MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • పెదనాన్నతో చేసిన సినిమా థియేటర్లో ఫ్యాన్స్ తో చూసిన ప్రభాస్‌.. దెబ్బకి హార్ట్ ఎటాక్‌.. అందుకే సంచలన నిర్ణయం

పెదనాన్నతో చేసిన సినిమా థియేటర్లో ఫ్యాన్స్ తో చూసిన ప్రభాస్‌.. దెబ్బకి హార్ట్ ఎటాక్‌.. అందుకే సంచలన నిర్ణయం

ప్రభాస్‌ తన సినిమా విడుదలైన రోజు ఏం చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన డార్లింగ్‌ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు.   

3 Min read
Author : Aithagoni Raju
Published : Jun 25 2024, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రభాస్‌ ప్రస్తుతం `కల్కి 2898 ఏడీ` సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. `సలార్‌` వంటి హిట్‌ కొట్టిన ఆయన ఇప్పుడు సోషియో మైథలాజికల్‌ ఫిల్మ్ తో అలరించేందుకు వస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన ఈ సినిమా భారీ కాస్టింగ్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందిన విషయం తెలిసిందే. మరోరెండు రోజుల్లో ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. అనేక వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ నెల 27న విడుదల కాబోతుంది `కల్కి`. సినిమా కోసం ఫ్యాన్స్, సాధారణ ఆడియెన్స్ సైతం ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇదిలా ఉంటే తన సినిమా రిలీజ్‌ రోజు ప్రభాస్‌ ఏం చేస్తాడనేది ఆసక్తికరం. ఆయన విదేశాలకు వెళ్లిపోతారని అంటుంటారు. తనకు ఇచ్చిన ప్లే లండన్‌ కి చెక్కేస్తాడని తెలుస్తుంది. కానీ ప్రభాస్‌ తాను ఏం చేస్తానో చెప్పాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో కూడా వెల్లడించారు. తాను షై(సిగ్గు, బిడియం) పర్సన్‌ అని చెప్పాడు. చాలా లేజీ అని, షై అని, పబ్లిక్‌తో త్వరగా కలవలేనని వెల్లడించాడు ప్రభాస్‌. ఈ మూడు బలహీనతలతోపాటు మరో వీక్‌నెస్‌ని కూడా ఆయన వెల్లడించారు. 
 

37

తన సినిమా రిలీజ్‌ రోజు తాను ఎవరినీ కలవడట. ఫోన్‌, టీవీ అన్నింటిని ఆఫ్‌ చేసుకుని పూర్తిగా ప్రైవేట్‌గా ఒక్కడే ఉంటాడట. రిలీజ్‌ టెన్షన్‌ తనకు చాలా ఉంటుందని, అందుకే ఆ పని చేస్తానని వెల్లడించారు. సినిమా హిట్‌ టాక్‌ వస్తే ఫోన్‌ చేయండి, లేదంటే వదిలేయండి అని తన ఫ్రెండ్స్ కి చెబుతాడట. తనని ఎవరూ డిస్ట్రర్బ్ చేయోద్దని ముందే చెబుతాడట ప్రభాస్‌. 
 

47

దీనికి కారణం చెప్పాడు. తాను తన పెదనాన్నతో కలిసి `రెబల్‌` చిత్రంలో నటించాడు. ఈ మూవీ రిలీజ్‌ రోజు ఆయన డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నాడు. ఈ మూవీ కచ్చితంగా ఫ్యాన్స్ తో చూస్తానని థియేటర్‌కి వెళ్లాడట. అభిమానుల మధ్య కూర్చొని చూశాడట. సినిమా స్టార్ట్ అయిన అరగంటకి, షివరింగ్‌ వచ్చిందట. హార్ట్ ఎటాక్‌ వచ్చినంత పనైందని తెలిపాడు ప్రభాస్‌. ఎందుకంటే ఆ సినిమాకి ఆడియెన్స్ నుంచి బ్యాడ్‌ రెస్పాన్స్ వచ్చింది. అది చూసి ప్రభాస్‌ తట్టుకోలేకపోయాడు. దీంతో థియేటర్‌లోనే హార్ట్ ఎటాక్‌ వచ్చినంత పనైందని, అప్పట్నుంచి ఓ స్ట్రాంగ్‌ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు ప్రభాస్. 
 

57

ఆ సినిమా నుంచి తన సినిమా విడుదలవుతుందంటే పూర్తిగా ప్రైవేట్‌గా మారిపోతానని, ఎవరిని కలవనని తెలిపారు. అది హైదరాబాద్‌లో అయినా, లేదంటే విదేశాల్లో ఉన్నా, అన్నీ వదిలేసి పడుకుంటానని, ఎవరూ డిస్టర్బ్ చేయోద్దని చెబుతానని, హిట్‌ టాక్‌ వస్తే బ్రేక్‌ చేయండి, లేదంటే చెప్పొద్దు అని అంటుంటాడట ప్రభాస్‌. 
 

67

ఈ సందర్భంగా `బాహుబలి` సినిమా అనుభవాన్ని పంచుకున్నారు. `బాహుబలి` సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నాడట. మొదటి పార్ట్ విడుదలైనప్పుడు ఆ రెస్పాన్స్ ని ఊహించలేదట. పెద్ద షాక్‌ అయినట్టు తెలిపారు. `బాహుబలి` ఇండియా వైడ్‌గా పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలోనూ విడుదలైంది. అయితే ఈ మూవీకి తెలుగులో మొదటి షోస్‌ నుంచి నెగటివ్‌ టాక్‌ వచ్చిందట. ఆడియెన్స్, ఫ్యాన్స్ పెదవి విరిచారట. తమిళంలో హిట్‌ టాక్‌ వచ్చింది, నార్త్ లోనూ పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. కానీ తెలుగులో నెగటివ్‌ టాక్‌ రావడంతో చాలా టెన్షన్‌ పడ్డాడట. అదేంటి ఇలా అయ్యిందని షాక్‌ అయ్యాడట ప్రభాస్‌. 

77

అయితే తెలుగులో ఫ్యాన్స్ తనపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు. పైగా క్లైమాక్స్ లో కట్టప్ప బాహుబలిని చంపేస్తాడు. దాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే నెగటివ్‌ టాక్‌ వచ్చింది.కానీ నార్త్, సౌత్‌లో తనపై పెద్దగా అంచనాలు లేవు,కొత్త సినిమాగా చూశారు. వారికి తెగ నచ్చింది. అయితే తెలుగులోనూ రాత్రి షోలకు మళ్లీ టాక్‌ మారిందని, రెండో రోజు నుంచి పుంజుకుందని, అప్పుడుగానీ రిలాక్స్ కాలేదని చెప్పాడు ప్రభాస్‌. సాహో ఇంటర్వ్యూ టైమ్‌లో ప్రభాస్‌ ఈ విషయాలను వెల్లడించాడు. ఇప్పుడు `కల్కి` రిలీజ్‌ నేపథ్యంలో ఆయన లండన్‌ వెళ్లిపోతున్నాడని సమాచారం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
కృష్ణంరాజు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved