MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • SSMB29: కొత్త ట్విస్ట్, ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదు, మరి?

SSMB29: కొత్త ట్విస్ట్, ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదు, మరి?

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB29 చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుండగా, హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది.

2 Min read
Author : Surya Prakash
Published : Jan 25 2025, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajamouli, mahesh babu, Priyanka chopra, SSMB29

Rajamouli, mahesh babu, Priyanka chopra, SSMB29


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా   రాజమౌళి చేయబోతున్న చిత్రం గురించిన వార్తలే ఇప్పుడు ఎక్కడ చూసినా. ఈ పాన్ వరల్డ్ సినిమా  గురించి కేవలం మహేష్ అభిమానులు మాత్రమే కాకుండా సినిమా లవర్స్ మొత్తం ఎదురుచూస్తున్నారు.  కొత్త ఏడాది ప్రారంభంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.  ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తైంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... షూటింగ్ షురూ చేయడానికి రాజమౌళి రెడీ అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25


ఈ విషయాన్ని ఖరారు చేస్తూ రాజమౌళి శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. అందులో సింహాన్ని బోనులో బంధించినట్టు ఉంది. అలాగే ఒక పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటోకు పోజ్ ఇచ్చారు. మీకు గుర్తు ఉందా? గతంలో అదే సింహం ఫోటో షేర్ చేసిన రాజమౌళి... ఆ సింహం మీద మహేష్ బాబును ట్యాగ్ చేశారు. ఇప్పుడు ఆ సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు. అదే సమయంలో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. అయితే అందరూ మహేష్ సరసన ప్రియాంక చోప్రా చేయటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు. 

35


మరో ప్రక్క హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్‌ కోసమే ఆమె ఇక్కడకు వచ్చి లుక్ టెస్ట్ చేసింది తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్‌ అయ్యారు. దీంతో  మహేశ్‌బాబు- ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్‌ అని అనుకుంటున్నారు   అయితే ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ ఆమె కాదని తెలుస్తోంది. ఇద్దరి మధ్యా వయస్సు గ్యాప్ చాలా ఉంటుంది. మహేష్ కు ఆమె అక్కలా ఉంటుంది. మరి ప్రియాంక చేయబోయే పాత్ర ఏమిటనే చర్చ మొదలైంది. సినిమాలో ఆమెది కీలకమైన పాత్ర అని , ఓ యువరాణి పాత్ర అని పినిపిస్తోంది. ఇక హీరోయిన్ గా ఎవరూ అంటే    కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ వంటి వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఫైనల్‌గా ఎవరిని రాజమౌళి.. హీరోయిన్ గా ఫిక్స్‌ చేసారనేది తెలియాలి. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.

45

 
మరో ప్రక్క  జమౌళి ఇనిస్ట్రా  పోస్ట్‌కు కామెంట్‌ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా వైల్డ్ గా రియాక్ట్ అయ్యారు.  'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్‌ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్‌ బాక్స్‌లో రియాక్ట్‌ కావడం విశేషం. ఇలా  రాజమౌళి  చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. రాజమౌళి పాస్‌పోర్ట్‌ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్‌ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్‌ ప్రారంభమైనట్లేనని మహేశ్‌  అభిమానులు అనుకుంటున్నారు.

 

55


 భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్‌ ఇప్పటికే  ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్‌ నటీనటులతో పాటు టెక్నీషియన్స్‌ కూడా ఇందులో భాగం కానున్నారు. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan: పెద్ది హిట్ లేదా ఫ్లాప్ ఏమైనా కావచ్చని ముందే తెలుసు, కానీ.. ఇంత పెద్ద సక్సెస్ కి కారణం అదొక్కటే
Recommended image2
Krrish 4 Update: రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్న హృతిక్ రోషన్, ఇదెక్కడి అరాచకం బాబోయ్
Recommended image3
Chiranjeevi: క్యారెక్టర్ ఆర్టిస్ట్ కోసం 300 మందిని వెనక్కి రప్పించిన చిరంజీవి.. దటీజ్ మెగాస్టార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved