- Home
- Entertainment
- తాగి షూటింగ్ కి వచ్చిన డైరెక్టర్, ఆ ఒక్క కారణంతో ఏమీ చేయలేకపోయిన బాలయ్య, మూవీ రిజల్ట్ ఏంటంటే
తాగి షూటింగ్ కి వచ్చిన డైరెక్టర్, ఆ ఒక్క కారణంతో ఏమీ చేయలేకపోయిన బాలయ్య, మూవీ రిజల్ట్ ఏంటంటే
నందమూరి బాలకృష్ణకి ఒక దశలో చాలా బ్యాడ్ టైం కొసాగింది. లక్ష్మి నరసింహ చిత్రం తర్వాత దాదాపు 6 ఏళ్ళు బాలయ్యకి సరైన హిట్ లేదు. ఎలాంటి చిత్రం చేసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతోంది.

Nandamuri Balakrishna
నందమూరి బాలకృష్ణకి ఒక దశలో చాలా బ్యాడ్ టైం కొసాగింది. లక్ష్మి నరసింహ చిత్రం తర్వాత దాదాపు 6 ఏళ్ళు బాలయ్యకి సరైన హిట్ లేదు. ఎలాంటి చిత్రం చేసినా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతోంది. విజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, మహారథి, వీరభద్ర, ఒక్క మగాడు, మిత్రుడు లాంటి ఫ్లాప్ చిత్రాలన్నీ ఆ టైం లో వచ్చినవే.
Veerabhadra movie
ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ బాలయ్యతో వీరభద్ర అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచింది. ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో తనుశ్రీ దత్తా, సదా హీరోయిన్లుగా నటించారు. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర పరాజయం గురించి నిర్మాత అంబికా కృష్ణ మాట్లాడుతూ దర్శకుడిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
Veerabhadra movie
వీరభద్ర మూవీ ఫ్లాప్ కావడానికి పూర్తి కారణం దర్శకుడే. అతడు పరమ నీఛుడు అంటూ అంబికా కృష్ణ విరుచుకుపడ్డారు. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో డేట్లు ఇస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ? కానీ అహంకారంతో ఇష్టం వచ్చినట్లు చేశాడు. విపరీతంగా డబ్బు ఖర్చు చేయించి సినిమా ఫ్లాప్ కి కారణం అయ్యాడు.
Veerabhadra movie
కొన్ని సందర్భాల్లో తాగేసి షూటింగ్ కి వచ్చాడు. మరి బాలయ్య అతడిని యేమి అనలేదా అని ప్రశ్నించగా.. బాలయ్య కూడా కొన్నిసార్లు దర్శకుడిపై కేకలు వేశారు. కానీ బాలయ్యలో ఒక లక్షణం ఉంది. లొకేషన్ కి వెళ్ళాక దర్శకుడి మాటని గౌరవిస్తారు. దర్శకుడు ఏం చెబితే అది చేస్తారు. సినిమా కమిట్ అయ్యాం కాబట్టి పూర్తి చేయాలి అని నాతో చెప్పేవారు. దర్శకులకు విలువ ఇచ్చే ఆర్టిస్ట్ బాలయ్య. కాబట్టే రవికుమార్ చౌదరిని ఏమి అనకుండా వదిలేశారు అని అంబికా కృష్ణ తెలిపారు.
Veerabhadra movie
వీర భద్ర వల్ల చాలా డబ్బు నష్టపోయాను. బాలయ్య పిలిపించి బాధపడకండి, మంచి దర్శకుడితో మరో కథ చేయించండి, తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చారు. కానీ నాకే కుదర్లేదు అని అంబికా కృష్ణ తెలిపారు. యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం లాంటి హిట్ చిత్రాలని ఏఎస్ రవికుమార్ తెరకెక్కించారు.