- Home
- Entertainment
- ఎన్టీఆర్, బాలయ్యతో నటించినా ఆ పని చేయలేదు.. కుర్ర హీరో కోసం వాళ్ళ అమ్మని అడిగి బికినీ వేసుకున్న నటి
ఎన్టీఆర్, బాలయ్యతో నటించినా ఆ పని చేయలేదు.. కుర్ర హీరో కోసం వాళ్ళ అమ్మని అడిగి బికినీ వేసుకున్న నటి
కొందరు హీరోయిన్లు అవసరమైతే బికినీ షో, రొమాంటిక్ సన్నివేశాలకు కూడా రెడీ అవుతుంటారు. గతంలో ఒక క్రేజీ హీరోయిన్ బికినీ వేసుకోవడం పెద్ద వివాదం అయింది. ఆ సంగతేంటో చూద్దాం.

Priyamani
ప్రస్తుతం హీరోయిన్లు గ్లామర్ ప్రదర్శించేందుకు వెనుకాడడం లేదు. సాయి పల్లవి, నిత్యామీనన్ లాంటి కొందరు హీరోయిన్లు మాత్రమే గ్లామర్ షోకి దూరంగా ఉంటున్నారు. మాస్ ఆడియన్స్ ని ఆకర్షించేందుకు దర్శక నిర్మాతలు పాటించే ఒక టెక్నిక్ గ్లామర్ అని చెప్పొచ్చు.
కొందరు హీరోయిన్లు అవసరమైతే బికినీ షో, రొమాంటిక్ సన్నివేశాలకు కూడా రెడీ అవుతుంటారు. గతంలో ఒక క్రేజీ హీరోయిన్ బికినీ వేసుకోవడం పెద్ద వివాదం అయింది. ఆ సంగతేంటో చూద్దాం. క్రేజీ హీరోయిన్ ప్రియమణి 2003లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకి గుర్తింపు వచ్చింది మాత్రం 2006లో జగపతి బాబు తో నటించిన పెళ్ళైన కొత్తలో చిత్రంతోనే. ఈ రొమాంటిక్ మూవీతో ప్రియమణి టాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది.
ఆ తర్వాత ప్రియమణికి రాజమౌళి, ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో ప్రియమణి స్టార్ బ్యూటీగా మారిపోయింది. తరుణ్ తో నటించిన నవ వసంతం, కళ్యాణ్ రామ్ తో నటించిన హరే రామ్, రవితేజతో శంభో శివ శంభో లాంటి హిట్స్ ని ప్రియమణి తన ఖాతాలో వేసుకుంది. నాగార్జున, బాలయ్య లాంటి సీనియర్ స్టార్ హీరోలతో కూడానా ప్రియమణి నటించింది.
స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ ఎప్పుడూ ప్రియమణి బికినీ ధరించలేదు. గ్లామర్ ప్రదర్శించింది కానీ బికినీ జోలికి వెళ్ళలేదు. కానీ ఒక కుర్ర హీరో సినిమాలో బికినీ వేసుకోడానికి ప్రియమణి అంగీకరించడంతో అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నితిన్ నటించిన ద్రోణ చిత్రంలో ప్రియమణి బికినీ ధరించి బోల్డ్ గా గ్లామర్ ప్రదర్శించింది. రిలీజ్ కి ముందు ఆమె బికినీ స్టిల్స్ లీక్ కావడంతో పెద్ద దుమారం రేగింది. నిర్మాతలకు, ప్రియమణికి మధ్య గొడవ జరిగింది అని ఆమె ఎక్స్ట్రా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వివాదంపై నిర్మాత డీఎస్ రావు క్లారిటీ ఇచ్చారు. బికినీ విషయంలో ప్రియమణి గొడవ చేసింది, రెమ్యునరేషన్ ఎక్కువ అడిగింది అనేది అవాస్తవం అని అన్నారు. ఆమె చాలా మంచి నటి, బికినీ సన్నివేశాలని ప్రొఫెషనల్ గా తీసుకుంది. కాకపోతే ఈ చిత్రంలో బికినీ వేసుకోవాలని మేము ఆమెకి ఆలస్యంగా చెప్పాం. దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయ్యాక డైరెక్టర్ ఆమెకి బికినీ సాంగ్ ప్లాన్ చేస్తున్నామని చెప్పాడు. కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందని, సోలో సాంగ్ అని చెప్పాడు.
Nithiin
దీనితో ప్రియమణి 10 నిమిషాల టైం అడిగి క్యారవ్యాన్ లోకి వెళ్ళింది. వాళ్ళ అమ్మతో చర్చించి బయటకి వచ్చి ఒకే చెప్పింది అని నిర్మాత డీఎస్ రావు తెలిపారు. రిలీజ్ కి ముందు ఆ ఫోటోలని హైప్ కోసం మేమే రిలీజ్ చేశాం. ప్రియమణి బికినీ వల్ల ఆ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయని నిర్మాత డీఎస్ రావు అంగీకరించారు. ఆ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ తో సేఫ్ అయ్యానని అన్నారు.