- Home
- Entertainment
- శ్రీజ రెండోసారి ఎలిమినేట్, బిగ్ బాస్ షోపై ప్రియా శెట్టి ఘాటు వ్యాఖ్యలు.. ఇదెక్కడి న్యాయం
శ్రీజ రెండోసారి ఎలిమినేట్, బిగ్ బాస్ షోపై ప్రియా శెట్టి ఘాటు వ్యాఖ్యలు.. ఇదెక్కడి న్యాయం
బిగ్ బాస్ తెలుగు 9 షోపై ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ప్రియా శెట్టి ఫైర్ అయ్యారు. సెకండ్ ఛాన్స్ విషయంలో వాళ్లకి ఒక న్యాయం, తమకు ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇది దుమారం రేపుతుంది.

బిగ్ బాస్ తెలుగు 9 షోపై విమర్శలు
బిగ్ బాస్ తెలుగు 9 షోని నిర్వహకులు ట్విస్ట్ లు, టర్న్ లతో నడిపిస్తున్నారు. వారం వారం లెక్కలు మారిపోతున్నాయి. ఎవరు ఉంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది క్రేజీగా మారింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లకి ఛాన్స్ ఇవ్వడం, వారిచేత నామినేట్ చేయించడం క్రేజీగా మారింది. ఏం చేసినా బిగ్ బాస్ షోకి టీఆర్పీ రావడం లేదు. మరింత డల్‌గా మారిపోతుంది. రేటింగ్ రావడం లేదు సరికదా, విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలా మంది సామాజికవేత్తలు ఇలాంటి షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీనికితోడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లే ఈ షోపై విమర్శలు చేయడం ఆశ్చర్యపరుస్తుంది.
షో నిర్వాహకులపై ప్రియా శెట్టి ఫైర్
తాజాగా ప్రియా శెట్టి బిగ్ బాస్ షో నిర్వాహకులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొందరికి ఒక న్యాయం, తమకు మరో న్యాయమా అని ప్రశ్నించింది. సెకండ్ ఛాన్స్ విషయంలో ఒక్కరికే అవకాశం కల్పించడం పట్ల ఆమె ఫైర్ అయ్యింది. తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. ఆమె చెబుతూ, `నిజం చెప్పాలంటే ఆడియెన్స్ ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన ఒక కంటెస్టెంట్‌కి మాత్రమే రెండో అవకాశం లభించడం చాలా డిజప్పాయింటింగ్‌గా ఉంది. ఓటింగ్ వల్ల ఎలిమినేట్ అయిన మాలో మిగిలిన వారి సంగతేంటి? మేం కూడా ఆ అవకాశం పొందడానికి అర్హులం కాదా? అందరినీ సమానంగా చూడాలి. అదే నిజమైన న్యాయం అంటే. న్యాయం అనేది ఎంపిక చేసుకునేదిగా ఉండకూడదు, అది అందరికీ వర్తిస్తుంది` అని పేర్కొంది ప్రియా శెట్టి. ఇందులో తన ఆవేదన వ్యక్తం చేసింది.
దుమారం రేపుతున్న ప్రియాశెట్టి పోస్ట్
ప్రస్తుతం ప్రియా శెట్టి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె అభిమానులు సపోర్ట్ గా పోస్ట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో పెయిర్‌గా సాగడం లేదంటున్నారు. అంతా గందరగోళంగా ఉందంటున్నారు. మరికొందరు మీకు ఛాన్స్ రావడమే ఎక్కువ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో ఇదిప్పుడు పెద్ద రచ్చ అవుతుంది. మరి దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
శ్రీజ ఎలిమినేట్, భరణి సేఫ్
అయితే ఎనిమిదో వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లని హౌజ్‌లోకి పిలిపించి నామినేషన్ ప్రక్రియలో పాల్గొనేలా చేశారు. వారిలో ఇద్దరికి రెండో ఛాన్స్ ఇచ్చారు. భరణి, శ్రీజను మళ్లీ హౌజ్‌లోకి పంపి, వీరిలో ఒకరు హౌజ్‌లో ఉండే అవకాశం కల్పించారు. దానికి ఓటింగ్ పెట్టారు. ఆడియెన్స్ ఓటింగ్‌తోపాటు, వారికి హౌజ్‌లో టాస్క్ లు కూడా ఇచ్చారు బిగ్ బాస్. ఈ మొత్తం ప్రాసెస్‌లో భరణి సేవ్ అయ్యాడని, శ్రీజ ఎలిమినేట్ అయినట్టు సమాచారం. దీంతో ఇప్పుడు ప్రియా ఇలాంటి పోస్ట్ పెట్టడం షాకిస్తుంది. శ్రీజ, ప్రియా శెట్టి మంచి ఫ్రెండ్స్. హౌజ్‌లో ఇద్దరూ కలిసే గేమ్స్ ఆడారు. కలిసే ఉన్నారు. రెండోసారి శ్రీజ ఎలిమినేట్ అయ్యిందనే వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రియాశెట్టి పెట్టిన పోస్ట్ దుమారం రేపుతుంది.
ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు?
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో సంజనా, దివ్వెల మాధురి, డీమాన్ పవన్, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ, గౌరవ్ గుప్తా, నిఖిల్ నాయర్, శ్రీనివాసా సాయి, రీతూ చౌదరీ, దివ్య, సుమన్ శెట్టి, రాము రాథోడ్ హౌజ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ వారం గౌరవ్, దివ్వెల మాధురి, తనూజ, కళ్యాణ్, రాము రాథోడ్, పవన్, రీతూ చౌదరీ, సంజనా నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో గౌరవ్, మాధురి ఓటింగ్‌లో లీస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

