కీర్తిసురేష్ ప్రస్తుతం `రివాల్వర్ రీటా` అనే చిత్రంలో నటించింది. తమిళంలో రూపొందిన ఈ మూవీ రాధికాశరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా, సునీల్ విలన్ రోల్ చేశారు.
జేకే చంద్రు దర్శకత్వం వహించారు. యాక్షన్ కామెడీ గా రూపొందిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. రేపు శుక్రవారం(నవంబర్ 28న) ఈ చిత్రం విడుదల కాబోతుంది.
Image credits: instagram/@keerthysureshofficial
Telugu
చిరంజీవిపై కీర్తిసురేష్ కామెంట్స్
కీర్తిసురేష్ నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అవి దుమారం రేపుతున్నాయి.
Image credits: instagram/@keerthysureshofficial
Telugu
విజయ్ డాన్స్ అంటే ఇష్టం
విజయ్, చిరంజీవి డాన్సుల్లో ఎవరు బెస్ట్ అంటే, తనకు విజయ్ డాన్స్ అంటేనే ఇష్టమని తెలిపింది. ఈ విషయం చిరంజీవి కూడా తెలుసు అని, ఆయనతోనూ ఈ విషయాన్ని డిస్కష్ చేసిన్నట్టు చెప్పింది.
Image credits: instagram/@keerthysureshofficial
Telugu
కీర్తి సురేష్ తెలుగు కెరీర్ ప్రశ్నార్థకమేనా?
దీంతో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కీర్తి కామెంట్స్ వివాదంగా మారిన నేపథ్యంలో ఆమె టాలీవుడ్ కెరీర్ ఇక ప్రశ్నార్థకమే అంటున్నారు నెటిజన్లు. ఆఫర్లు కష్టం అంటున్నారు.
Image credits: instagram/@keerthysureshofficial
Telugu
విజయ్ దేవరకొండతో సినిమాలో నటిస్తోన్న కీర్తి
ప్రస్తుతం కీర్తిసురేష్ తెలుగులో విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.