- Home
- Entertainment
- ఒంటినిండా నగలతో దగదగ మెరిసిపోతున్న ప్రణీతా సుభాష్ అందాలు.. పట్టుచీరలో పవన్ బ్యూటీ ఇంత అందంగానా?
ఒంటినిండా నగలతో దగదగ మెరిసిపోతున్న ప్రణీతా సుభాష్ అందాలు.. పట్టుచీరలో పవన్ బ్యూటీ ఇంత అందంగానా?
పవన్ హీరోయిన్ ప్రణీతా సుభాష్.. పెళ్లి తర్వాత ఆమె జోరు మామూలుగా లేదు. సీక్రెట్ గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో తీరైన దుస్తులు ధరించి వరుస ఫోటో షూట్లతో ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంది.

ఆపిల్ అందాల భామ ప్రణీతా సుభాష్.. తాజాగా పట్టుచీర కట్టుకుని ఏంజెల్‌లా మెరిసిపోతుంది. ఆమె లైట్ పింక్ కలర్ పట్టు చీరకట్టుకుంది. ఒంటినిండా నగలు ధరించింది. దీంతో ప్రణీత దగదగ మెరిసిపోతుంది. దీంతో ఆమె అందం రెట్టింపు అయ్యింది.
ఇందులో మూడు డిఫరెంట్ ఫోటోలను పంచుకుంది. ఓ ఫంక్షన్‌లో పేరెంట్స్ మధ్యలో కూర్చున్నట్టుగా, మరోవైపు క్లోజప్ షాట్‌లో స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తుంది ప్రణీత. ప్రస్తుతం ఈ బ్యూటీ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అభిమానులను అలరిస్తుంది.
ప్రణీత సుభాష్.. థ్రో బ్యాక్ ఫోటోలను పంచుకుంది. అంతకు ముందు ఓ ఫంక్షన్‌లో దిగిన పిక్స్ ని కొత్త వాటిని ఇప్పుడు షేర్ చేసుకుంది. ఇలా నయా అందాలతో ఆకట్టుకుంటుంది. ఇందులో ప్రణీత మాత్రం అందాల దేవతలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఆమె అందాల దగదగలు మతిపోయేలా ఉందని అంటున్నారు.
కన్నడ బ్యూటీ ప్రణీత.. తెలుగులోకి `ఏం పిల్లో ఏం పిల్లడో` చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత `బావ`లో మెరిసింది. ఇది కూడా విజయం సాధించలేదు. కానీ ప్రణీత మాత్రం తెలుగులో పాపులర్ అయ్యింది. అందంతో ఆకట్టుకుంది.
తెలుగులో ఆఫర్లు లేకపోవడంతో కన్నడ, తమిళంపై ఫోకస్ చేసింది. కన్నడలో బాగానే ఆఫర్లని దక్కించుకుంది. బిజీ హీరోయిన్ అయ్యింది. అనంతరం ఈ బ్యూటీ సెకండ్ హీరోయిన్‌గా ఆఫర్లు వచ్చాయి. `అత్తారింటికి దారేది`లో సమంత తర్వాత సెకండ్ హీరోయిన్‌గా, అలాగే `పాండవులు పాండవులు తుమ్మెద`లోనూ సెకండ్ లీడ్‌గా, `రభస`లోనూ రెండో కథానాయికగా ఆఫర్లు వచ్చాయి. పవన్ కళ్యాణ్ `అత్తారింటికి దారేది` సక్సెస్‌ని అందించింది. కానీ పెద్దగా ఆఫర్లని తేలేకపోయింది.
ఆ తర్వాత మంచు విష్ణుతో డైనమైట్, `హలో గురు ప్రేమ కోసమే`లో చిన్న రోల్ చేసింది. ఇలా చిన్న చిన్న రోల్స్ లోనే తెలుగు ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. వారికి దగ్గరయ్యింది. కానీ తెలుగులో ఆఫర్లు లేవు. దీంతో సొంత ఇండస్ట్రీ కన్నడతోపాటు హిందీ, మలయాళం, తమిళంలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది.
ఇదిలా ఉంటే 2001లో అనూహ్యంగా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. నితిన్ రాజు అనే వ్యాపారవేత్తని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత తమ పెళ్లి విషయాన్ని ప్రకటించింది ప్రణీత. ఈ బ్యూటీకి గతేడాది కూతురు `అర్నా` జన్మించింది.మళ్లీ ఇప్పుడు సినిమాలు చేస్తుంది. సెకండ్ ఇన్సింగ్స్ లో జోరు పెంచుతుంది. అదే సమయంలో అందాల ఆరబోత కూడా పెంచిందీ ఆపిల్ బ్యూటీ.