- Home
- Entertainment
- రిలీజ్‌కు మూడు నెలల ముందే ఫ్లాప్ టాక్.. మహేష్ బాబు మూవీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
రిలీజ్‌కు మూడు నెలల ముందే ఫ్లాప్ టాక్.. మహేష్ బాబు మూవీపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 1: నేనొక్కడినే’. ఈ మూవీ నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ రిలీజ్‌కు మూడు నెలల ముందే సినిమాకు ఫ్లాప్ అవ్వవచ్చని తనకు ముందే తెలుసంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రిలీజ్‌కు మూడు నెలల ముందే ఫ్లాప్ టాక్
Mahesh Babu Movie: సినిమా అనేది రంగుల ప్రపంచం. ఎప్పుడూ ఎవరికి హిట్ పడుతుందో? ఏ సినిమా డిజాస్టార్ గా మారుతుందో? అంచనా వేయడం చాలా కష్టం. కొన్ని పెద్ద బడ్జెట్, స్టార్ హీరోలతో రూపొందిన చిత్రాలు కూడా పెద్ద నష్టాలే అందుకున్నాయి, మరికొన్ని చిన్న సినిమాలు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి.
అయితే.. మూవీ మేకర్స్ వారు అనుకున్న విధంగా రాకపోతే.. షూటింగ్ మధ్యలోనే మార్పులు చేస్తారు. కానీ, మహేష్ బాబు సంబంధించిన ఓ సినిమా విడుదలకు ముందే ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాత పట్టించుకోకుండా అలాగే రిలీజ్ చేశారట. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఆ ఫలితం ఎలా వచ్చింది? అసలేం జరిగింది? ఓ లూక్కేయండి.
‘1: నేనొక్కడినే
ఆ సినిమా ఏంటో కాదు.. ‘1: నేనొక్కడినే’. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘1: నేనొక్కడినే’ మూవీ 2014 సంక్రాంతికి విడుదలయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీ ఆచంట ల్యాబ్‌లో ₹60–70 కోట్లతో నిర్మించిన ఈ మూవీ టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
ఆ టైంలోనే నాకు డౌట్ వచ్చింది
ఇటీవల నిర్మాత అనిల్ సుంకర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 1: నేనొక్కడినే సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "రిలీజ్‌కు 3 నెలల ముందే సినిమా చూశాను. ఇనిషియల్ స్టేజ్‌లో కథ వేరు, మెల్లగా మార్పులు వచ్చాయి. ఈ టైంలోనే నాకు డౌట్ ఏర్పడింది. మహేష్ కోసం నేను ఈ మూవీని చూడలేను అనిపించింది. కానీ నా అభిప్రాయాన్ని ఎవరికీ చెప్పలేదు, మాత్రమే భార్యతో పంచుకున్నాను. ఫలితంగా విడుదలకు ముందే నాకు వర్కౌట్ అవ్వకపోవచ్చని తెలుసు. మహేష్ బాబు సినిమా కోసం రెండు సంవత్సరాలుగా డే అండ్ నైట్ కష్టపడ్డాడు. సెట్‌లోకి వచ్చాక కూడా ఆయనకు నిజమైన ఫీలింగ్ చెప్పలేదు" అని అన్నారు.
మహేష్ బాబు 100% ఎఫర్ట్స్
నిర్మాత అనిల్ సుంకర ఇంకా మాట్లాడుతూ.. "మహేష్ ఏ సినిమా అయినా పూర్తిగా నమ్మి చేస్తాడు, 100% ఎఫర్ట్స్ ఇస్తాడు. ‘1’ ప్లాప్ అవ్వడం ఆయనకి తట్టుకోలేకపోయాడు. అయినా తరువాత ఆ సినిమా వల్ల వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాతి సినిమాలు పాజిటివ్‌గా వచ్చినాయి. ట్రైలర్ రిలీజ్ చేసేదాని, ప్రేక్షకులను ముందే ప్రిపేర్ చేసేదాని చేస్తే ఫలితం వేరేలా ఉంది’ అని పేర్కొన్నారు. థియేటర్‌లో ఫ్యాన్స్ అవుట్‌పుట్ చూసి చాలా మంది డిజప్పాయింట్ అయ్యారని చెప్పారు. ఈ ప్రకటనతో ‘1: నేనొక్కడినే’ఫ్లాప్ నేపథ్యంపై చర్చను సరికొత్త కోణంలో తెచ్చారు నిర్మాత అనిల్ సుంకర.