- Home
- Entertainment
- దేవకన్యలా ఉంది, కానీ కాస్త మేకప్ ఎక్కువైంది.. ప్రియమణి లుక్ పై నెటిజన్ల కామెంట్స్, వైరల్ ఫొటోస్
దేవకన్యలా ఉంది, కానీ కాస్త మేకప్ ఎక్కువైంది.. ప్రియమణి లుక్ పై నెటిజన్ల కామెంట్స్, వైరల్ ఫొటోస్
నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.
కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ప్రియమణి ప్రస్తుతం టీవీ కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రియమణి డ్యాన్స్ షోలకు జడ్డిగా కూడా చేసింది. బుల్లితెర కార్యక్రమాల్లో ప్రియమణి చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాగే ప్రస్తుతం ప్రియమణికి వెబ్ సిరీస్ లు, సినిమాల్లోకూడా ఆఫర్స్ వస్తున్నాయి.
ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది.
ప్రియమణి తక్కువ సమయంలో ఎక్కువ చిత్రాల్లో నటించింది. యమదొంగ, హరే రామ్ వంటి విజయవంతమైన చిత్రాలు ప్రియమణి ఖాతాలో ఉన్నాయి. కొన్ని లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ప్రియమణి నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రియమణి.. 38 ఏళ్ల వయసులో కూడా స్టన్నింగ్ ఫోజులతో మతిపోగొడుతోంది.
ప్రియమణి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రియమణి ప్రస్తుతం నాగ చైతన్య కస్టడీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక నిన్న గ్రాండ్ గా జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రియమణి వైట్ శారీలో దేవకన్యలా మెరుపులు మెరిపించింది.
చిరునవ్వులు చిందిస్తూ ఈ సీనియర్ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రకారుని ఒక ఆట ఆడుకుంది. ప్రియమణి సోయగాలు, తెల్ల చీర అందాలకు నెటిజన్లు మురిసిపోతున్నారు.
అయితే ప్రియమణి కాస్త ఓవర్ మేకప్ తో వచ్చింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మేకప్ ఎక్కువైనప్పటికీ ప్రియమణి అందానికి వంకర పెట్టలేం అని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.