ప్రియమణి బర్త్ డే సెలెబ్రేషన్స్, బ్యూటిఫుల్ పిక్స్ వైరల్.. భర్త దగ్గర లేకపోవడంతో..
నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి.

నటన, అభినయం, డ్యాన్స్, అందం ఇలా హీరోయిన్ కి కావలసిన అన్ని కళలు ఉన్న నటి ప్రియమణి. వివాదాల జోలికి పోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళింది ప్రియమణి. టాలీవుడ్ లో ప్రియమణి ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. అందాలు ఆరబోసేందుకు కూడా వెనుకాడలేదు.
కెరీర్, పర్సనల్ లైఫ్ విషయంలో ప్రియమణి ప్లానింగ్ తో వ్యవహరించింది. చకచకా సినిమాలు చేసేసింది. విజయవంతమైన చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న సమయంలో వివాహం చేసేసుకుంది.
సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టివి రంగంలోకి అడుగు పెట్టింది. ఇలా ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ప్రియమణి ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ప్రియమణి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది.
ప్రియమణి బుల్లితెరపై కూడా మెరిసింది. పలు డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది. ఇదిలా ఉండగా ప్రియమణి ఆదివారం రోజు తన జన్మదిన వేడుకలు సెలెబ్రేట్ చేసుకుంది. ప్రియమణి 39వ వసంతంలోకి అడుగుపెట్టింది.
ఈ సందర్భంగా ప్రియమణి తన పుట్టినరోజు వేడుకల్ని ఫ్యామిలీతో కలసి సెలెబ్రేట్ చేసుకుంది. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. కుటుంబ సభ్యులంతా ఆమెకి బర్త్ డే విషెస్ తెలిపారు. అయితే ప్రియమణి పుట్టినరోజు వేడుకల్లో ఆమె భర్త కనిపించలేదు.
తన భర్త దగ్గరలేకపోవడంతో ప్రియమణి మిస్ యు ముస్తఫా రాజ్ అని కామెంట్ పెట్టింది. ఆమె భర్త రాజ్ వ్యాపార నిమిత్తం విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన చిత్రాలతో ప్రియమణి బిజీగా ఉండడంతో ఆమె ఇక్కడే ఉండిపోయింది. బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా ప్రియమణి షేర్ చేసిన పిక్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి.
ప్రియమణి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. ఎన్టీఆర్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన ప్రియమణి మాస్ స్టెప్పులతో అలరించింది. ఇక అవసరమైనప్పుడు వెండితెరని వేడెక్కించేలా అందాలు ఆరబోసింది. నితిన్ సరసన ద్రోణ చిత్రంలో నటించిన ప్రియమణి.. ఆ చిత్రంలో బికినీలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ చిత్రంలో ప్రియమణి అందాల ఆరబోత ఒక హాట్ టాపిక్ గా నిలిచింది.