MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో సీఎం అయ్యే యోగం ఉన్న నటుడు అతడే, ధైర్యంగా సినిమా చేసేయ్.. నిర్మాతకి చెప్పిన జ్యోతిష్యుడు

టాలీవుడ్ లో సీఎం అయ్యే యోగం ఉన్న నటుడు అతడే, ధైర్యంగా సినిమా చేసేయ్.. నిర్మాతకి చెప్పిన జ్యోతిష్యుడు

ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల దాదాపు 23 ఏళ్ళ క్రితమే టాలీవుడ్ స్టార్ హీరో జాతకాన్ని జ్యోతిష్యుడికి చూపించారట. ఆ హీరోకి సీఎం అయ్యే యోగం ఉన్నట్లు జ్యోతిష్యుడు చెప్పారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 27 2025, 08:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సినిమా నటులు రాజకీయాల్లోకి 
Image Credit : Youtube/@Madhuraaudio

సినిమా నటులు రాజకీయాల్లోకి 

చిత్ర పరిశ్రమ నుంచి చాలా మంది రాజకీయాల్లోకి వెళ్లారు. ఎందరో నటులు, నిర్మాతలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సీఎం పీఠాన్ని అధిరోహించింది ఎన్టీఆర్ మాత్రమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల వ్యవధిలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో విజయం సాధించారు. ఎన్టీఆర్ తర్వాత ఇంకెవరూ టాలీవుడ్ నుంచి సీఎం కాలేదు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జూ.ఎన్టీఆర్ పై చంటి అడ్డాల కామెంట్స్ 
Image Credit : Instagram/@jrntr

జూ.ఎన్టీఆర్ పై చంటి అడ్డాల కామెంట్స్ 

 దాదాపు 23 ఏళ్ళ కిందటే ఓ జ్యోతిష్యుడు.. ప్రముఖ నిర్మాత చంటి అడ్డాలకి జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారట. నిర్మాత చంటి అడ్డాల తారక్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందే నేను బాలయ్య బాబుతో సినిమా చేసి ఉన్నాను. ఆయనకు జాతకాల మీద నమ్మకం ఎక్కువ. ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అనుకున్నప్పుడు ఆయన జాతకాన్ని, జన్మ నక్షత్రాలని ఓ జ్యోతిష్యుడికి చూపించాను. 

35
తారక్ కి సీఎం అయ్యే యోగం 
Image Credit : Instagram/@jrntr

తారక్ కి సీఎం అయ్యే యోగం 

ఈ కుర్రాడికి రాజకీయాల్లో మంచి యోగం ఉంది. సీఎం కూడా కావచ్చు. జాతకం చాలా బలంగా ఉంది. ధైర్యంగా సినిమా తీసేయ్ అని ఆయన నాతో చెప్పారు. ఆ విధంగా ఎన్టీఆర్ తో అల్లరి రాముడు సినిమా ప్రారంభించాం. డైరెక్టర్ బి గోపాల్ తో సినిమా అని తారక్ కి చెప్పగానే ఎగిరి గంతేసి నన్ను కౌగిలించుకున్నాడు. కానీ అల్లరి రాముడు చిత్రం ప్రేక్షకులని ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. ఆ సినిమా వల్ల తనకి ఎలాంటి నష్టాలు రాలేదు అని చంటి అడ్డాల తెలిపారు. 

45
అల్లరి రాముడు సినిమాకి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 
Image Credit : Instagram/@jrntr

అల్లరి రాముడు సినిమాకి ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 

అల్లరి రాముడు చిత్రానికి ఎన్టీఆర్ కి తాను రూ.25 లక్షల పారితోషికం ఇచ్చినట్లు చంటి అడ్డాల తెలిపారు. ఆది సినిమా అప్పటికే సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ కి మంచి క్రేజ్ వచ్చింది. 

55
రాజకీయాలకు దూరంగా.. 
Image Credit : Instagram/@jrntr

రాజకీయాలకు దూరంగా.. 

అయితే ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అనేది తనకి తెలియదు అని చంటి అడ్డాల అన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పాలకొల్లులో ఆయన కోసం డోర్ టు డోర్ క్యాంపైన్ చేశాను. ఆ తర్వాత రాజకీయాలు వద్దనుకుని దూరం జరిగినట్లు చంటి అడ్డాల తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
ఏపీ మాజీ మంత్రి రోజాకి మతిపోయేలా చేసిన సూర్య, ఏకంగా 51 మంది డాక్టర్లు..కష్టపడుతూ ఇంటిని చూసుకుంటున్నా
Recommended image2
గేమ్ ఛేంజర్ నుంచి హరిహర వీరమల్లు వరకు.. 2025లో ఈ 6 భారీ ఫ్లాపులకు ఏఐ చెప్పిన కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved