MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Intinti Gruhalakshmi: తులసి కోరికను తీర్చాలి అనుకున్న సామ్రాట్.. ప్రేమ్ కి అసలు విషయం చెప్పేసిన శృతి?

Intinti Gruhalakshmi: తులసి కోరికను తీర్చాలి అనుకున్న సామ్రాట్.. ప్రేమ్ కి అసలు విషయం చెప్పేసిన శృతి?

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు డిసెంబర్ 12వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం.. 

2 Min read
Author : Navya G
| Updated : Dec 12 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ లో తులసి, సామ్రాట్ ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరూ గుడిలో నడుచుకుంటూ వెళుతుండగా ఈ గుడి గురించి మీకు ఎవరు చెప్పారు అనడంతో మన ఆఫీస్ వాళ్ళు చెప్పారు అని అంటాడు. మన మూర్తి గారి అమ్మాయికి ఈ గుడిలో ముడుపు కట్టింటే పెళ్లయింది అని అనగా మిమ్మల్ని కూడా ముడుపు కట్టమని చెప్పారా అని తులసి నవ్వుతూ అనగా సామ్రాట్ కూడా నవ్వుతూ ఉంటాడు. ఇప్పుడు సామ్రాట్ ఈ గుడిలో అమ్మవారిని మొక్కుకొని పేపర్ పై మన కోరికను రాసి ముడుపు కడితే తప్పకుండా నెరవేడుతుందట అని అనడంతో తులసి కూడా ఆలోచిస్తూ ఉంటుంది.
 

26

ఆ తర్వాత గుడిలో పూజ జరిగిన తర్వాత పంతులుగారు ముడుపు కట్టాలి అనడంతో అక్కడ పేపర్ ఉంది తీసుకొని రాసి అక్కడ చెట్టుకు కట్టండి అని చెబుతాడు పంతులుగారు. ఆ తర్వాత తులసి సామ్రాట్ ఇద్దరూ కలసి ముడుపులు కట్టడానికి వెళ్తారు. అప్పుడు సామ్రాట్ ముడుపు కడుతూ ఉండగా తులసి కూడా తన మనసులో ఆలోచన రావడంతో అక్కడికి వెళ్లి ఒక పేపర్లో తన కోరికను రాసి ముడుపు కట్టడానికి వెళుతుంది. ఇంతలో సామ్రాట్ అక్కడికి వచ్చి ముడుపులో ఏం రాశారు అని అడగగా అలా ముడుపులో ఏం రాసారో చెప్పకూడదు మా అమ్మమ్మ చెప్పింది అని తులసి ముడుపు కట్టడానికి వెళుతుంది.
 

36

 తులసి సామ్రాట్ ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళగా అప్పుడు సామ్రాట్ తులసి ఆ ముడుపులో ఏమి రాసిందో తెలుసుకోవాలి అనుకొని తులసికి అబద్ధం చెప్పి మళ్ళీ ముడుపులు కట్టిన ప్రదేశానికి వెళ్తాడు. మరొకవైపు శృతి బట్టలు మడతేస్తూ పరధ్యానంలో ఉండగా ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి ఏమైంది శృతి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు నన్ను క్షమించు ప్రేమ్ నువ్వు అడక్క అడక్క ఒకసారి నన్ను ఫ్రైడ్ రైస్ చేయమని అడిగావు అప్పుడు చేస్తుంటే లాస్య ఆంటీ వచ్చి అడ్డుపడింది అని శృతి జరిగింది మొత్తం వివరించడంతో ప్రేమ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
 

46

అప్పుడు శృతి అడ్డుపడి నువ్వు ఆవేశ పడకు ప్రేమ్ అదంతా తను కావాలనే చేస్తుంది అంకుల్ దృష్టిలో మనల్ని బ్యాడ్ చేయాలని చూస్తోంది అని అంటుంది శృతి. అప్పుడు ప్రేమ్ ఆవిడ ఆపితే ఆగిపోవాలా ఇప్పుడు ఆన్లైన్ లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసి ఆవిడ ముందే కూర్చుని దర్జాగా తింటాను అని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాడు. మరొకవైపు సామ్రాట్ ముడుపులు కట్టిన ప్రదేశానికి వెళ్లి అక్కడ తులసి ముడుపులో ఏముందో చూడాలి అని తీసి చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి పంతులుగారు వస్తారు. ఇతరులు కట్టిన ముడుపుని చూడడం తప్పు బాబు ఆ ముడుపు ని అమ్మవారికి చేరకుండానే నువ్వు ఓపెన్ చేసి చూసావు.
 

56

కాబట్టి ఆ ముడుపులో ఏముందో చదివి నువ్వే ఆ కోరికను తీర్చాలి లేదంటే అమ్మవారి కోపానికి బలవుతావు అనడంతో లేదు పంతులుగారు నేను తప్పకుండా ఆ కోరికను ఎలా అయినా నెరవేరుస్తాను అని ఆ పేపర్ తీసి చదువుతాడు సామ్రాట్. అప్పుడు తులసి ఆ పేపర్లో తన ఊరికి వెళ్లి తన జ్ఞాపకాలు గుర్తు చేసుకోవాలి తన చిన్ననాటి స్నేహితులని కలవాలి అని రాసి ఉండడంతో అది చూసి సంతోషపడతాడు. మరొకవైపు తులసి సామ్రాట్ ఎంత సేపు రాకపోయేసరికి అక్కడికి వెళ్తుండగా ఇంతలోనే అక్కడికి వస్తాడు.
 

66

తర్వాత సామ్రాట్ తులసి కోరికను తెలుసుకొని నవ్వుకుంటూ కార్లు ఆనందంగా ప్రయాణిస్తూ ఉంటారు. అప్పుడు తులసి సామ్రాట్ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సాంబార్ మీ ముడుపు అమ్మవారికి చేరి ఉంటుంది అని అనగా వెంటనే తులసి నా ముడుపు అమ్మవారు చదివి ఉంటారా నా కోరిక నెరవేరుతుందా అని అనగా తప్పకుండా నెరవేరుతుంది అని అంటాడు సామ్రాట్.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharwanand: సోషల్ మీడియా నుంచి శర్వానంద్ పెళ్లి ఫోటోలు మాయం..నిజంగానే విడిపోతున్నారా ?
Recommended image2
Ravi Dubey House: 'రామాయణం' లక్ష్మణుడు రవి దుబే ఇల్లు చూశారా? అదొక ఇంద్రభవనం.. 7 ఫొటోల్లో చూడండి
Recommended image3
Ramayana Movie: 'రామాయణ'కి 700 కోట్ల OTT ఆఫర్.. మేకర్స్ ఎందుకు వద్దన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved