అది లెక్క, మెగా ఫ్యామిలీకి సంధ్య థియేటర్ అందుకే సెంటిమెంట్.. పవన్ కి నా గురించి చాడీలు చెప్పి చెడగొట్టారు
నిర్మాత గిరి లేటెస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, మెగా ఫ్యామిలీకి సంధ్య థియేటర్ సెంటిమెంట్ గా మారడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో తొలి ప్రేమ చిత్రం తాను నిర్మించాలని గిరి అనుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభించింది అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత గోకులంలో సీత చిత్రం పర్వాలేదనిపించింది. మూడవ చిత్రం సుస్వాగతం హిట్ అయింది. నాల్గవ చిత్రంగా తొలిప్రేమ తెరకెక్కి రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ మూవీ విషయంలో ఒక నిర్మాతకి అన్యాయం జరిగిందట. ఆయన ఎవరో కాదు ఆంధ్రావాలా చిత్ర నిర్మాత గిరి.
నిర్మాత గిరి లేటెస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి, మెగా ఫ్యామిలీకి సంధ్య థియేటర్ సెంటిమెంట్ గా మారడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో తొలి ప్రేమ చిత్రం తాను నిర్మించాలని గిరి అనుకున్నారు. ఆరు నెలలు కరుణాకరణ్ తో కూర్చుని కథ రెడీ చేయించా. పవన్ కళ్యాణ్ కి స్నేహితులు నాకు తెలిసినవాళ్ళు ఉంటే వారి ద్వారా ఆయన్ని కలిశా.
కథ వినిపించగానే వెంటనే పవన్ కళ్యాణ్ ఎప్పుడు షూటింగ్ మొదలు పెడుతున్నాం అని అడిగారు. నేను అడ్వాన్స్ ఎంత ఇవ్వమంటారు అని అడిగా.. అదంతా తర్వాత చూసుకుందాం.. ముందు లొకేషన్స్ ఫైనల్ చేసి షూటింగ్ మొదలుపెట్టాలి అని అన్నారు. అంతలా పవన్ కళ్యాణ్ కి తొలిప్రేమ కథ నచ్చేసింది. నా స్నేహితుడు మహేందర్ రెడ్డి అని ఉన్నారు. ఆయన నేను పార్ట్నర్స్. ఈ విధంగా పవన్ కళ్యాణ్ తో సినిమా ఒకే అయింది. ఇద్దరం కలసి చేద్దాం. ప్రస్తుతానికి నువ్వు డబ్బు పెట్టు అని చెప్పా. ఆయన దగ్గర నాకు రావలసిన డబ్బు కొంత ఉంది.
కానీ మహేందర్ రెడ్డి కరుణాకరణ్, పవన్ కళ్యాణ్ ని కలసి గిరి దగ్గర డబ్బు లేదు. ఆయన ఈ చిత్రాన్ని సరిగ్గా నిర్మించలేడు. ఎక్కువ డబ్బు పెట్టలేడు. సినిమా చెడిపోతుంది మీ ఇష్టం అని చాడీలు చెప్పారు. దీనితో పవన్ వెంటనే జివిజి రాజుని పిలిపించి నిర్మాతగా ఆయన్ని ఫైనల్ చేశారు. దీనితో నాకు చాలా డిసప్పాయింట్ గా అనిపించింది. ఆ చిత్రం కోసం 6 నెలలు కష్టపడ్డ నాకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అని బాధపడ్డా.
ఆ తర్వాత జివిజి రాజు నన్ను పిలిపించి నైజాం ఏరియాలో తొలిప్రేమ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పారు. నేను నైజాం ఏరియా హక్కులు 80 లక్షలకు కొనుక్కున్నా. మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఏంటంటే ఆ 80 లక్షల మొత్తం షేర్ ఒక్క సంధ్య థియేటర్ లోనే తొలిప్రేమ చిత్రం వసూలు చేసింది. మిగిలినదంతా లాభాలే. పెట్టుబడి మొత్తం ఒక్క థియేటర్ ద్వారానే రావడం అనేది అరుదైన రికార్డ్ అని గిరి అన్నారు. మెగా హీరోల చాలా చిత్రాలు సంధ్య థియేటర్ లో అద్భుతంగా ఆడాయి. తొలిప్రేమ, ఘరానా మొగుడు, ఖుషి చిత్రాలు సంధ్య థియేటర్ లో రికార్డులు సృష్టించాయి అని గిరి తెలిపారు. ఆ విధంగా సంధ్య థియేటర్ మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా మారింది.
కానీ ఇటీవల సంధ్య థియేటర్ విషయంలో అల్లు అర్జున్ పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. నిర్మాత గిరి మాట్లాడుతూ అప్పట్లో సినిమాలు 175 డేస్ ఆడితే థియేటర్స్ కి కొంత డబ్బు ఇవ్వాల్సి వచ్చేది. ఎందుకంటే కలెక్షన్స్ తగ్గినప్పుడు థియేటర్స్ వాళ్ళు డబ్బు అడిగేవారు. లేకుంటే 175 డేస్ ఆడించేవారు కాదు. అలా థియేటర్ కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 175 డేస్ ఆడిన చిత్రాలు తొలి ప్రేమ, ఖుషి, ఘరానా మొగుడు అని చెప్పారు.