స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో వింకీ బ్యూటీ డార్క్ చాక్లెట్‌లా ఎంత హాట్‌గా ఉందో.. ఎదపై టాటూ కనిపించేలా పరువాల షో
వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.. ఆటుపోట్లతో కెరీర్ సాగుతుంది. ఈ అమ్మడికి అవకాశాలున్నా.. సక్సెస్ మాత్రం దోబూచులాడుతుంది. దీంతో కన్ను గీటుతో వచ్చిన క్రేజ్ అంతా నెమ్మదిగా డౌన్ అయిపోతుంది.
ఒక్క కన్నుగీటుతో ఇండియాని షేక్ చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇలాంటి సంఘటన, ఇలాంటి క్రేజ్ ఇప్పటి వరకు మరే హీరోయిన్‌కి రాలేదు. ఆ విషయంలో తొలి కథానాయికగా ప్రియా ప్రకాష్ వారియర్ నిలుస్తుంది. అదొక సంచలనంగా చెప్పొచ్చు. ఓవర్‌నైట్‌లో స్టార్ అయిపోయింది.
ఈ బ్యూటీ క్రేజ్‌కి స్టార్ హీరోలే దిగిరావాల్సి వచ్చింది.ఈ బ్యూటీ కన్నుగీటుకి ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫిదా అయిన విషయం తెలిసిందే. ఆమె సినిమాఫంక్షన్‌కి ఏకంగా ఆయనే గెస్ట్ గా వచ్చాడు. ఎవరుపిలవకుండానే తనే వస్తానని రావడం విశేషం. ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బన్నీ రాక అనేది ఆమెని మరింత పాపులర్ చేసేసింది.
ఆ పాపులారిటీతోనే వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. హీరోయిన్‌గా తెలుగు, హిందీ, మలయాళంలో సినిమాలొచ్చాయి. ఇప్పటికే తెలుగులో మూడు సినిమాల్లో మెరిసింది. కానీ హిట్ పడలేదు. హిందీలోనూ రెండు మూడు సినిమాలు చేస్తుంది. ఇంకా అవి రిలీజ్ కావాల్సింది. మలయాళంలో ఒకటిరెండు సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా చెప్పుకోదగ్గ హిట్ పడలేదు.
ఫస్ట్ బ్రేక్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తుంది ప్రియా ప్రకాష్ వారియర్. అదే సమయంలో కొత్త అవకాశాలు కోసం చూస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ కి ఎరవేసేందుకు అందాల విందుచేస్తుంది. గ్లామర్ ఫోటోలతో వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. తాను గ్లామర్ షోకి సిద్ధమనే హింట్ ఇస్తుంది. అందులో భాగంగా తాజాగా ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్, హాఫ్ శారీలో మెరిసింది.
ఇందులో చూడ్డానికి డార్క్ ఛాక్లెట్‌లా ఉంది ప్రియా ప్రకాష్ వారియర్. అందేకాదు ఎదపై టాటూ కనిపించేలా బ్లౌజ్ వేసుకుని పరువాల విందు వడ్డిస్తుంది. చిలిపి నవ్వులతో ఆద్యంత కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లని ఎట్రాక్ట్ చేస్తున్నాయి.
ప్రియా ప్రకాష్ కెరీర్ చూస్తే.. ఆమె `ఓరు అడార్ లవ్` అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకి పరిచయం అయ్యింది. ఈ చిత్రంలోనే కన్నుకొట్టి పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `చెక్`, `ఇష్క్` చిత్రాలు చేసింది. ఇవి ఆకట్టుకోలేకపోయాయి. ఇక మలయాళంలోనే నాలుగు సినిమాలు చేసింది. అవి అంతంత మాత్రమే ఆడాయి.
ఇటీవల పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన `బ్రో` చిత్రంలో మెరిసింది. ఈ చిత్రం కూడా ఆడలేదు. హిందీలో `యారియాన్ 2`లో నటించింది. ప్రస్తుతం మూడు హిందీ సినిమాలు, ఓ కన్నడ సినిమా ఆమె చేతిలో ఉంది. నటిగా బిజీగానే ఉందీ కుర్ర బ్యూటీ.