచి అంచనాలు ఉన్నాయి.