వెంకీ, నాని, నితిన్ ఆశలపై ప్రభాస్ ఊహించని దెబ్బ.. ఢీ కొడతారా? పారిపోతారా?
విక్టరీ వెంకటేష్, నేచురల్ స్టార్ నాని, నితిన్ ఎన్నో ఆశలతో ఉన్నారు. ఈ సారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే తపనతో ఉన్నారు. అందుకు టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఊహించని దెబ్బ ప్రభాస్ రూపంలో పడింది. దీంతో విలవిలలాడిపోతున్నారు.

salaar
ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ `సలార్`(Salaar). అన్నీ బాగుంటే ఈ గురువారం(సెప్టెంబర్ 28) విడుదల కావాల్సిన సినిమా. కానీ వీఎఫ్‌ఎక్స్ డిలే కారణంగా వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. డైనోసార్ ఎటాక్ మూడు నెలలు పోస్ట్ పోన్ అయ్యింది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ విలన్‌గా నటిస్తున్నాడు.
ప్రభాస్ ఫ్యాన్స్ కిది హ్యాపీ ఇచ్చే వార్తే కాని, విక్టరీ వెంకటేష్(Venkatesh), నాని(Nani), నితిన్(Nithin)లకు, వారికి ఫ్యాన్స్ కి మాత్రం మింగుడు పడని అంశం. ఎందుకంటే ఈ సినిమాలు కూడా క్రిస్మస్ కానుకగనే విడుదల చేయాలనుకున్నారు. ఇయర్ ఎండింగ్‌ని క్యాష్ చేసుకోవాలని, హిట్లు కొట్టాలని బోలెడు ఆశలతో ఉన్నారు. ఇన్నాళ్లు అదే ఆశలు, అదే ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కానీ అనూహ్యంగా వారి ఆశలపై దెబ్బ కొట్టాడు ప్రభాస్. ఉండాలా? తప్పుకోవాలా? అనే పరిస్థితి తీసుకొచ్చాడు.
వెంకటేష్ హీరోగా నటిస్తున్న `సైంధవ్`(Saindhav) చిత్రాన్ని కూడా డిసెంబర్‌లోనే విడుదల చేయాలని టీమ్ నిర్ణయించింది. ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ 22నే రిలీజ్ డేట్ని ప్రకటించింది. `హిట్` చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తోన్న చిత్రమిది. తాజాగా `సలార్` రిలీజ్ డేట్‌ని తమ సినిమాపైనే వేయడంతో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతున్నారని టాక్. సినిమాని అదే రోజు రిలీజ్ చేయాలా? లేక ముందుకో, వెనక్కీ వెళ్లిపోవాలా? అనే దైలమాలో ఉన్నట్టు సమాచారం. వెంకటేష్ గత చిత్రం `ఎఫ్3` డిజప్పాయింట్ చేసింది. దీంతో ఈ సినిమాతోనైనా సరైన హిట్ కొట్టాలని భావిస్తున్నారు వెంకీ. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, ఆండ్రియా, ఆర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇక నాని కూడా ఎప్పుడో తాను నటిస్తున్న `హాయ్ నాన్న`(Hi Nanna) చిత్ర రిలీజ్ డేట్‌ని ఇచ్చారు. డిసెంబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు తెలిపారు. లేటెస్ట్ క్రేజీ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా, శృతి హాసన్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రమిది. చివరగా `దసరా`తో హిట్ అందుకున్న నాని, `హాయ్ నాన్న`తో దాన్ని కంటిన్యూ చేయాలనుకున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేయాలని భావించారు. మరి ఒక్క రోజు గ్యాప్‌తో `సలార్` వస్తుంది. ఇది నాని సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో నాని `హాయ్ నాన్న` చిత్రాన్ని అదే డేట్‌కి రిలీజ్ చేస్తాడా? మార్చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. కానీ ఈ వార్త టీమ్‌ని మాత్రం కలవరానికి గురి చేస్తుందని టాక్.
మరోవైపు డిసెంబర్ 23న నితిన్ నటిస్తున్న `ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్` (Extra Ordinary Man)సినిమాని కూడా విడుదల చేయబోతున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగనే ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలనుకున్నారు. ఇయర్ ఎండింగ్‌లో కూల్‌గా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేసి హిట్ అందుకోవాలనుకున్నారు. కానీ ఆయన ఆశలను ప్రభాస్ దెబ్బకొట్టాడు. జీర్ణించుకోలేని దెబ్బ కొట్టాడు. మరి ప్రభాస్ తో పోటీ పడతారా? పోటీ నుంచి తప్పుకుంటారా? అనేది ఆసక్తిరంగా మారింది.
మరో యంగ్ హీరో సుధీర్‌బాబు(Sudheer Babu) కి కూడా `సలార్` సినిమా షాకిచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న `హరోమ్ హర` (Harom Hara) అనే చిత్రాన్ని కూడా డిసెంబర్ 22నే రిలీజ్ చేయాలనుకున్నారు. జ్ఞాన సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రిస్మస్ కానుకగా తమ సినిమాని ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలని టీమ్ కష్టపడుతుంది. అంతా బాగుందనుకునే సమయంలో ప్రభాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. సరిగ్గా అదే డేట్ కి `సలార్`ని రిలీజ్ చేస్తుండటంతో అయోమయంలో పడ్డారు. మరి ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి సీనియర్ హీరో నుంచి, యంగ్ హీరోల వరకు ప్రభాస్ ఇచ్చిన షాక్‌కి విలవిలలాడిపోతున్నారు.
ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే అదే సమయంలో హిందీ మూవీ కూడా రాబోతుంది. ఈ ఏడాది బ్యాక్ టూ బ్యాక్ రెండు సంచలనాలు క్రియేట్ చేసిన షారూఖ్ మరోసారి రాబోతున్నారు. ఆయన హీరోగా నటించిన `డుంకీ`(Dunki) చిత్రాన్ని కూడా క్రిస్మస్ కానుకగానే రిలీజ్ చేస్తున్నారు. జనవరిలో `పఠాన్`తో సంచలనాలు క్రియేట్ చేశారు షారూఖ్. ఇది వెయ్యి కోట్లు వసూలు చేసింది. ఇటీవల `జవాన్`తో వచ్చి దుమ్ము రేపారు. ఇది కూడా వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది, ఇంకా ఆడుతుంది. ఇప్పుడు ఇయర్ ఎండింగ్‌కి డిసెంబర్ 22న తన `డుంకీ` చిత్రంతో రాబోతున్నారు. ఇది రాజ్‌కుమార్ హిరానీ రూపొందించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. గత రెండు చిత్రాలను మించి ఉండోబోతుందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ఇటు `సలార్`కి దెబ్బ మాత్రమే కాదు, ఇతర చిత్రాలకు కూడా పెద్ద షాకే. ఎందుకంటే షారూఖ్ సినిమాలు ఇప్పుడు తెలుగులోనూ బాగా ఆడుతున్నాయి. అది తెలుగు చిత్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు.