రవితేజ, చిరంజీవి ఆ రెండు చిత్రాలు చేసి తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ రావడం ఏంటి ?
Chiranjeevi and Ravi Teja: ఒక్కో హీరోకి ఒక్కో రకమైన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంచుకుని నటిస్తుంటారు. కానీ కొన్నిసార్లు తమ బాడీ లాంగ్వేజ్ కి సరిపడని కథలు ఎంచుకుని తప్పు చేస్తుంటారు.

Chiranjeevi, Ravi Teja
ఒక్కో హీరోకి ఒక్కో రకమైన బాడీ లాంగ్వేజ్, ఇమేజ్ ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే కథలు ఎంచుకుని నటిస్తుంటారు. కానీ కొన్నిసార్లు తమ బాడీ లాంగ్వేజ్ కి సరిపడని కథలు ఎంచుకుని తప్పు చేస్తుంటారు. రవితేజ, చిరంజీవి కెరీర్ లో కూడా ఆ విధంగా తప్పులు జరిగాయని ధమాకా చిత్ర రచయిత ప్రసన్న బెజవాడ అన్నారు.
megastar chiranjeevi
చిరంజీవి నటించిన ఒక చిత్రం, రవితేజ నటించిన మరో చిత్రంలో వినిపించిన సెటైర్ల గురించి ప్రసన్న బెజవాడ స్పందించారు. రవితేజకి మాస్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే రవితేజ ని ఫ్యాన్స్ మాస్ మహారాజ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. రవితేజ వెంకీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నా ఆటోగ్రాఫ్ అనే క్లాస్ మూవీలో నటించారు. ఆ చిత్రం కమర్షియల్ గా నిరాశపరిచింది.
అందులోని కంటెంట్ కి ప్రశంసలు దక్కాయి కానీ రవితేజ చేయాల్సిన చిత్రం కాదు అంటూ విమర్శలు వినిపించాయి. దీనిపై ప్రసన్న బెజవాడ మాట్లాడుతూ.. ఆ చిత్రం రిలీజ్ అయినప్పుడు నేను బి టెక్ చదువుతున్నా. ఆ చిత్రం టైటిల్స్ లో వస్తున్న కొటేషన్స్ చూసి నాకు కన్నీళ్లు వచ్చేశాయి. సినిమా ఇంకా ఎమోషనల్ గా ఉంది. అద్భుతమైన చిత్రం అది. కానీ రవితేజ చేయాల్సింది కాదు. నాని లాంటి హీరో చేసి ఉంటే ఒక క్లాసిక్ మూవీ అని అంతా ప్రశంసించేవారు.
కానీ పూర్తి విరుద్ధంగా ఇమేజ్ ఉన్న రవితేజ అందులో నటించడం తప్పు. ఇంటర్వెల్ సన్నివేశంలో రవితేజ గాయాలతో పడవలో వెళుతుంటారు. అపోజిట్ పడవలో హీరోయిన్ పెళ్లి చేసుకుని వెళుతూ ఉంటుంది. కానీ మాస్ ఆడియన్స్.. అన్నా ఏసేయ్ అన్నా వాళ్ళని అని అరుస్తున్నారు. రవితేజకి ఉన్న ఇమేజ్ అలాంటిది. కానీ ఆ సినిమా అలాంటి కథ కాదు అని ప్రసన్న బెజవాడ తెలిపారు.
Raviteja, Chiranjeevi
చిరంజీవి గారి శంకర్ దాదా జిందాబాద్ కూడా అలాంటి చిత్రమే. ఆ మూవీలో చిరంజీవి గారు ఫైట్ చేస్తుంటే మధ్యలో పవన్ కళ్యాణ్ వచ్చి రౌడీలని అడ్డుకుంటారు. పవన్ కళ్యాణ్ మధ్యలో రావడం ఫ్యాన్స్ కి హై ఇస్తుంది. కానీ కథ పరంగా అది సరైంది కాదు. అక్కడ ఉన్నది చిరంజీవి కదా.. కాబట్టి రౌడీలతో చిరంజీవి గారే ఫైట్ చేయాలి అని ప్రసన్న బెజవాడ తెలిపారు.