- Home
- Entertainment
- ఆర్ఆర్ఆర్, సలార్ తో పోల్చితే అల వైకుంఠపురములో ఏమాత్రం తక్కువ కాదు..బాంబు పేల్చిన సౌత్ స్టార్ హీరో
ఆర్ఆర్ఆర్, సలార్ తో పోల్చితే అల వైకుంఠపురములో ఏమాత్రం తక్కువ కాదు..బాంబు పేల్చిన సౌత్ స్టార్ హీరో
రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు.

రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. ఇండియా బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి.
అదే విధంగా ప్రభాస్ నటించిన సలార్ ఫస్ట్ పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద రాణించింది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పార్ట్ 2 కూడా రానుంది. మళయాళంతో పాటు సౌత్ మొత్తం తనకంటూ దర్శకుడిగా, నటుడిగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.
మలయాళీ చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఆర్ఆర్ఆర్, సలార్, అల వైకుంఠపురంలో చిత్రాల గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. యాంకర్ అడుగుతూ.. తెలుగులో కమర్షియల్ చిత్రాలకు, లార్జర్ దాన్ లైఫ్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంది.
కానీ మలయాళంలో కేవలం కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు మాత్రమే వస్తాయి. మలయాళంలో కమర్షియల్ చిత్రాలకు డిమాండ్ లేదా అని ప్రశ్నించారు. దీనికి పృథ్వీరాజ్ బదులిస్తూ.. ఏ రాష్ట్రంలో అయినా ఏ భాషల్లో అయినా మంచి సినిమాలకు మాత్రమే డిమాండ్ ఉంటుంది. కమర్షియల్, కాన్సెప్ట్ అనే తేడా ఉండదు.
కమర్షియల్ చిత్రం అయినా, మాస్ మసాలా చిత్రం అయినా రైటింగ్, తెరకెక్కించిన విధానం ఆకట్టుకోవాలి. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్, సలార్ లాంటి భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అవి బాగా వర్కౌట్ అయ్యాయి. అదే విధంగా అల వైకుంఠపురంలో చిత్రం కూడా వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రాలకు అల వైకుంఠపురంలో మూవీ ఏమాత్రం తక్కువ కాదు.
ఆ మూవీలో రైటింగ్ బ్రిలియంగ్ గా ఉంటుంది. ఆర్ఆర్ఆర్ మాత్రమే కాదు.. రైటింగ్ బావున్నా ఏ చిత్రం అయినా వర్కౌట్ అవుతుంది అని పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.