50 ఏళ్ళ వయసులో బికినీ వేస్తే, వామ్మో అనుష్కపై ప్రభాస్ ఇలాంటి సెటైరా.. సిగ్గుతో ముఖం దాచేసుకుంది
ప్రభాస్, అనుష్క శెట్టి సూపర్ హిట్ పెయిర్ అనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ లో వీళ్ళ జంట అదిరిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క స్పీడ్ తగ్గించింది కానీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంది.
ప్రభాస్, అనుష్క శెట్టి సూపర్ హిట్ పెయిర్ అనే సంగతి తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్ లో వీళ్ళ జంట అదిరిపోయింది. బాహుబలి తర్వాత అనుష్క స్పీడ్ తగ్గించింది కానీ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తూనే ఉంది. ఇక ప్రభాస్ గురించి చెప్పనవసరం లేదు.. పాన్ ఇండియా స్టార్ గా భారీ చిత్రాలతో దూసుకుపోతున్నాడు.
ప్రభాస్, అనుష్క గురించి గతంలో చాలా రూమర్స్ వచ్చాయి. వీళ్లిద్దరి మధ్య ఎఫైర్ సాగుతోంది అని.. పెళ్లి కూడా చేసుకుంటారని చాలా రూమర్స్ చక్కర్లు కొట్టాయి. ఆ రూమర్స్ ని అనుష్క, ప్రభాస్ ఖండించారు. ప్రభాస్ వయసు 45 ఏళ్ళు, అనుష్క వయసు 42 ఏళ్ళు. ఇంతవరకు వీళ్ళిద్దరూ పెళ్లి ఊసు ఎత్తడం లేదు.
ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఒక్క చోట చేరితే చాలా ఫన్నీగా మాట్లాడుకుంటారు. ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఒక సందర్భంలో ప్రభాస్ తనపై వేసిన సెటైర్ కి అనుష్క సిగ్గుతో ముఖం దాచేసుకుంది. పడీ పడీ నవ్వుకుంది. ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అనుష్కని ఇలా ప్రశ్నించింది. 50 ఏళ్ళ వయసులో మీరు చేకూడదు అనుకుంటున్న పని ఏంటి అని యాంకర్ అడిగారు.
అనుష్క ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది. పక్కనే ఉన్న ప్రభాస్ వెంటనే బిల్లా మూవీ అని సమాధానం ఇచ్చారు. దీనితో ఒక్కసారిగా అనుష్క పగలబడి నవ్వుకుంది. సిగ్గుతో చేతులతో ముఖాన్ని దాచేసుకుంది. బిల్లా చిత్రంలో అనుష్క బికినీలో హాట్ హాట్ గా అదరగొట్టిన సంగతి తెలిసిందే. 50 ఏళ్ళ వయసులో బికినీ వేస్తే బాగోదు అనే ఫన్నీ మీనింగ్ వచ్చేలా పరోక్షంగా ప్రభాస్ సెటైర్ వేశాడు.
ప్రభాస్, అనుష్క కలసి తొలిసారి నటించిన చిత్రం బిల్లా. ఈ మూవీలో అనుష్క చాలా బోల్డ్ గా కనిపించింది. బికినీ సన్నివేశాల్లో నటించింది. అనుష్క బికినీ ధరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.