ఆ నిర్మాత వాడుకుని వదిలేస్తున్నాడు.. ప్రేమమ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ఫిల్మ్ ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ భూతం వదిలిపెట్టడం లేదు. చాలామంది తారులు ఈ కాస్టింగ్ కౌచ్ బాధితులుగా ఉన్నారు. ఇప్పటికే ఎంతో మంది బయట పడి.. వారి బాధలు ప్రపంచంతో పంచుకున్నారు. తాజాగా ప్రేమమ్ హీరోయిన్ కూడా.. ఓ నిర్మాతపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయగా.. ఆమెకు భారీగా మద్దతు లభిస్తోంది.

క్యాస్టింగ్ కౌచ్ పై ముగ్గురు హీరోయిన్స్ స్పందించారు. ప్రేమమ్ సినిమాలో నటించిన ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ ఓ నిర్మాతపై తీవ్రమైన ఆరోపణలు చేయగా ఆమెకు మరో ఇద్దరు హీరోయిన్లు మద్దతుగా నిలవడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్ పై హీరోయిన్ ప్రకృతి చేసిన ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి.
సినిమాల్లో అవకాశాలు ఇస్తానని సంజయ్ నాయక్ అనే నిర్మాత ఎంతో మంది యువతుల జీవితాలతో ఆడుకున్నాడన్నారు.అమ్మాయిలను లోబర్చుకుని అవసరం తీరిన తర్వాత ముఖం చాటేస్తున్నాడని ఆరోపించారు. అయితే ప్రకృతి మిశ్రా చేసిన ఆరోపణలకు మద్దతులభిస్తోంది. ఆమె వ్యాఖ్యలకు హీరోయిన్ పుపుల్ భుయాన్, సీరియల్ నటి జాస్మిన్ రథ్ మద్దతు తెలిపారు.
గతంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు... బాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ వివాదాలుగట్టిగా వినిపించాయి. అంతే కాదు చిత్రం ఏంటీ అంటే.. అబ్బాయిలు కూడా ఈ కాస్టింగ్ కౌచ్ ను ఫేస్ చేశారు. ఈక్రమంలో ఒడియా సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, నిర్మాత సంజయ్ నాయక్ పై వస్తున్న ఆరోపణలు నిజమే అని నటి పుపుల్ భుయాన్ అన్నారు.
ఓటీవీ అనే ఒడియా ఛానల్ తో ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో 99 శాతం మంది మంచి వాళ్ళే ఉన్నారని, ఒక్క శాతం సినీ ప్రముఖులు మాత్రం కొత్తగా వచ్చే హీరోయిన్స్ ని వాడుకుంటారని అన్నారు.. నిమాల్లో అవకాశాలు రావాలంటే కాంప్రమైజ్ అవ్వాలని బలవంతం చేస్తారని ఆమె అన్నారు. ఓలీవుడ్ ఇండస్ట్రీలో అనేక మంది ప్రతిభ గల అమ్మాయిలు ఉన్నారని.. కానీ రెండు, మూడు సినిమాలు చేశాక కనబడకుండా పోతున్నారని అన్నారు.
దీని బట్టి ఇండస్ట్రీలో ప్రతిభ కంటే కాంప్రమైజ్ అయితేనే నిలబడగలుగుతారని అర్ధమౌతుందన్నారు ఆమె. ఎవరైతే కాంప్రమైజ్ అవ్వడానికి ఇష్టపడరో వాళ్ళు సడన్ గా ఇండస్ట్రీలో కనుమరుగవుతారని ప్రకృతి మిశ్రా మీడియాతో వెల్లడించారు. తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని.. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో కాంప్రమైజ్ అవ్వమని బలవంతం చేశారని.. కానీ నిరాకరించినట్లు ఆమె వెల్లడించారు.