Priyanka Chopra Shocking Answer: నీ భర్త నిక్ మోసం చేస్తే ఏం చేస్తావు, షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన ప్రియాంక చోప్రా
పెళ్ళి తరువాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ల లిస్ట్ లో.. ప్రియాంక చోప్రా ముందు వరుసలో ఉంటారు. పెళ్ళి తరువాత హాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ బ్యూటీకి.. పెళ్ళైన కొత్తలో ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది..? దానికి అంతే వింతగా ఆన్సర్ ఇచ్చింది ప్రయాంక.
అందం, అభినయం ప్రియాంక చోప్రా ఆమెకు ఆమే సాటి. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్‌గా మారిపోయింది బ్యూటీ. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రియాంక పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. పెళ్ళి తరువాత కూడా నటిస్తూ.. ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తుంది.
హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం 2018 లో ప్రియాంక, నిక్ జంట ఒక్కటయ్యారు. అయితే వీరి పెళ్లైన కొత్తలో జరిగిన చిన్న సంఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో ప్రియాంక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో నిక్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఆమెకు ఎదురైంది.
సాధారణంగానే ప్రియాంకకు స్వాతంత్ర్య భావాలు ఎక్కువ. ఏ విషయం అయినా సరే ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది. ఏదున్నా ముఖం మీదే చెప్పేస్తుంది. మనసులో ఏదీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టేస్తుంది. ఇక ఈ ఇంటర్వ్యూలో కూడా ఆమె అలానే మాట్లాడేసింది. అయితే ఇక్కడ ఆమెకు ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది.
నీ భర్త నిక్ జోనాస్ కనుక నిన్ను మోసం చేస్తే ఏం చేస్తావ్.. అనే ప్రశ్నను ప్రియాంకను అడిగారు. ఆ ప్రశ్నకు ప్రియాంక అదిరిపోయే రెస్పాన్స్ ఇచ్చింది. మోసం చేయడం అనేది వ్యక్తిగత విషయం. ఓ అబ్బాయి వేరే అమ్మాయితో బెడ్ షేర్ చేసుకున్న తర్వాత అతడితో జీవితాన్ని పంచుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టం అని షాకిచ్చింది.
కాని అటువంటి వ్యక్తి మాత్రం నాకు దొరికితే ఫస్ట్ అతన్ని లాక్ చేసి.. పిచ్చి పిచ్చి కొడతాను అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. తర్వాత ఏం చేస్తాననే విషయం నాకు తెలియదు.అటువంటి సమయంలో నేను హింసాత్మకంగా మారుతాను అంటూ భయపెట్టింది ప్రియాంక.
అయితే ప్రియాంక ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెప్పింది. ఆ పరిస్థితుల్లో అతడిని క్షమించే అవకాశం కూడా ఉంది. కాకపోతే అది నేను ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాను అనే విషయంపై అది ఆధారపడి ఉంటుంది అని అన్నది. ప్రతి ఒక్కరికీ రెండో అవకాశం ఇవ్వవచ్చు అని లాస్ట్ లో చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది ప్రియాంక చోప్రా.