ఇండియన్ మార్వెల్ సిరీస్‌లా కేజీఎఫ్.. ఒకేతెరపై యష్, ప్రభాస్, తారక్.. ప్రశాంత్ నీల్ ప్లాన్ అదిరిందిగా?
మార్వెల్ సిరీస్ చిత్రాల్లో సూపర్ హీరోలందరిని ఒకే తెరపై చూస్తాం. అదొక విజువల్ వండర్‌లా ఉంటుంది. ఈ ట్రెండ్ ఇండియన్ తెరపై స్టార్ట్ కాబోతుంది. ఇండియన్ ఆడియెన్స్ కూడా ఇలాంటి సిరీస్‌లను ఎంజాయ్ చేయబోతున్నారు. అందుకు `కేజీఎఫ్` వేదిక కాబోతుంది.
`ఇండియన్ మార్వెల్` సిరీస్‌కి తెరలేపబోతున్నారు `కేజీఎఫ్`(KGF) నిర్మాతలు. తాజాగా `కేజీఎఫ్` చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్ ఈ విషయాన్ని తెలిపారు. తాము మున్ముందు మార్వెల్ సిరీస్‌లా సినిమాలు చేయబోతున్నట్టు చెప్పారు. అందులో భాగంగా `కేజీఎఫ్ 3`(KGF3) కూడా ఉండబోతుందన్నారు. ఈ ఏడాది చివర్లో `కేజీఎఫ్ 3` ప్రారంభించబోతున్నట్టు చెప్పారు. 2024లో ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
ఇక్కడే ఆయన `కేజీఎఫ్` సినిమాలను `మార్వెల్` చిత్రాల మాదిరిగా చేయాలనుకున్నట్టు తెలిపారు. ఇదే ఇప్పుడు ఇండియన్ ఆడియెన్స్ కి గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఇండియన్ ఆడియెన్స్ కి సరికొత్త విజువల్ ట్రీట్‌ని రెడీ చేస్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇది ట్రెండ్ అవుతుంది. కేజీఎఫ్ ఫ్యాన్స్ ఈ చిత్రాల సిరీస్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ `సలార్`(Salaar) చిత్రాన్ని ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇది 35శాతం చిత్రీకరణ పూర్తయ్యిందని, వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదలకు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ చిత్రానికి `కేజీఎఫ్` సిరీస్‌కి సంబంధం ఉందని తెలుస్తుంది. దీన్ని ఒక క్రాస్ ఓవర్ ఫిల్మ్ గా చూపించబోతున్నట్టు సమాచారం. తాజాగా నిర్మాత కిరగందూర్ ప్రకటన కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
మరోవైపు ఎన్టీఆర్(NTR)తో ఓ సినిమా చేయనున్నారు ప్రశాంత్ నీల్. `సలార్` చిత్రం తర్వాత ఈ సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్‌తో చేయబోయే సినిమాకి `కేజీఎఫ్`కి సంబంధం ఉండబోతుందని టాక్. అంతేకాదు `మార్వెల్` చిత్రాల మాదిరిగా ఇందులో ఇతర హీరోలు అంటే ప్రభాస్, యష్‌లు కూడా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. మార్వెల్ సినిమాల్లో సూపర్‌మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్, బ్యాట్‌మ్యాన్ ఇలా అందరు సూపర్ హీరోలు వచ్చి ప్రత్యర్థులపై యుద్ధం చేస్తుంటారు. అదే మాదిరిగా ప్రశాంత్ నీల్ తీయబోయే సినిమాల్లోనూ ప్రత్యర్థులపై పోరాటంలో భాగంగా యష్(రాఖీభాయ్), ప్రభాస్(సలార్), ఎన్టీఆర్ కూడా వచ్చి యుద్ధం చేసేలా, మధ్య మధ్యలో ఆయా పాత్రలు వచ్చిపోయేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. (Indian Marvel Movies)
ఇదే నిజమైతే ప్రశాంత్ నీల్(Prashanth Neel) ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇదొక సంచలనాత్మక చిత్రంగా, సెన్సేషనల్ సిరీస్‌గా నిలవబోతుందని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. వెండితెరపై ఇద్దరు హీరోలను చూస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది ముగ్గురు, నలుగురు హీరోలు కనిపిస్తే ఇక అదొక సంచలనాత్మక సినిమా అవుతుందని, వండర్స్ క్రియేట్ చేయబోతున్నాయని చెప్పొచ్చు. మరి ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? అసలు ప్రశాంత్ నీల్ మదిలో ఏముందనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఆలోచనే సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది.
`కేజీఎఫ్` సిరీస్ నుంచి రెండు సినిమాలొచ్చాయి. `కేజీఎఫ్` మొదటి ఛాప్టర్‌కి కొనసాగింపుగా `కేజీఎఫ్ 2` (KGF2) వచ్చింది. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 14న విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ఈ చిత్రం నెల రోజుల్లోనే సుమారు రూ.1200కోట్ల కలెక్షన్లని రాబట్టింది. ఇంకా థియేటర్‌లో రన్ అవుతుంది. మున్ముందు మరిన్ని కలెక్షన్లని రాబట్టుకోబోతుంది. `కోలార్ గోల్డ్ ఫీల్డ్` నేపథ్యంలో ఈ చిత్రాలు సాగిన విషయం తెలిసిందే.