- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్ V/S ప్రభాస్.. పవర్ స్టార్‌కే ఓటేసిన రానా.. మల్టీస్టారర్లపై కామెంట్
పవన్ కళ్యాణ్ V/S ప్రభాస్.. పవర్ స్టార్‌కే ఓటేసిన రానా.. మల్టీస్టారర్లపై కామెంట్
రానా.. తెలుగులో రెండు మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. `బాహుబలి`, `భీమ్లానాయక్`లో నటించారు. ప్రభాస్, పవన్‌లతో ఆయన కలిసి నటించాడు. మరి ఈ ఇద్దరి ఆయనకు నచ్చిన హీరో ఎవరంటే?

రానా తన కెరీర్‌లో చాలా మల్టీస్టారర్ సినిమాలు చేశారు. తెలుగులో మాత్రం ప్రధానంగా రెండు సినిమాలు చేశారు. ఒకటి `బాహుబలి`, రెండు `భీమ్లా నాయక్`. ఇందులో `బాహుబలి`లో ప్రభాస్‌తో కలిసి నటించారు. ఇందులో ఆయనది నెగటివ్ రోల్. భళ్లాలదేవగా అదరగొట్టాడు రానా. రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఇండియన్ సినిమా రికార్డులు షేక్ చేసింది.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి `భీమ్లా నాయక్` చిత్రంలో నటించారు. పవన్, రానాల కాంబినేషన్‌లో సినిమా అంటే చాలా క్రేజీగా ఉంటుందని అభిమానులు, సాధారణ ఆడియెన్స్ కూడా అనుకున్నారు. ఈ ఇద్దరు కూడా అంతే క్రేజీగా చేశారు. ఇందులో పవన్ పోలీస్‌గా, రానా ఎక్స్ ఆర్మీగా కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. ఇందులో ఈ ఇద్దరు కలిసే సన్నివేశాలు ఆద్యంతం రక్తికట్టించేలా ఉంటాయి. సినిమా విజయంలో ఈ ఇద్దరి పాత్ర ఎంతో ఉంది. సినిమాలో పవన్ పాత్ర కంటే రానా పాత్రకే ఎక్కువ ప్రశంసలు దక్కడం విశేషం.
ఇదిలా ఉంటే తాజాగా రానాకి.. తాను నటించిన మల్టీస్టారర్ చిత్రాల్లో ఏది ఇష్టం, బాగా నచ్చిందనే ప్రశ్న ఎదురయ్యింది. రానా.. తన `పరేషాన్` చిత్ర టీమ్‌తో కలిసి సుమ యాంకర్‌గా చేస్తున్న `సుమ అడ్డా` షోకి వెళ్లారు. ఇందులో తనదైన కామెడీతో నవ్వులు పూయించాడు రానా. యాంకర్ సుమకే తనదైన ఆన్సర్లతో, పంచ్‌లో చుక్కలు చూపించాడు. అనంతరం.. సుమ.. మీరు నటించిన మల్టీస్టారర్ చిత్రాల్లో ఏ హీరో అనగానే బాగా ఎగ్జైట్‌గా, వాహ్ అనేలా ఫీలయ్యారు అని అడిగింది. దీనికి రానా చాలా బ్యాలెన్స్డ్ గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.
`బాహుబలి` డిఫరెంట్ ఎగ్జైట్‌మెంట్.. కానీ `భీమ్లా నాయక్` మోస్ట్ ఎగ్జైట్‌మెంట్ మూవీ తాను నటించడానికి అని తెలిపారు. అంటే ప్రభాస్‌తో సినిమా చేయడం డిఫరెంట్ ఎగ్జైట్‌మెంట్ అని, కానీ పవన్ కళ్యాణ్‌తో నటించడమనేది చాలా ఎగ్జైట్ చేసిందని ఆయన వెల్లడించారు. ప్రభాస్‌తో పోల్చితే పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడమే తనకు ఎక్కువ ఎగ్జైట్‌మెంట్‌ని ఇచ్చిందని రానా వెల్లడించారు. ప్రస్తుతం `సుమ అడ్డా` ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. వైరల్ అవుతుంది.
ఇక రానా చివరగా `విరాటపర్వం` చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆయన యంగ్ టీమ్‌తో కలిసి `పరేషాన్` అనే చిత్రాన్ని తీశారు. ఇది విడుదలకు సిద్దమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక నెక్ట్స్ ఆయన తనకు `నేనే రాజు నేనే మంత్రి` వంటి బంపర్ హిట్‌ని అందించిన తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దీనికి `రాక్షస రాజ్యం`అనే టైటిల్ అనుకుంటున్నట్టు ఇటీవల తేజ వెల్లడించిన విషయం తెలిసిందే.