ప్రభాస్ కు ఆ సమస్య ఉంది, కె విశ్వనాథ్ మందలించారు, రాజమౌళినే తిడతారు
నాతో పనిచేసిన దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు. ‘ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు’ అని అనేవారు’’ అంటూ ప్రభాస్
prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ సినిమాలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి.
అయితే ఆ తర్వాత వచ్చిన సలార్, కల్కీ 2898AD చిత్రాలు హిట్ అయ్యి కలిసి వచ్చాయి. ఈ రెండు సినిమాలు భారీ కలెక్షన్స్ తో నిర్మాతలకు ఆనందాన్ని కలిగించాయి. అయితే ప్రభాస్ షూటింగ్ లో ఎలా ఉంటాడో, ముఖ్యంగా రాజమౌళి తో చేసినప్పుడు చెప్పిన ఓ ఎక్సపీరియన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయిన ప్రభాస్ వర్షం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమాతో ప్రభాస్ కు ఫాలోయింగ్ పెరిగింది.. ఆ సినిమా తరువాత ప్రభాస్ ఎన్ని సినిమాలు చేసిన స్టార్ స్టేటస్ అందుకోలేదు.ఆ టైంలో ప్రభాస్ దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకేక్కిన ఛత్రపతి మూవీ అల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సినిమాలో ప్రభాస్, శ్రియా జంటగా నటించారు.2005లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అప్పట్లో ఈ ఏకంగా రూ.30 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. పూర్తిగా మాస్ యాక్షన్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా లో భానుప్రియ కీలకపాత్ర పోషించారు.ఈ సినిమాతో ప్రభాస్ స్టార్ హీరోగా మారారు.
అయితే ఇన్ని సినిమాలు చేసినా, ఇంత ఎదిగినా ఆయనలో సిగ్గు మాత్రం పోలేదు. ఈవెంట్స్ లో పెద్దగా మాట్లాడరు. అలాగే మీడియా మీట్ లోనూ జస్ట్ ఓకే అన్నట్లు ఉంటారు. అయితే కెరీర్ ప్రారంభం రోజుల్లో ఇది మరీ ఎక్కువ ఉండేది. షూటింగ్‌లోనూ ఇలాగే ఇబ్బంది పడేవారట. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ షూటింగ్ లోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
ఛత్రపతి సినిమాలో బాజీరావును చంపేసిన తర్వాత ప్రభాస్ అతడి శవాన్ని ఈడ్చుకెళ్లి రాజకీయ నాయకుడైన అప్పలనాయుడు (కోట శ్రీనివాసరావు)కు వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేస్తానని చెబుతాడు. అయితే, అప్పుడు సెట్‌లో ప్రభాస్ డైలాగ్‌లే చెప్పలేదట. కేవలం పెదవులు మాత్రమే కదిపారట. ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా చెప్పుకొచ్చారు. అది బాగా క్లిక్ అవటంతో తర్వాత కూడా అదే టెక్నిక్ వాడానని అన్నారు.
Prabhas
ప్రభాస్ మాట్లాడుతూ...‘‘ఇంటర్వెల్ షాట్‌లో జనాన్ని ఉద్దేశించి మాట్లాడాలి. ఒకపక్క వర్షం. పైగా చలి. చుట్టూ విపరీతంగా జనం. ఇబ్బందిగా అనిపించింది. రాజమౌళి దగ్గరకు వెళ్లి ‘డార్లింగ్ డైలాగ్ గట్టిగా చెప్పలేను. సైలెంట్‌గా చెబుతాను’ అని అనడంతో రాజమౌళి కూడా ఓకే అన్నారు. ఆ షాట్‌లో కేవలం పెదాలు కదిపానంతే. అక్కడున్న వాళ్లకు నేను ఏ చేస్తున్నానో అర్థం కాలేదు. షాట్ ఓకే అయిపోయింది. జనం ఉంటే ఎందుకో సైలెంట్ అయిపోతా అని చెప్పుకొచ్చారు.
‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ చేస్తున్నప్పుడు కూడా విశ్వనాథ్‌గారు సెట్‌లో ఉండగా ఇలాగే సైలెంట్‌గా డైలాగ్‌లు చెప్పేవాడిని. ఆయన పిలిచి ‘ఇలా అయితే ఎలా? ఓపెన్‌గా డైలాగ్ చెప్పాలి. మరీ అంత సిగ్గుపడితే ఎలా?’ అన్నారు. నాతో పనిచేసిన దర్శకులు అందరూ రాజమౌళిని తిట్టుకుంటారు. ‘ఆయన వల్లే నువ్వు ఇలా చెబుతున్నావు’ అని అనేవారు’’ అంటూ ప్రభాస్ ఓ షోలో చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ (The Raja Saab) శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. హారర్, థ్రిల్లర్ గా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు.
ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారు. 1940 దశకంలో జరిగే కథ అని కాన్సెప్ట్ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్. ఇటీవల షూటింగ్ మొదలైంది. దీంతో పాటు ‘కల్కి2’, ‘సలార్2’ చేయాల్సి ఉంది. మంచు విష్ణు ‘కన్నప్ప’లోనూ అతిథి పాత్రలో ప్రభాస్ మెరవనున్నారు.