పాయిల్ వివాదంపై నిర్మాతల మండలి ఖండన, డబ్బు కోసమేనా రచ్చ?
ఇప్పటికే 47రోజుల పాటు తన సేవల్ని ఉపయోగించుకున్నామని.. మిగిలిన 3రోజులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాలని కోరగా తిరస్కరించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

నటి పాయల్ రాజ్‌పూత్ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. “నీ సొంపులు చూపిస్తే బాగుంటుంది అని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు అని మా నిర్మాత నాతో చెప్పాడు. అసభ్యకరమైన భాష ఉపయోగించాడు,” అంటూ ఆదివారం పాయల్ రాజపుత్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి కలకలం రేపింది.ఆమె గతంలో ప్రణదీప్ ఠాకూర్ దర్శక నిర్మాణంలో ‘రక్షణ’ (5వైస్) అనే చిత్రంలో నటించింది. రకరకాల కారణాలతో లేటు అయిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కు రెడీ అయ్యింది.
అయితే ఇప్పుడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పాయల్ నిరాకరిస్తున్నట్లు చిత్ర నిర్మాత, దర్శకుడు ప్రణదీప్ ఠాకూర్ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. పాయల్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆమె ఈ సినిమా షూటింగ్ కు.. ప్రచార కార్యక్రమాలకు కలిపి 50రోజుల పాటు పని చేయాల్సి ఉందని.. ఇందులో ఇప్పటికే 47రోజుల పాటు తన సేవల్ని ఉపయోగించుకున్నామని.. మిగిలిన 3రోజులు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాలని కోరగా తిరస్కరించినట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు పాయల్ సోమవారం ఉదయం ఈ చిత్ర విషయమై సోషల్ మీడియా ఇనిస్ట్రా లో కొన్ని ఆరోపణలు చేశారు. తనకు రావాల్సిన బకాయిలు చెల్లించకుండా ‘రక్షణ’ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారని, ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒత్తిడి చేస్తున్నారని.. తెలుగు సినిమా నుంచి తనను బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆరోపించారు.
Payal Rajput
దీంతో ఈ వివాదంపై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి స్పందించింది. చిత్ర టీమ్ తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పాయల్ గౌరవించాల్సి ఉందని.. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదని తెలిపింది. ఈ సినిమా నాలుగేళ్ళ క్రితం మొదలైంది. అనేక కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది. దాంతో ఆమె తనకు రావాల్సిన ఆరు లక్షల రూపాయలతో పాటు అదనంగా డబ్బు ఇస్తేనే ప్రమోషన్ కి వస్తాను అంటోందిట.
నిర్మాత తనకు 6 లక్షలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్న విషయం మా దృష్టికి మార్చిలోనే వచ్చిందని నిర్మాతల మండలి తాజాగా ప్రకటించింది. ఆ మొత్తం ఇప్పిస్తామని పాయల్ కి, ఆమె మేనేజర్ కి చెప్పినా వాళ్ళు సమస్యని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోలేదు మండలి తెలిపింది.కానీ, ఆమె తెలుగు చలన చిత్ర పరిశ్రమ తనని నిషేధించడానికి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేయడం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని పేర్కొంది.
పాయల్ ప్రధాన పాత్రలో నటించిన మంగళవారం చిత్రం ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. పాయల్ రాజ్ పుత్ మరోసారి బోల్డ్ గా అదరగొట్టేసింది అని కథాంశం చాలా కొత్తగా ఉందని ప్రశంసలు దక్కాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం వర్కవుట్ అవుతుందని దర్శక,నిర్మాతలు భావిస్తున్నారు.