- Home
- Entertainment
- Mahesh Babu OTT movie: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ.. గత నాలుగేళ్లుగా ఓటీటీలో నెంబర్ వన్ సినిమా ఇదే
Mahesh Babu OTT movie: మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ.. గత నాలుగేళ్లుగా ఓటీటీలో నెంబర్ వన్ సినిమా ఇదే
మహేష్ బాబు అంటేనే పడి చచ్చిపోయేవారు ఎంతోమంది. యాక్షన్, కామెడీ, దేశభక్తి, కుటుంబ విలువలు ఇలా మహేష్ బాబు సినిమాల్లో అన్నీ కనిపిస్తాయి. అయితే ఒక సినిమా మాత్రం గత నాలుగేళ్లుగా ఓటీటీలో విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ అదే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా
మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా మీకు తెలిసే ఉంటుంది. ఇందులో మహేష్ బాబు సైనికుడిగా కనిపిస్తారు. తన సహోద్యోగి మరణ వార్తను అతని కుటుంబానికి తెలియజేయడానికి కర్నూలుకి వెళ్తాడు. దారిలో ఒక అమ్మాయిని కలవడం, ఆమె అతని ప్రేమలో పడడం జరుగుతుంది. కర్నూలు చేరుకున్న తర్వాత తన సహోద్యోగి కుటుంబ నేపథ్యం తెలుసుకుంటాడు. వారిని రక్షించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకుంటాడు. ఒక అవినీతి నాయకుడికి ఎదురు నిలబడతాడు. ఈ సినిమాలో కామెడీ, యాక్షన్, కుటుంబ విలువలు అన్నీ కలగలిపి ఉంటాయి. అందుకే సరిలేరు నీకెవ్వరూ సినిమా ఇప్పటికీ ఓటీటీలో ప్రేక్షకులను ఆకర్షిస్తూనే ఉంది.
యాక్షన్ థ్రిల్లర్ సినిమా
ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఐదు సంవత్సరాల క్రితం 2020లో విడుదలైంది. అనిల్ రావిపూడి దీనికి దర్శకత్వం వహించారు. మహేష్ బాబు, రష్మిక మందన్నా, విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ వంటి పెద్ద నటులు ఇందులో నటించారు. మహేష్ బాబుకు అతిపెద్ద హిట్ ఇచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో పాటలు కూడా ఎంతో హిట్టయ్యాయి. దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు.
మహేష్ బాబు క్యారెక్టరైజేషన్
మహేష్ బాబు ఇందులో ధైర్యవంతుడుగా, నిజాయితీపరుడుగా కనిపిస్తాడు. మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో శక్తివంతమైన పాత్రలో నటించాడు. అతని నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. సైనికుడిగా తన సహచరులను కాపాడుకోవడం ఎలాగో చూపించాడు. బాధ్యతగా తనకిచ్చిన పనులను నిర్వర్తించడం, అవినీతిపరుడైన నాయకుడిని మార్చడం, అలాగే తన సహచరుని కుటుంబాన్ని కాపాడడంలో ఆయన చక్కగా నటించాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది.
అదిరిపోయిన పాటలు
ఈ సినిమాలోని పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు అన్ని పాటలు హిట్ అయ్యాయి. ఇందులో ఒక స్పెషల్ సాంగ్ లో తమన్నా కనిపించింది. స్పెషల్ సాంగ్ కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది. ఈ సినిమాలో ప్రత్యేకత ఏమిటంటే అవినీతిపరుడైన నాయకుడిని జైలుకు పంపేందుకు హీరో ప్రయత్నించడు. అతని క్రమశిక్షణలో పెట్టేందుకు సైన్యంలో చేరుస్తాడు. క్లైమాక్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే ప్రజలకు ఇప్పటికీ ఈ సినిమానే హాట్ ఫేవరెట్ గా మారింది.
వసూళ్లు ఎక్కువే
సరిలేరు నీకెవ్వరూ సినిమా నిర్మించేందుకు 75 కోట్ల రూపాయలు ఖర్చయింది. వసూళ్లు మాత్రం 260కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే 46 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయి. ఇక మూడు రోజుల్లోనే లాభాల బాటలోకి వెళ్లిపోయింది. మూడు రోజుల్లో 103 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఇక పదిరోజుల్లోనే 200 కోట్ల రూపాయలు వచ్చాయి. అందుకే ఈ సినిమా విపరీతంగా లాభాలు తీసుకొచ్చింది.