Intinti Gruhalakshmi: తల్లి ప్రేమని పరీక్షించిన ప్రేమ్.. తల్లడిల్లిపోతున్న తులసి!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతుంది ఈ సీరియల్. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Intinti Gruhalakshmi
ప్రేమ్ (Prem) తన పుట్టిన రోజు సందర్భంగా గత ఏడాది తన ఇంట్లో జరిగిన తన పుట్టిన రోజు వేడుకలను గుర్తు చేసుకుంటాడు. అందులో తన తల్లి తనకు గిటార్ ను గిఫ్ట్ గా ఇవ్వటంతో.. తన తల్లి కోసం ఒక పాట కూడా పాడాడు.
Intinti Gruhalakshmi
ఇక అందులోని నుంచి తేరుకొని శృతి (Shruthi) తో చెబుతూ బాధపడుతూ ఉంటాడు. అత్తయ్య ఏం చేసినా అందులో ఒక న్యాయం ఉంటుంది అన్నట్లుగా మాట్లాడుతుంది. మరోవైపు తులసి (Tulasi) గుడికి వెళ్లి ప్రేమ్ పేరుమీద అర్చన చేయిస్తుంది.
Intinti Gruhalakshmi
ప్రేమ్ (Prem) జీవితం మంచి ఉండాలని ఇటువంటి నిర్ణయం తీసుకున్నానని అనుకుంటుంది. మరోవైపు ప్రేమ్ తన తల్లి ఎలాగైనా తన కోసం గుడికి వస్తుందని తాను కూడా శృతితో (Shruthi) వస్తాడు. ఒకవేళ అత్తయ్య రాకపోతే బాధ పడొద్దు అని కావాలంటే వెనుక వెళ్ళిపోదాం అని అంటుంది.
Intinti Gruhalakshmi
కానీ ప్రేమ్ (Prem) మనసు ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా గుడి లోపలికి వెళ్తాడు. అక్కడ తులసి ప్రేమ్, శృతి (Shruthi) లను చూసి పక్కన వెళ్లి దాచుకుంటుంది. ప్రేమ్ గుడిలోకి వెళ్లి తన పేరు మీద ఎవరైనా అర్చన చేయించారా అని పూజారి తో అనటంతో తులసి పూజారికి చెప్పొద్దు అన్నట్లుగా తల ఊపుతుంది.
Intinti Gruhalakshmi
పూజారి లేదు అనే సరికి ప్రేమ్ (Prem) తన తల్లి వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అని ఎదురు చూస్తాడు. తన తల్లికి తన మీద ప్రేమ ఎంత ఉందో చూపిస్తాడు. ఆ మాటలు విన్న తులసి (Tulasi) తల్లడిల్లిపోతుంది. మమ్మీ రాకపోతే ఇకపై బర్త్డే జరుపుకోను అని అంటాడు.
Intinti Gruhalakshmi
ఆ మాటలు తులసి (Tulasi) తట్టుకోలేక పోతుంది. ఇక శృతి (Shruthi) లోపలికి వెళ్లి అత్తయ్య మనసు మారాలి అని దేవుడిని వేడుకుందాం రండి అంటూ తీసుకెళ్తుంది. ఇక తులసి అక్కడ నుంచి వెంటనే ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది.
Intinti Gruhalakshmi
తులసి (Tulasi) ఆటోలో వెళుతూ ఉండగా ప్రేమ్ చూసి సంతోషపడతాడు. ఓవైపు దివ్య అంకితతో ప్రేమ్ గురించి చెబుతూ బాధపడుతుంది. ఇవాళ అన్నయ్య పుట్టినరోజు అని ఎలాగైనా అన్నయను పిలిపించమని బ్రతిమాలడం తో దానికి అంకిత (Ankitha) సరే అంటుంది. మరోవైపు ప్రేమ్, శృతి లపై తమ ఇంటి ఓనర్ ఫైర్ అవుతూ ఉంటాడు.