- Home
- Entertainment
- `సలార్` రిజల్ట్ తో నాగ్ అశ్విన్‌లో టెన్షన్.. `కల్కి2898ఏడీ`పై పెరుగుతున్న ఒత్తిడి..
`సలార్` రిజల్ట్ తో నాగ్ అశ్విన్‌లో టెన్షన్.. `కల్కి2898ఏడీ`పై పెరుగుతున్న ఒత్తిడి..
`సలార్` ఇప్పుడు సంచలనాలు క్రియేట్ చేస్తుంది. ఈ ఒత్తిడి నెక్ట్స్ ప్రభాస్ మూవీ `కల్కి`పై పడబోతుంది. ఓ రకంగా నాగ్ అశ్విన్‌ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇరుకున పెట్టారని చెప్పొచ్చు.

ప్రభాస్ నటించిన `సలార్` మూవీ ఈ ఏడాదికి సరైన ఫినిషింగ్ ఇవ్వబోతుంది. ఈ ఏడాది తెలుగులో వచ్చిన ఏ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలవలేదు. చిరంజీవి `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణ `వీర సింహారెడ్డి`, `భగవంత్ కేసరి`, నాని `దసరా`, `బేబీ`, `విరూపాక్ష` చిత్రాలు విజయాలు సాధించాయి. కానీ టాలీవుడ్ సత్తా చాటిని సినిమాలు కాలేదు. ఇప్పుడు ప్రభాస్ `సలార్` దుమ్ములేపుతుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలవబోతుంది. అంతేకాదు ఇండియన్ టాప్ గ్రాసర్ లిస్ట్ లో చేరబోతుంది.
ఇదిలా ఉంటే `సలార్` సినిమా తర్వాత చాలా లెక్కలు మారిపోతున్నారు. ఆ తర్వాత వచ్చే అన్ని సినిమాలపై ఆ ప్రభావం పడబోతుంది. అంతేకాదు ప్రభాస్ సినిమాలపై ఇంకా ప్రెజర్ ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ `సలార్`తోపాటు నాగ్ అశ్విన్‌తో `కల్కి2898ఏడీ` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సైన్స్ ఫిక్షన్‌గా రూపొందుతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి భారీ కాస్టింగ్‌తో ఈ మూవీ రూపొందుతుంది.
దీంతోపాటు మారుతి దర్శకత్వంలో `రాజా డీలక్స్` (వర్కింగ్ టైటిల్) పేరుతో ఓ సినిమా చేస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతం అటు `కల్కి`తోపాటు మారుతితో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ రెండు వచ్చే ఏడాది రాబోతున్నాయి. అయితే `సలార్` హిట్ అయిన తర్వాత ఈ రెండు చిత్రాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. `సలార్`లో భారీ యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు చూశాక ఆడియెన్స్ అలాంటిది, దాన్ని మించినది ఆశిస్తారు. దానికంటే తక్కువగా ఉంటే కచ్చితంగా డిజప్పాయింట్ మెంట్ తప్పదు.
`బాహుబలి`తర్వాత ప్రభాస్‌పై ఆడియెన్స్ లో అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి. కానీ `సాహో`, `రాధేశ్యామ్`, `ఆదిపురుష్` ఆ స్థాయికి రీచ్ కాలేదు. ఫ్యాన్స్ అంచనాలకు అందుకోలేదు. దీంతో బోల్తా కొట్టాయి. ప్రభాస్‌ని ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకుడు ప్రశాంత్ నీల్ `సలార్` లో అలా చూపించారు. దానికి మించి చూపించాడు. ప్రభాస్ కటౌట్‌తో సినిమాని నడిపించాడు. ప్రస్తుతం ఈ మూవీ సంచలనాలకు కేరాఫ్‌గా మారుతుంది. వసూళ్ల పరంగా ఏ రేంజ్‌కి వెళ్తుందో చూడాలి.
ఇక దీంతో ఇప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్‌లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. మారుతి సినిమాపై పెద్దగా అంచనాలుండవు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, కమర్షియల్ సినిమా. అందులో ఆశించేందుకు గొప్పగా ఏమీ ఉండవు. భారీ యాక్షన్ మూవీస్ మధ్యలో కాస్త రిలాక్సేషన్ కోసం ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నారు. కాబట్టి అది టాప్ గేమ్‌లోకి రాదు. కానీ `కల్కి`పై మాత్రం భారీ అంచనాలుంటాయి. `సలార్` మించిన ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. దీంతో ఇది కొత్త తలనొప్పిగా మారింది.
వరుస ఫ్లాప్‌ల కారణంగా ప్రభాస్ సినిమా ఏ రేంజ్‌లో ఆడతాయి? ఎంత వరకు కలెక్ట్ చేస్తాయనే డౌట్ చాలా మందిలో ఉన్నాయి. `బాహుబలి` రాజమౌళి కారణంగా నడిచింది. ప్రభాస్ ది ఏం లేదనే కామెంట్లు కూడా వచ్చాయి. కానీ ప్రభాస్ రేంజ్‌ని రుచి చూపిస్తుంది `సలార్`. ఇండియన్ సినిమాలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక హీరోగా ప్రభాస్ నిలిచారు. దీంతో అది పూర్తిగా ఆయన ఇమేజ్‌మీదే ఆధారపడి ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఓ రకంగా నాగ్ అశ్విన్ హ్యాపీ. బడ్జెట్ పరంగా పెట్టిన దానికి రికవరీ అవుతుందని, పైగా ప్రభాస్ మార్కెట్ పెరగడంతో `కల్కి`కి అది కలిసి వస్తుంది. ఆ విషయంలో `కల్కి` నిర్మాతలు, దర్శకుడు హ్యాపీ.
కానీ కంటెంట్ పరంగా అంచనాలు భారీగా ఉంటాయి. ఎక్కువ కంటెంట్ ని ఆశిస్తారు. భారీ ఎలివేషన్లు, యాక్షన్ సీన్లని కోరుకుంటారు. ఫ్యాన్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మరి దాన్ని `కల్కి` అందుకునేలా ఉంటుందా? అనేది పెద్ద ప్రశ్న. సినిమాగా `కల్కి` పూర్తిగా భిన్నమైనది. సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతుంది. దీనికి పురాణాలు తోడు కాబోతున్నాయి. ఆ రెండింటిని మేళవిస్తూ ఎంత కన్విన్సింగ్‌గా తీయగలరనేది నాగ్ అశ్విన్‌కి పెద్ద సవాల్.
అదే సమయంలో ఆడియెన్స్ కి అర్థమయ్యేలా చెప్పడం మరో సవాల్. అదే ఇప్పుడు ఆయన్ని టెన్షన్ పెడుతుంది. మరి ఆయన ఎలాంటి ప్రెజర్ తీసుకుంటారు? ఎలాంటి సినిమాని అందించబోతున్నారనేది ఆసక్తికరం. ఇక `కల్కి`ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ దాదాపు ఐదు వందల కోట్లతో నిర్మిస్తున్నారు. ఇది కూడా రెండు భాగాలుగా రాబోతుంది.