MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • మొత్తానికి ‘ప్రేమలు’మమితా బైజు తెలుగు సినిమా కమిటైంది

మొత్తానికి ‘ప్రేమలు’మమితా బైజు తెలుగు సినిమా కమిటైంది

మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది. 

3 Min read
Author : Surya Prakash
Published : Jul 25 2024, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Mamitha baiju

Mamitha baiju


స్టైయిగా తెలుగులో నటించకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుని ప్రేక్షకుల మనసు దోచేసింది ‘ప్రేమలు’ (Premalu) హీరోయిన్ మమితా బైజు (Mamitha Baiju). మలయాళంలో హిట్‌ అందుకున్న ఈ సినిమా ఇక్కడా మంచి  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ బ్యూటీ తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఈ క్రమంలో ఆమెకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఇక్కడ ఏర్పడింది.  దాంతో చాలా మంది తెలుగులో నటింపచేయాలని చూసారు. ఫైనల్ గా ఆమె ఓ సినిమాకు సైన్ చేసిందని సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27


మళయాళ   సెన్సేషన్ 'ప్రేమలు' సినిమా చిన్న బడ్జెట్ లో రెడీ అయ్యి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. నస్లెన్, మమిత బైజు జంటగా నటించిన ఈ చిత్రం డబ్బింగ్ వెర్షన్ మార్చి 8న తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. రాజమౌళి కుమారుడు ఈ సినిమాని తెలుగులోకి తెచ్చారు. ఇక్కడా ఈ సినిమా బాగా ఆడింది. మంచి లాభాలే తెచ్చిపెట్టింది. అలాగే ఈ  సినిమాను ప్రమోట్ చేస్తూ హైదరాబాద్‌లో పలు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది టీమ్. ఆ క్రమంలో  హీరోయిన్ మమిత తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తి చూపించింది. 
 

37
mamitha baiju

mamitha baiju


మమితా మాట్లాడుతూ.."టాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే నాకు ముందు తెలుగు బాగా నేర్చుకోవాలని ఉంది. అప్పుడే స్క్రిప్ట్‌ను బాగా అర్థం చేసుకొని మంచి పెర్ఫామెన్స్‌ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. తెలుగులో మంచి రోల్స్ చేయాలని నాకు ఉంది." అంటూ మమిత చెప్పుకొచ్చింది. ప్రేమలు సినిమా రిలీజైన దగ్గరి నుంచి ఈ చిత్రం గురించి అలానే మమిత గురించి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. ముఖ్యంగా మమితకి అయితే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఆమె టాలీవుడ్ ఎంట్రీకి కూడా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.  

47


మమిత బైజుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒక్క సినిమాతో సౌత్ కుర్రవాళ్ల క్రష్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన మమిత ఫోటోస్, వీడియోస్ నెట్టింట వైరలయ్యాయి. చేసింది ఒక్క సినిమానే అయినా అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయింది.  అప్పటి నుంచి  ప్రేమలు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న మమితా బైజు ఇదివరకు సినిమాలను చూస్తున్నారు. ఆమె నటించిన ప్రణయ విలాసం సినిమా లేటెస్ట్ గా ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్సే వచ్చింది.  ఈక్రమంలో ఆమె తెలుగులో డైరక్ట్ సినిమా ఎంట్రీపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే ఆచి,తూచి ఆమె అడుగులు వేస్తోంది. 
 

57


మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆమె మైత్రీ మూవీస్ వారు నిర్మించే చిత్రంలో నటించటానికి ఎగ్రిమెంట్ చేసారు. తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా రూపొందే తెలుగు చిత్రంలో అతని సరసన ఆమెను ఎంపిక చేసారు. ప్రదీప్ రంగనాథన్ తను హీరోగా నటించడం మాత్రమే కాకుండా, లవ్ టుడే చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తెలుగులో డబ్ చేయగా, మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది.

67
mamitha baiju

mamitha baiju


వీరిద్దరూ కలిసి ఒక చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది . త్వరలో ఇందుకు సంబంధించిన అనౌన్స్ మెంట్ రానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే కాంబినేషన్ వర్కౌట్ అయితే, ఫ్యాన్స్ కి మంచి ఎంటర్ టైన్మెంట్ పక్కా అని చెప్పాలి.

77

త్వరలో   ఆమె నటించిన  'వనంగాన్' ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ క్రమంలో 'వనంగాన్' షూటింగ్ అనుభవం గురించి నటి మమిత బైజు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పలు ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ సందర్భంగా మమితా ప్రముఖ తమిళ దర్శకుడు బాలా (Director Bala)  తనను కొట్టారని చెప్పింది. దీంతో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముందుగా ‘వనంగాన్’లో హీరోగా సూర్య ఎంపికయ్యారు. కానీ ఆ తర్వాత ఆ చిత్రం నుంచి ఆయన తప్పుకున్నారు. సూర్య స్థానంలో ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ (Arun Vijay)  ఎంట్రీ ఇచ్చారు.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kotha Cinema: హైదరాబాద్‌తో పనిలేదు, లోకల్ ఆర్టిస్ట్ లతో `కొత్త సినిమా`.. సరికొత్త ప్రయోగం
Recommended image2
Savitri: సావిత్రికి మందు అలవాటు చేసింది జెమినీ గణేషన్‌, కమెడియన్‌ కాదు.. తెరవెనుక ఉన్న కిలాడీ లేడీ ఎవరంటే?
Recommended image3
ఓటీటీలో ట్రెండింగ్ సైకో థ్రిల్లర్.. దేశాన్ని వణికించిన సీరియల్ కిల్లర్ కథ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved