MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Prabhas: 200 కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత?

Prabhas: 200 కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత?

Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లివార్తలు మరోసారి వైరల్ అవుతున్నాయి. 200 కోట్లతో భారీ ఇంటిని నిర్మించుకుంటున్న ప్రభాస్.. త్వరలో ఓ ఇంటివాడు కూడా కాబోతున్నట్టు వస్తున్నవార్తల్లో నిజమెంత? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 09 2026, 09:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
200 కోట్ల ప్రభాస్ డ్రీమ్ హౌస్..
Image Credit : Instagram

200 కోట్ల ప్రభాస్ డ్రీమ్ హౌస్..

పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యక్తిగత జీవితం గురించి వచ్చే వార్తలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన కోకాపేట (ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్) పరిసరాల్లో ప్రభాస్ సుమారు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో.. ఒక విలాసవంతమైన రాజభవనాన్ని నిర్మిస్తున్నారనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక హంగులతో ఈ డ్రీమ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాబోయే భార్యకు కానుకగా
Image Credit : instagram

రాబోయే భార్యకు కానుకగా

అయితే, ఈ 200 కోట్ల బంగ్లాను ప్రభాస్ త్వరలోనే రాబోయే తన భార్యకు కానుకగా ఇవ్వబోతున్నారని, అందుకే ఈ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అంతే కాదు వచ్చే ఏడాది ప్రభాస్ ఒక బిజినెస్‌మెన్ కుమార్తెను పెళ్లాడబోతున్నారని, పెళ్లి పనులను ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి గారే దగ్గరుండి చూసుకుంటున్నారనే రూమర్స్ కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. పెళ్లి సమయానికి ఈ రాజభవనం పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ కుటుంబ సభ్యులు. పెళ్లవ్వగానే భార్యతో ఆ ఇంట్లోకి వెళ్లేలా ప్లాన్ చేసుకున్నట్టు రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

34
ఇంత వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి?
Image Credit : Asianet News

ఇంత వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటి?

అయితే కోకాపేటలో ప్రభాస్ ఒక లగ్జరీ ఇల్లు నిర్మిస్తున్న మాట నిజమే.. కానీ ప్రభాస్ పెళ్లిపై వస్తున్న వార్తల్లో మాత్రం నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ కానీ, ఆయన టీమ్ నుంచి కానీ..ఈ విషయంలో ఎటువంటి అప్ డేట్ రాలేదు. ప్రభాస్ పెళ్లిపై ప్రతీ సీజన్ లో ఇలాంటి న్యూస్ లు రావడం సాధారణమే. ఇక ఈసారి కొత్తగా కట్టబోయే ఇంటితో ముడిపెడుతూ...ప్రభాస్ పెళ్లి వార్తలు తెగ తిరిగేస్తున్నాయి. గతంలో చాలా సందర్భాల్లో పెళ్లి ప్రస్తావనలు వచ్చినా..'' చేసుకుంటాను.. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు'' అంటూ.. తప్పించుకున్నాడు స్టార్ హీరో.

44
ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ప్రెండ్స్ ?
Image Credit : Twitter

ప్రభాస్ రూమర్డ్ గర్ల్ ప్రెండ్స్ ?

గతంలో కూడా అనుష్క శెట్టి, కృతి సనన్ వంటి హీరోయిన్లతో ప్రభాస్ పెళ్లి అంటూ అనేక వార్తలు వచ్చాయి. ప్రస్తుతానికి ప్రభాస్ వయసు 46 ఏళ్లు దాటినప్పటికీ, ఆయన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉంది. 'ఫౌజీ' 'సలార్-2', 'కల్కి-2', 'స్పిరిట్', వంటి భారీ ప్రాజెక్టులతో ఆయన డైరీ రాబోయే మూడు నాలుగేళ్ల వరకు పూర్తిగా బిజీగా ఉంది. కాబట్టి వచ్చే ఏడాది పెళ్లి అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ఆ 'డార్లింగ్' పెళ్లి ముచ్చట ఎప్పుడు జరుగుతుందనేది కాలమే సమాధానం చెప్పాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
అనుష్క శెట్టి
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Recommended image2
Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved